జూన్ 25, 2008 (2008-06-25)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కర్నూలు జిల్లాలో కుందూనదిపై కొత్త రిజర్వాయర్ నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
  • లోక్‌జనశక్తి పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు సూరజ్ భాన్ సింగ్‌కు బీహార్ కు చెందిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
  • అమితాబ్ బచ్చన్ కుటుంబంతో కలిసి పనిచేయడానికి సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తునట్లు అనిల్ అంబానీకి చెందిన అడాగ్ ప్రకటించింది.
  • సింగపూర్ లో ఎఫ్ఎం రేడియో స్టేషన్‌ను ప్రారంభించాలని అనిల్ అంబానీ నిర్ణయం. దీనితో విదేశాలలో ఇదే తొలి భారతీయ ఎఫ్ఎం అవుతుంది.
  • స్పైస్ కమ్యునికేషన్‌కు చెందిన 40.8% వాటాలను ఐడియా సెల్యులార్ తీసుకోనున్నట్లు ప్రకటించింది.
  • ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టుకు చెందిన సురేష్ రైనా 66 బంతుల్లో సెంచరీ సాధించి భారత్ తరఫున రెండో వేగవంతమైన శతకాన్ని నమోదుచేశాడు.