వెలపాటి రామరెడ్డి

వెలపాటి రామరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధ్యాపకుడు, కవి. ఆయన రాసిన తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[1][2]

వెలపాటి రామరెడ్డి
జననం
మరణం27 మే 2021
కనకదుర్గ కాలనీ, హన్మకొండ, వరంగల్ జిల్లా
జాతీయత భారతదేశం
వృత్తిసాహితీవేత్త , రిటైర్డ్‌ అధ్యాపకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం
తల్లిదండ్రులుకేశవరెడ్డి, చిలకమ్మ

జననం, విద్యాభాస్యం

మార్చు

వెలపాటి రామరెడ్డి తెలంగాణ రాష్ట్రం , వరంగల్ జిల్లా, కొడకండ్ల మండలం , రేగుల గ్రామంలో 4 నవంబర్‌ 1932లో కేశవరెడ్డి, చిలకమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బిఏ ఇంగ్లిష్ వరకు చదువుకున్నాడు.

ఆయన రచనలు

మార్చు
  • తెలంగాణ కావ్యం
  • వీరతెలంగాణ
  • తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం
  • వెలుగు నీడలు
  • తెలంగాణ పద్యమంజరి
  • కోటిగాయాల మౌనం తెలంగాణ
  • తెలంగాణ నడుస్తున్న చరిత్ర
  • నవశకం
  • తెలంగాణ శకారంభం
  • స్వేచ్ఛ విహంగాలు
  • తెలంగాణ భావ తరంగాలు
  • తెలంగాణ పద సౌరభం
  • రేగుల గ్రామ చరిత్ర
  • తెలంగాణ - ఏడో తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశం
  • మన శిల్పారామం రామప్ప - ఇంటర్మీడియట్ తెలుగు వాచకంలో పాఠ్యాంశం [3]

వెలపాటి రామరెడ్డి 27 మే 2021లో వరంగల్‌ జిల్లా, హన్మకొండ, కనకదుర్గ కాలనీలోని తన స్వగృహంలో మృతి చెందాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
  2. Andhrajyothy (1 June 2017). "52 మందికి ప్రభుత్వ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  3. Sakshi (27 May 2021). "అక్షర యోధుడు రాంరెడ్డి ఇక లేరు." Sakshi. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  4. Namasthe Telangana (27 May 2021). "సాహితీవేత్త వెలపాటి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం". Namasthe Telangana. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  5. Namasthe Telangana (27 May 2021). "వెల‌పాటి రామ‌రెడ్డి మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Namasthe Telangana. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.