వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్

వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్ కూచిపూడి నాట్య కళాకారుడు.

జీవిత విశేషాలు మార్చు

వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్ సాంప్రదాయకమైన కూచిపూడి నాట్యకారుల కుటుంబానికి చెందినవాడు. ఆయన ఆగస్టు 24, 1987 న జన్మించాడు. ఆయన వేదాంతం రాధేశ్యాం కుమారుడు. సిద్దేంద్ర తన ఆరవయేట నుండి కూచిపూడి నాట్యంలో తన తండ్రి వద్ద శిక్షణ పొందాడు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూచిపూడి నాట్యం, యక్షగానం లలో డిప్లొమాలు పొందాడు. ఆయన ఎం.బి.ఎ చేసిన దదుపరి తన పూర్వీకుల సాంప్రదాయమైన నాట్యం, గానం, నట్టువానర్, ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాడు.

ఆయన సుమారు 600 కార్యక్రమాలలో ప్రదర్శనలిచ్చాడు.[1] ఆయన ఎక్కువగా పురష, స్త్రీ పాత్రలను యక్షగానంలోనూ, కలాపాలలోనూ తన బాల్యం నుండి ప్రదర్శనలిస్తున్నాడు. అందులోని ముఖ్య పాత్రలు:

  • ప్రహ్లాద, లీలావతి, నృసింహ, వేత్రాహస్త పాత్రలను ప్రహ్లాద యక్షగానంలోనూ,[2]
  • శివుడు, తారకాసురుడు, మన్మధుడు పాత్రలను పార్వతీ పరిణయంలోనూ
  • గొల్లభామగా గొల్లకలాపంలోనూ
  • కృష్ణునిగా భామాకలాపంలోనూ ప్రదర్శించాడు.
  • త్యాగరాజ పంచరత్నాల కీర్తనలు, అష్టపదులు, శివాష్టకం, మరికొన్ని పాత్రలలో సోలో ప్రదర్శనలిచ్చాడు.
  • సంగీత నాటక అకాడమీ 2011 ఏప్రిల్ 6 లో నిర్వహించిన నృత్య ప్రతిభా యూత్ ఫెస్తివల్ లో గొల్లకలాపం ప్రదర్శించాడు.

పురస్కారాలు మార్చు

ఆయనకు భారత ప్రభుత్వ సి.సి.ఆర్.టి నుండి ప్రశంసా పత్రం వచ్చింది. ఆయన కూచిపూడి నృత్యాన్ని "అఠాణా జాతిస్వరం" అంశంపై ప్రదర్శించినందుకు గానూ ప్రతిష్ఠాకరమైన గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదిచాడు.[3] అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సిలికాన్ ఆంధ్ర నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య ఉత్సవంలో భక్త ప్రహ్లాద యక్షగానాన్ని ప్రదర్శించాడు. 2010లో 29వ ప్రపంచ కామన్వెల్త్ క్రీడలలో ప్రారంభ కార్యక్రమంలో నిర్వహించిన కూచిపూడి నాట్య విభాగంలో పాల్గొన్నాడు.

మూలాలు మార్చు

  1. "Vedantam Siddhendra Vara Prasad". Archived from the original on 2016-07-06. Retrieved 2016-11-12.
  2. అద్భుత నృత్య ప్రక్రియ ‘సింహనందిని’ 20/12/2014[permanent dead link]
  3. వరుస రికార్డులతో విశ్వవిఖ్యాతమైన ‘కూచిపూడి’ 31/12/2014[permanent dead link]

ఇతర లింకులు మార్చు