వేదరత్నం అప్పకుట్టి
వేదరత్నం అప్పకుట్టి పిళ్ళై, తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త. తమిళనాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో మహిళల సంక్షేమం కోసం పనిచేసే లాభాపేక్షలేని సంస్థ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకుడు.[1]
వేదరత్నం అప్పకుట్టి | |
---|---|
జననం | వేదారణ్యం, నాగపట్నం జిల్లా, తమిళనాడు, భారతదేశం |
ఇతర పేర్లు | వేదరత్నం అప్పకుట్టి పిళ్ళై |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త |
తల్లిదండ్రులు | ఎ. వేదరత్నం పిళ్ళై |
పురస్కారాలు | పద్మశ్రీ |
జననం
మార్చువేదరత్నం అప్పకుట్టి పిళ్ళై, తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని వేదారణ్యంలో జన్మించాడు. తండ్రి ఎ. వేదరత్నంకి ఉప్పు వ్యాపారం ఉంది. స్వాతంత్ర్య ఉద్యమకారుడిగా ఉద్యమంలో పాల్గొన్నాడు.[2] తన తండ్రితో పాటు అతను కూడా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
సామాజిక సేవ
మార్చువేదారణ్యం గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల బాలికల కోసం గ్రామీణ రెసిడెన్షియల్ పాఠశాల అయిన కస్తూర్బా గాంధీ కన్యా[3] గురుకులాన్ని ఏర్పాటుచేయడంలో తన తండ్రికి సహకరించాడు.[4][5] తరువాతికాలంలో ప్రింటింగ్ పాఠశాల, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ శిక్షణ పాఠశాల, ధూపం తయారీ యూనిట్‌ను స్థాపించారు.[6]
పురస్కారాలు
మార్చు1989లో భారత ప్రభుత్వం నుండి భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు.[7]
మూలాలు
మార్చు- ↑ "Services of freedom fighter Sardar Vedaratnam recalled". The Hindu. 27 February 2008. Retrieved 8 September 2021.
- ↑ "Indian Freedom Fighters: Sardar A. Vedaratnam Pillai, Vedaraniam, Tamil Nadu". www.sb.fsu.edu. Archived from the original on 20 జనవరి 2022. Retrieved 8 September 2021.
- ↑ Reporter, Staff (2011-01-26). "Two NGOs receive Japanese grant". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 8 September 2021.
- ↑ "Kavignar Ramalingam Pillai's statue unveiled by Elangovan". The Hindu. 16 February 2009. Retrieved 8 September 2021.
- ↑ "Indian Freedom Fighter". SB FSU. 2006. Archived from the original on 20 జనవరి 2022. Retrieved 8 September 2021.
- ↑ "Satsang introduction". Oocities. 2015. Retrieved 8 September 2021.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 8 September 2021.