సర్దార్ వేదరత్నం

భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు

సర్దార్ వేదరత్నం పిళ్ళై (1897 ఫిబ్రవరి 25 - 1961 ఆగస్టు 24) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, 14 సంవత్సరాలపాటు (మూడుసార్లు) ఎమ్మెల్యేగా పనిచేశాడు. 1930లో సి. రాజగోపాలాచారితో కలిసి వేదారణ్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నాడు. వీరోచిత రచనలు కూడా చేశాడు.

సర్దార్ వేదరత్నం పిళ్ళై
1998 భారత స్టాంపు మీద వేదరత్నం ఫోటో
జననం25 ఫిబ్రవరి 1897[1]
వేదారణ్యం, నాగపట్నం జిల్లా, తమిళనాడు, భారతదేశం
మరణం1961 ఆగస్టు 24(1961-08-24) (వయసు 64)
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు
పిల్లలువేదరత్నం అప్పకుట్టి (కుమారుడు)

జననం మార్చు

వేదరత్నం 1897, ఫిబ్రవరి 25న తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని వేదారణ్యంలో జన్మించాడు.

ఉద్యమం మార్చు

గాంధీజీ చేస్తున్న ఉద్యమం చూసి ఆ ప్రభావంతో విదేశీ వస్త్రాన్ని బహిష్కరించి, స్వదేశి దుస్తులను తయారుచేసి ధరించాలని నిర్ణయించుకున్నాడు. తన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రోత్సహించాడు. ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపాడు.[2] 1931లో వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు తిరునల్వేలిలో తమిళనాడు వ్యవసాయాధికారులు, కార్మికుల సమావేశంలో వేదరత్నానికి 'సర్దార్' బిరుదు బహూకరించారు.

సామాజిక సేవ మార్చు

వేదారణ్యం గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల బాలికల కోసం 1946లో గ్రామీణ రెసిడెన్షియల్ పాఠశాల అయిన కస్తూర్బా గాంధీ కన్యా గురుకులం స్థాపించాడు.[3]

గుర్తింపు మార్చు

పిళ్ళై స్థాపించిన గ్రామీణ మహిళా సంక్షేమ సంస్థ అనేక సంవత్సరాలుగా వేలాది మంది పేద బాలికలకు సహాయాన్ని అందింస్తూ వస్తోంది. వివిధ దేశాల నుండి చాలామంది ఈ గురుకులాన్ని సందర్శించి సేవలను ప్రశంసించారు.[3][4][5][6] మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యునిగా మూడు ఎన్నికలలో వేదరత్నం విజయం సాధించాడు. ఈ స్థానంలో అతను సంపాదించిన డబ్బును, శ్రీ రామకృష్ణ మిషన్‌కు విరాళంగా ఇచ్చాడు.[7] పదేళ్ళపాటు తంజావూరు జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఏకైక కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[2]

మూలాలు మార్చు

  1. Varadarajan, R. (25 August 2000). "Sardar of the salt satyagraha". The Hindu. Archived from the original on 2 June 2017. Retrieved 12 September 2021.
  2. 2.0 2.1 Varadarajan, R. (2000).
  3. 3.0 3.1 "Gurukulam – Just another WordPress site". www.gurukulam.org. Retrieved 12 September 2021.
  4. "Two Japanese professors visit Gurukulam in Vedaranyam". The Hindu (in Indian English). 6 March 2009. ISSN 0971-751X. Retrieved 12 September 2021.
  5. "Services of freedom fighter Sardar Vedaratnam recalled". The Hindu (in Indian English). 27 February 2008. ISSN 0971-751X. Retrieved 12 September 2021.
  6. "Archived copy". Archived from the original on 19 నవంబరు 2008. Retrieved 12 సెప్టెంబరు 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. Indian Freedom Fighters: Sardar A. Vedaratnam Pillai, Vedaraniam, Tamil Nadu. (2006).