వెల్‌కమ్ ఒబామా 2013 సెప్టెంబరు 20, శుక్రవారం విడుదలైన తెలుగు చిత్రం.

వెల్‌కమ్ ఒబామా
(2013 తెలుగు సినిమా)
Welcome obama.jpg
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం భారతీకృష్ణ
తారాగణం ఊర్మిళ
రేచల్
ఎస్తాబన్
సంజీవ్
సంభాషణలు రోహిణి
భాష తెలుగు

కథసవరించు

లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భం(సరోగసి) ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో మనదేశం లోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. యశోదకు డబ్బు చాలా అవసరం. తన పెంపుడు కూతురు ఆపరేషన్ నిమిత్తం ఆమెకు అర్జంట్‌గా లక్ష రూపాయిలు కావాలి. దాంతో తన గర్భం ద్వారా లూసీ బిడ్డకు జన్మనీయడానికి యశోద అంగీకరిస్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. లూసీ దంపతుల బిడ్డ యశోద కడుపులో పడుతుంది. నెలలు నిండుతాయి. యశోదను వైద్య పరీక్షలకి తీసుకెళుతుంది లూసీ. యశోద కడుపులోని బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురవుతుంది.

అలాంటి బిడ్డ తనకొద్దంటుంది. ప్రసవానంతరం బిడ్డను ఆనాథ శరణాలయంలో పడేయమని యశోదకు డబ్బు కూడా ఇవ్వబోతుంది. కానీ యశోద మాత్రం ఒప్పుకోదు. అందరూ ఉన్న తన బిడ్డ అనాథ ఎలా అవుతాడని లూసీని నిలదీస్తుంది. కానీ లూసీ మాత్రం ఆ బిడ్డ తనకొద్దంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోతుంది. తీరా యశోదకు ఎలాంటి లోపం లేని చక్కని మగబిడ్డ పుడతాడు. ఆ తెల్లజాతి బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది యశోద. కొన్నేళ్లు గడుస్తాయి. ఓ రోజు లూసీ మళ్లీ యశోద ముందు ప్రత్యక్షమవుతుంది. తన బిడ్డను తనకిచ్చేయమంటుంది. యశోద గుండె బద్దలైనంత పనవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

బయటి లంకెలుసవరించు