వేదాంతం రామలింగశాస్త్రి
వేదాంతం రామలింగశాస్త్రి (Vedantam Ramalinga Sastry) కూచిపూడి నర్తకుడు. ఈయన 1963, జూన్ 3న కృష్ణాజిల్లా, మొవ్వ మండలం, కూచిపూడిలో సూర్యనారాయణ, సత్యవతమ్మ దంపతులకు జన్మించారు.[1] బహుముఖ ప్రజ్ఞాశాలి. నృత్యదర్శకునిగా, రచయితగా, నాట్యాచారునిగా, నటుడుగా, పరిశోధకుడిగా పేరు సంపాదించారు. ఈయన శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. 2022 డిసెంబరులో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎంపికయ్యారు.
చదువు
మార్చురామలింగశాస్త్రి తన స్వస్థలమైన కూచిపూడిలో 1979లో ఎస్.ఎస్.సి పూర్తి చేసారు. ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు బ్యాచిలర్ డిగ్రీ 1984లో, ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ (తెలుగు) 1990లో చేసారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటిలో కూచిపూడి నాట్యంలో డిప్లొమా చేసారు. "తెలుగులో కూచిపూడి నాటక వికాసం" నకు ఉస్మానియా యూనివర్సిటి నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
గురువులు
మార్చుఈయన కూచిపూడి నాట్యం, స్వర్గీయ వెంపటి చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి కులపతి వెంపటి పెద సత్యం, వేదాంతం రాధేశ్యాం వంటి ప్రముఖ నాట్యాచార్యుల వద్ద నేర్చుకున్నారు. గంగాధర రావు, శివునూరి విశ్వనాథశర్మ, సిహెచ్ సుబ్రమణ్యశర్మల వద్ద సాహిత్యాన్ని అభ్యసించారు.
నాట్యాచార్య
మార్చురామలింగ శాస్త్రి దక్షిణమధ్యరైల్వే హైదరాబాదు డివిజన్ లో 1989 - 2004 వరకు డాన్స్ టీచరుగా చేశారు. "శ్రీ వేదాంతం కూచిపూడి కళాపరిషత్"ను స్థాపించి వందలాది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. 2005 నుంచి కూచిపూడి కళాపీఠంలో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వందలాది కూచిపూడి కళాకారులను/శిష్యులను నాట్యాచారులుగా, నాట్యగురువులుగా మలచి దిశానిర్దేశం చేశారు.
రచయిత
మార్చుఈయన స్కూలు పాఠాలకు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ( UG, PG) కోర్సులకు కూచిపూడి సిలబస్ ను రూపొందించారు. 2021 జూన్ నాటికి అన్ని కూచిపూడి ప్రక్రియలలో 126 రూపకాలు రచించారు. ఇది కూచిపూడి నాట్యచరిత్రలో ఆల్ టైం రికార్డు. కూచిపూడి నాట్య ప్రక్రియ మీద 100 పైగా వ్యాసాలు వ్రాసారు. "తెలుగులో కూచిపూడి నాట్య వికాసం"," కూచిపూడి వ్యాసమంజరి", "గజాననీయం", "బ్రాహ్మణ సర్వస్వం", "ఇతను భామ" పుస్తకాలను రచించారు.
క్షేత్రయ్య పదాలు వలెనే కూచిపూడి రామలింగేశ్వర స్వామి మీద ఎన్నో పదాలు రచించారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న కూచిపూడి నాట్యచరిత్రను యుగాల వారిగా విభజించారు. కూచిపూడి క్రియల ప్రాముఖ్యతను క్రోడీకరించి డాక్యుమెంట్లుగా తయారు చేసారు.
కూచిపూడి నాట్యంలో "కేళిక" అనే ప్రక్రియను (14వ శతాబ్దంలో నామమాత్రంగా ఉంది) పునరుద్ధరణ చేసి 30కి పైగా రచనలను చేసి అందులో చాలావరకు ప్రదర్శనలు చేసారు. అలాగే సుమారు 50కి పైగా పీఠికాగీతాలను (థీమ్ సాంగ్స్) రచించి, ప్రదర్శన సృజించిన ఘనత కూడా వీరిదే.
రూపకర్త, ప్రదర్శనకర్త
మార్చురామలింగశాస్త్రి అన్ని రకాల కూచిపూడి ప్రక్రియలను రూపొందించి, ప్రదర్శించారు. నర్తనశాల, వినాయక చవితి, వేదోద్ధారణ, నాట్యవేదం వంటి రచించిన 126 రూపకాలలోనివి. ఈయన దుర్యోధనుడు, కంసుడు, కీచకుడు, తారకాసురుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, గజాసురుడు, సోమకాసురుడు వంటి పలు ప్రతినాయక పాత్రలు, విష్ణుచిత్తుడు, నారదుడు, విప్రనారాయణుడు, బుద్ధుడు వంటి సహాయక పాత్రలవంటి పలుపాత్రలను వందలాదిగా ప్రదర్శనలు చేసారు.
నృత్య దర్శకత్వం
మార్చుఈయనపది కూచిపూడి యక్షగానాలు, పలు జావళీలు, పదాలకు నృత్య దర్శకత్వం వహించారు. 30కి పైగా నృత్య రూపకాలకు దర్శకత్వం చేసారు. రామలింగ శాస్త్రి స్వయంగా నృత్యరూపకాలను రచన చేసి వాటికి కావలసిన అన్ని హంగులు జోడించి, దర్శకత్వం వహించి తాను ప్రధానపాత్రను పోషిస్తూ, తన కుటుంబసభ్యులతోపాటు శిష్య ప్రశిష్యులతో ప్రదర్శనలిచ్చే అరుదైన నాట్యాచార్యుడు. కూచిపూడి నాట్యాన్ని 9 ప్రక్రియలుగా విభజించి వాటికి లక్ష్యలక్షణాలను అందించారు. పరిచయదర్వు, వర్ణనాత్మక దర్వు, సాంత్వన దర్వు , ప్రేయోదర్వు అనే నాలుగు ముఖ్యమైన దరువులను కూచిపూడి నాట్యానికి సృజించి సమకూర్చారు.
పరిశోధనలు
మార్చుభరతముని నాట్యశాస్త్రంలో చెప్పిన ఐదు దర్వులకు సిద్ధేంద్రయోగి 13వ శతాబ్దంలో మరొకటి జోడించగా రామలింగశాస్త్రి మరో నాలుగు దర్వులను సృజించి సమకూర్చారు. వీటన్నిటిని కలిపి "దశవిధదర్వులు" అనే విధానం కూచిపూడి నాట్యంలో స్థిరపడింది. రామలింగ శాస్త్రి వేల సంవత్సరాల కూచిపూడి నాట్య ప్రస్థానాన్ని - ప్రాక్సిద్ధేంద్ర, సిద్ధేంద్ర, కేళికా, నృత్య నాటక, యక్షగాన, భాగవతుల రామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి చినసత్యం యుగములనేపేర యుగవిభజన చేసి, ఆయా యుగాలలో జరిగిన నాట్య ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించారు. అలాగే కూచిపూడి నాట్యమునందు సంస్కృత రూపకాలు, కలాపములు, కేళిక , నృత్యనాటకం, యక్ష గానె, నృత్య రూపకం, నృత్య నాటిక, వ్యస్తాంశం , ఏకపాత్రకేళికలనే తొమ్మిది ప్రక్రియలను పేర్కొని వాటికి లక్ష్యలక్షణాలను నిరూపించారు. పై ప్రక్రియలన్నిటిలోనూ విరివిగా రచననూ, నృత్యీకరణలను, ప్రదర్శనలనూ చేసిన మొదటి కూచిపూడి నాట్య గురువు. అలాగే కూచిపూడి నాట్య కళలో మూడవ కలాపరచన "ఉమాకలాపము" ను వీరే రచించారు. మొదటిది భామాకలాపం 13వ శతాబ్దంలో, రెండవది గొల్లకలాపం 18వ శతాబ్దంలో రచించినవి కాగా మరల మూడవది ఈయన చేసినదవడం గమనార్హం.
విదేశీ పర్యటనలు
మార్చురామలింగశాస్త్రి 1998లో సిరియా పర్యటన సందర్బంగా 18 వేదికలలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. లండన్ లో నర్తనశాల, శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఇటిఎ ఫెస్టివల్ లో ప్రదర్శన ఇచ్చారు. 2008లో యుఎస్ఎ కు కూచిపూడి యాత్ర చేసి పలు ప్రదర్శనలు ఇచ్చారు.
అవార్డులు, బిరుదులు
మార్చు- 1997, 2001 లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం[2]
- 1997లో భారత కేంద్ర ప్రభుత్వంచే జూనియర్ ఫెలోషిప్ అవార్డు
- 2008లో అతిపెద్ద కూచిపూడి నృత్య ప్రదర్శనకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు[3]
- 2012లో భారత రాష్ట్రపతి చేతులు మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు[4]
- 2012లో కూచిపూడి నృత్యానికి అందించిన సేవలకు గాను ఒరిస్సా ప్రభుత్వంచే నృత్యవిద్వాన్ అవార్డు[5]
- 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న అవార్డు
- 2021లో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ గా ఉత్తమ సేవలకుగాను వైఎస్ఆర్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు
- 2021లో విద్యారంగంలో అయన అందించిన విశిష్ట సేవలకు ISA ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, న్యూ ఢిల్లీ వారిచే అవుట్ స్టాండింగ్ లీడర్షిప్ ప్రిన్సిపాల్ అవార్డ్
- 2022లో పామర్రులో ఘంటసాల-బాలు స్మారక సంగీత కళాపీఠం వారిచే ఘంటసాల శతజయంతి సందర్బంగా ఘంటసాల అవార్డు
- 2023 మార్చి 26న కాకినాడ శాస్త్రీయ నాట్య ఆచార్యుల సమాఖ్య వారిచే శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా భరతముని అవార్డు
- 2023 మార్చి 31న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే 2020 సంవత్సరానికి నృత్య విభాగంలో ప్రతిభా పురస్కారం
- 2023 జులై 8న విశాఖపట్నంలో నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారిచే పద్మశ్రీ కె. శోభానాయుడు ఎక్సలెన్స్ అవార్డు - 2023[6]
- 2023 అక్టోబర్ 7న విశాఖపట్నం కళాభారతి వేదికలో కీ.శే.పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 100 సంవత్సరాల పండుగ సందర్భంగా వారి కుటుంబం నిర్వహించిన వేడుకలో ఘంటసాల పురస్కారం
- 2023 అక్టోబర్ 15న కూచిపూడిలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, కూచిపూడి అర్ట్ అకాడమీ, జయహో భారతీయం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్స్ సంయుక్త నిర్వహణలో "4వ ప్రపంచ కూచిపూడి నాట్యదినోత్సవం 2023" సందర్భంగా శ్రీ సిద్ధేంద్రయోగి పురస్కారం[7]
- 2023 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న రాజమహేంద్రవరంలో స్వర్ మహతి కళాపరిషత్ వారిచే "భరతముని ఆరాధనోత్సవాలు - 2023" సందర్భంగా కళారత్న - లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు
- 2024 మే 18న బెంగుళూరులో "భారతకళాగ్రామ" ఇంటర్నేషనల్ నాట్య సంస్థవారిచే "నాట్య కౌస్తుభ" బిరుదు
- వివిధ ప్రభుత్వ , కళాసంఘాల ద్వారా అందుకున్న నటరత్న, కూచిపూడి కళానిధి, కూచిపూడి రత్నాకర, నటరాజ, కూచిపూడి వాచస్పతి మొదలైనవి
హిందూ దినపత్రిక లోని ఒక వ్యాసంలో గురువుగారిని "కూచిపూడి మాస్ట్రో"[8] గా అభివర్ణించారు. కీ.శే. పద్మభూషణ్ వెంపటి చినసత్యంగారి తరువాత కూచిపూడి మాస్ట్రో గా అతనిని సంబోధించడం రామలింగశాస్త్రికి దక్కిన మరో గౌరవం. ఇది కూచిపూడి లో వారికి గల ప్రజ్ఞాపాఠవాలకు నిదర్శనం.
కుటుంబం
మార్చురామలింగ శాస్త్రి భార్య పేరు వెంకటదుర్గాభవాని. కర్ణాటక సంగీతం, తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఆవిడ సంగీత దర్శకురాలు, గాయని. నట్టువాంగంలో గణనీయమైన పేరు పొందారు. భర్తతో కలిసి 1990 నుండి అన్ని ప్రధాన ప్రదర్శనాల్లోను, వివిధ సెమినార్లలోను ముఖ్యభాగస్వామినిగా సహకరిస్తూనే చేసారు. వారికి ఇద్దరు సంతానం. సత్యఫణికృష్ణదత్తు (ఘనపాఠి కృష్ణ యజుర్వేదం), మోహనసత్యశ్రీనివాస వాగ్దేవీప్రసాదు (ఎం.ఎ. కూచిపూడి నాట్యం, కూచిపూడి, సాత్త్వికాభినయం, యక్షగానం, కర్నాటక సంగీతంలో డిప్లొమా). పెద్దకుమారుడు యజుర్వేద అధ్యాపకులు. పెద్దకోడలు దేవీభవాని నాట్య కళాకారిణి, నర్తకి. చిన్న కుమారుడు నృత్యదర్శకుడు, "కూచిపూడి కరదీపిక" అనే గ్రంథరచయిత కూడా.
మూలాలు
మార్చు- ↑ "Abhinaya Tharangini - Vedantam Ramalinga Sastry". www.abhinayatharangini.com. Archived from the original on 2022-02-22. Retrieved 2022-02-14.
- ↑ "ఉగాది పురస్కారం". abhinaya tharangini. Archived from the original on 2022-02-22.
- ↑ "గిన్నీస్ రికార్ద్". new indian express. Archived from the original on 2022-02-22.
- ↑ "సంగీత నాటక అకాడమి అవార్డు". thehindu.com.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "నృత్య విద్వాన్". New Indian Express.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Sobha Naidu Smarak Excellence Award to be presented to Vedantam Ramalinga Sastry in Visakhapatnam". The Hindu (in Indian English). 2023-07-08. ISSN 0971-751X. Retrieved 2023-07-13.
- ↑ Srinivas, Rajulapudi (2023-10-15). "Andhra Pradesh: Manju Bhargavi conferred with Vempati Chinna Satyam Jayanthi Puraskaram". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-10-17.
- ↑ Chowdurie, Tapati (2013-07-04). "Vedantam Ramalinga Sastry — Masterspeak". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-08-24.