భారత క్రికెట్ జట్టు

భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) అని వ్యవహరిస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే జాతీయ క్రీడాజట్టుగా నిలిచింది.[1]

సచిన్ టెండూల్కర్ సిడ్నీలో 2008లో తన 38వ టెస్ట్ సెంచురీ పూర్తి చేసినప్పటి చిత్రం.

భారతదేశం మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్లో ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరవ దేశంగా స్థానం సంపాదించింది. ప్రారంభం నుంచి విదేశాలలో కన్నా స్వదేశంలోనే మంచి ఫలితాలను రాబట్టుకుంటోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్లపై బలహీనమైన ప్రదర్శన కావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన తొలి 50 సంవత్సరాలలో మొత్తం 196 టెస్టులు ఆడి కేవలం 35 విజయాలను మాత్రమే నమోదుచేయగలిగింది.[1]

50 సంవత్సరాల అనంతరం సునీల్ గవాస్కర్ రూపంలో ప్రముఖ బ్యాట్స్‌మెన్, కపిల్ దేవ్ రూపంలో ప్రముఖ బౌలర్‌లు భారత జట్టులో స్థానం సంపాదించారు. అప్పటినుంచి టెస్టులలోనూ, ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (వన్డే క్రికెట్) లోనూ భారత జట్టు ప్రదర్శన పూర్వం కంటే బాగుపడింది. ఇదే క్రమంలో 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో 3వ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అప్పటి దిగ్గజాలైన వెస్ట్‌ఇండీస్ జట్టును ఫైనల్‌లో బోల్టా కొట్టించి అపూర్వమైన విజయాన్ని భారత క్రికెట్ జట్టు సాధించింది. ఆ మరుసటి సంవత్సరమే సునీల్ గవాస్కర్ నేతృత్వంలో ఆసియా కప్ క్రికెట్ను కూడా భారత జట్టు సాధించింది. 1985లో ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రోఫీ తరువాత భారతజట్టు సాధించిన గొప్ప విజయం 2007లో మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో సాధించిన తొలి ట్వంటీ-20 ప్రపంచకప్ టైటిల్. 20వ శతాబ్ది చివరి దశకంలో భారత జట్టులో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే లాంటి ప్రముఖ ఆటగాళ్ళు జట్టులో స్థానం సంపాదించి లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు సృష్టించారు.[2] జనవరి 2008 నాటికి భారత జట్టు 414 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 22.4% విజయాలు సాధించింది. 32.13% ఓటములు పొందగా మిగిలిన 45.41% డ్రాగా ముగించింది.[3] ప్రస్తుతం భారతజట్టు ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో ...స్థానంలోనూ, వన్డే ర్యాంకింగ్‌లో ...స్థానంలోనూ కొనసాగుతోంది.[3]

భారత క్రికెట్ జట్టు చరిత్రసవరించు

 
ఇంగ్లీష్ క్రికెట్ జట్టు తరఫున ఆడిన రంజీత్ సింహ్

1700లో బ్రిటీష్ వారు క్రికెట్ ఆటను భారత్కు తీసుకొనివచ్చారు. 1721లో మొదటి క్రికెట్ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించారు.[4] 1848లో ముంబాయిలో పార్సీ కమ్యూనిటీ ఓరియెంటల్ క్లబ్‌ను స్థాపించారు. అదే భారతీయులు స్థాపించిన తొలి క్రికెట్ క్లబ్. 1877లో యూరోపియన్లు పార్సీలకు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి పిల్చారు.[5] 1912 నాటికి పార్సీలు, హిందువులు, ముస్లిములు, యూరోపియన్లు ప్రతి ఏడాది క్రికెట్ ఆడేవారు.[5] 1900లలో కొందరు భారతీయులు ఇంగ్లీష్ క్రికెట్ టీంలో ఆడటానికి ఇంగ్లాండు వెళ్ళినారు. వారిలో ముఖ్యులు రంజిత్ సింహ్ జీ, దులీప్ సింహ్ జీ. వారిపేర్లపై ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ట్రోఫీలు నిర్వహించబడుతున్నది. 1911లో భారత జట్టు తొలి అధికారిక పర్యటన ఇంగ్లాండులో జరిపింది. కాని ఇంగ్లీష్ క్రికెట్ టీంతో కాకుండా ఇంగ్లాండు లోని టీంలతో ఆడినది.[6] 1926లో ఇంపీరియల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారతదేశానికి ఆహ్వానించారు. 1932లో తొలిసారిగా అధికారిక టెస్ట్ మ్యాచ్ సి.కె.నాయుడు నేతృత్వంలో ఇంగ్లాండుతో ఆడింది.[7] తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతూ భారతజట్టు బలంగా లేకపోవుటచే 158 పరుగులకే కుప్పకూలింది.[8] 1930, 1940లలో భారతజట్టు శక్తివంచన లేకుండా కృషిచేసింది. కాని విజయం సాధించలేకపోయింది. టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు తొలి విజయం 1952లో ఇంగ్లాండుపై చెన్నైలో లభించింది.[9] ఆ తరువాతి సంవత్సరం పాకిస్తాన్ పై తొలి సీరీస్ విజయం సాధించింది. 1950 దశాబ్దిలో భారత జట్టు మంచి పురోగతి సాధించింది. 1956లో న్యూజీలాండ్ పై కూడా సీరీస్ విజయం సాధించింది. కాని ఆస్ట్రేలియా, ఇంగ్లాండులపై దశాబ్దం వరకు కూడా విజయం సాధించలేక పోయింది.

1970 దశకంలో భారత జట్టులో స్పిన్ దిగ్గజాలైన బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట రాఘవన్ లాంటివారు ప్రవేశించారు. అదే సమయంలో ఇద్దరు ప్రముఖ బ్యాట్స్‌మెన్లు (సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ లు) కూడా భారత జట్టులో రంగప్రవేశం చేశారు. 1971లో వెస్ట్‌ఇండీస్ పై గవాస్కర్ తొలి సిరీస్‌లోనే 774 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఆ ఏడాది అజిత్ వాడేకర్ నాయకత్వంలో భారతజట్టు ఇంగ్లాండు, వెస్ట్‌ఇండీస్ లపై సీరీస్ విజయం సాధించగలిగింది.

1971లో వన్‌డే క్రికెట్ ప్రారంభమైన తరువాత క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. కాని ప్రారంభంలో భారతజట్టు ఒకరోజు క్రికెట్ పోటీలలో బలహీనంగా ఉండేది. బ్యాత్స్‌మెన్లు రక్షణాత్మక ధోరణితో మందకొడిగా ఆడేవారు. 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండుతో జరిగిన ఒక మ్యాచ్‌లో గవాస్కర్ ప్రారంభం నుంచి 60వ ఓవర్ వరకు మొత్తం 176 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ కేవలం 132 పరుగులు (3 వికెట్లకు) మాత్రమే చేసి 202 పరుగులు తేడాతో పరాజయం పొందినది. తొలి రెండు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో భారత్ రెండో రౌండ్‌కు కూడా చేరుకోలేదు.

1970 దశాబ్దం ద్వితీయార్థం నుంచి టెస్టులలో భారత్ బలంగా తయారైంది. 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్‌ఇండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 403 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది భారత్ రికార్డు సాధించింది. నాల్గవ ఇన్నింగ్సులో గుండప్ప విశ్వనాథ్ 112 పరుగులు సాధించాడు. 1976లోనే న్యూజీలాండ్‌పై మరో రికార్డు సాధించింది. కాన్పూర్లో జరిగిన టెస్టులో 524 పరుగులు సాధించి (9 వికెట్లకు) ఇన్నింగ్సు డిక్లేర్ చేసింది. ఆ టెస్టులో ఎవరూ సెంచరీ సాధించకున్ననూ ఆరుగురు బ్యాట్స్‌మెన్లు 50కు పైగా పరుగులు సాధించడం గమనార్హం. ఆ ఇన్నింగ్సులోని మరో విశేషం మొత్తం 11 క్రికెటర్లు రెండంకెల స్కోరును చేయడం. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో అప్పటికి ఇలాంటిది 8వ సారి మాత్రమే.

 
వాంఖేడే స్టేడియంలో ఆటగాళ్ళు

1980 ప్రాంతంలో దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి సేవలను ఉపయోగించుకొని భారతజట్టు పలు విజయాలు నమోదుచేయగలిగింది. 1983లో జరిగిన మూడవ వన్డే ప్రపంచ కప్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతజట్టు వెస్ట్‌ఇండీస్‌ను ఫైనల్లో బోల్టా కొట్టించి కప్‌ను ఎవరేసుకొనివచ్చింది. 1984లో సునీల్ గవాస్కర్ నాయకత్వంలోని భారతజట్టు ఆసియా కప్‌ను సాధించింది. 1985లో ఆస్ట్రేలియా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలిచింది. రవిశాస్త్రి చంపియన్ ఆఫ్ చాంపియన్‌గా అవార్డు పొందినాడు. 1986లో ఇంగ్లాండ్‌పై టెస్ట్ సీరీస్‌లో కూడా విజయం సాధించారు. భారత ఉపఖండం వెలుపల భారతజట్టు 19 సంవత్సరాల అనంతరం సాధించిన విజయమది. 1987 ప్రపంచ కప్ క్రికెట్‌ను భారత ఉపఖండంలోనే నిర్వహించబడింది. 1980 దశాబ్దిలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లు బ్యాటింగ్, బౌలింగ్‌లలో పలు రికార్డులు సృష్టించారు. సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్‌లో 34 సెంచరీలు, 10,000 పైగా పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించగా కపిల్ దేవ్ 434 టెస్ట్ వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు (వీరి రికార్డులు తరువాత ఛేదించబడ్డాయి). వారి క్రీడాజీవితపు చివరిదశలో వారిరువిరి మధ్య నాయకత్వ బాధ్యతలు పలుమార్లు చేతులుమారింది.

1980 దశాబ్ది చివరలో సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే, జనగళ్ శ్రీనాథ్లు భారతజట్టులోకి ప్రవేశించారు. 1990 దశాబ్ది మధ్యనాటికి సచిన్ తెండుల్కర్ అనేక ప్రపంచ రికార్డులు తనపేరిట నమోదు చేసుకున్నాడు. ఇప్పటికీ సచిన్ భారతజట్టుకు సేవలందిస్తున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్ననూ నాయకత్వ బాధ్యతలు నిర్వహించి జట్టుకు విజయం సాధంచ లేకపోయాడు. మూడో పర్యాయం నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్ననూ తన నిస్సాయత వ్యక్తం చేయగా ఆ కిరీటం అనిల్ కుంబ్లేకు వరించింది.

 
సచిన్ టెండూల్కర్

2000లలో అజహరుద్దీన్, అజయ్ జడేజాలు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కొని భారతజట్టుకు చెడ్డపేరు తెచ్చారు. 2000 తరువాత భారత జట్టుకు తొలి విదేశీ కోచ్ జాన్ రైట్ రావడంతో జట్టు కొద్దిగా మెరుగుపడింది. కోల్‌కత టెస్టులో ఫాలోఆన్ ఆడుతూ మ్యాచ్ గెల్చి సంచలనం సృష్టించింది. వి.వి.యెస్.లక్ష్మణ్ వీరోచిత డబుల్ సెంచరీతో సాధిమ్చిన ఆ ఘనకార్యం టెస్ట్ చరిత్రలో అలాంటి విజయాల్లో మూడోది మాత్రమే. 2004లో జాన్ రైట్ స్థానంలో గ్రెగ్ చాపెల్ కోచ్‌గా వచ్చాడు. చాపెల్, సౌరవ్ గంగూలీ విభేదాల వల్ల గంగూలీ నాయకత్వం నుంచి తప్పించుకోవల్సివచ్చింది. రాహుల్ ద్రవిడ్కు ఆ బాధ్యతలు అప్పగించబడ్డాయి. మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పటేల్, రాబిన్ ఉతప్ప లాంటి యువకులు ప్రవేశించుటలో జట్టులో యువరక్తం పెరిగింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో బంగ్లాదేశ్ పై ఓడి సూపర్-8 కు కూడా అర్హత సాధించలేదు. దానికి బాధ్యత వహించి అనిల్ కుంబ్లే స్వచ్ఛందంగా టెస్ట్ క్రికెట్‌కు నిష్క్రమణ ప్రకతించాడు. ఆ తరువాత జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో నలుగులు సీనియర్ క్రికెటర్లు లేకుండానే యువ భారతజట్టు అనూహ్యమైన విజయం సాధించి సంచలనం సృష్టించింది.

వివిధ టోర్నమెంట్లలో భారతజట్టు ప్రదర్శన తీరుసవరించు

వన్డే క్రికెట్ కప్ ట్వంటీ-20 ప్రపంచ కప్ ఐసిసి చాంపియన్ ట్రోఫీ కామన్వెల్త్ క్రీడలు ఆసియా కప్ క్రికెట్
 • 1975: తొలి రౌండ్
 • 1979: తొలి రౌండ్
 • 1983: ట్రోఫి విజయం
 • 1987: సెమీ ఫైనల్
 • 1992: తొలి రౌండ్
 • 1996: సెమీ ఫైనల్
 • 1999: సూపర్ 6 (6వ స్థానం)
 • 2003: రెండో స్థానం
 • 2007: తొలి రౌండ్
 • 2011: ట్రోఫి విజయం
 • 2007: ట్రోఫి విజయం
 • 1998: సెమీ ఫైనల్
 • 2000: రెండో స్థానం
 • 2002: శ్రీలంకతో పాటు సంయుక్తంగా విజయం
 • 2004: తొలి రౌండ్
 • 2006: గ్రూప్ దశ
 • 2013: ఛాంపియన్
 • 1998: తొలి రౌండ్
 • 1984: ట్రోఫీ విజయం
 • 1986: పాల్గొనలేదు
 • 1988: ట్రోఫీ విజయం
 • 1990/1991: ట్రోఫీ విజయం
 • 1995: ట్రోఫీ విజయం
 • 1997: రెండో స్థానం
 • 2000: 3వ స్థానం
 • 2004: రెండో స్థానం

భారత్‌లో క్రికెట్ వేదికలుసవరించు

భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే స్టేడియంలు

భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అనేక క్రికెట్ వేదికలున్నాయి. అందులో చాలా రాష్ట్ర క్రికెట్ బోర్డు అజమాయిషీలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం ముంబాయి జింఖానా గ్రౌండ్. 1877లో పార్సీలు, యూరోపియన్ల మధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది. 1933లో భారతదేశంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించిన తొలి స్టేడియం కూడా ఇదే. కాని అదే టెస్ట్ ఆ వేదికకు చివరి టెస్ట్ కూడా. టెస్ట్ మ్యాచ్‌లు జరిగిన రెండో, మూడవ స్టేడియాలు ఈడెన్ గార్డెన్, చేపాక్ స్టేడియంలు. స్వాతంత్ర్యం తరువాత టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానం. వెస్టీండీస్తో జరిగిన ఆ మ్యాచ్ 1948లో జరుగగా డ్రాగా ముగిసింది.

భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించిన స్టేడియాలు 19 ఉండగా, అందులో ఈడెన్ గార్డెన్ అత్యధింగా 35 టెస్టులకు వేదికగా నిలిచింది. ఆరు స్టేడియంలలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఆంధ్ర ప్రదేశ్లో టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన ఏకైక స్టేడియం హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియం. అందులో ఇప్పటి వరకు 3 టెస్టులు జరిగాయి. ముంబాయి నగరంలో ఉన్న మూడు స్టేడియంలలో (వాంఖేడే, బ్రబోర్న్, జింఖానా) కలిపి అత్యధిక టెస్టులను నిర్వహించిన నగరంగా ముంబాయి ప్రథమస్థానంలో ఉంది.

భారత్‌లో అత్యధిక టెస్టుమ్యాచ్‌లను నిర్వహించిన కోల్‌కత లోని ఈడెన్ గార్డెన్ ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు వీక్షించే స్టేడియంగా రికార్డు సృష్టించింది.[10] మరో ప్రముఖ స్టేడియం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానం. 1883లో ఏర్పాటుచేసిన ఈ స్టేడియం పాకిస్తాన్ పై అనిల్ కుంబ్లే సాధించిన ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్ల రికార్డుతో పాటు అనేక రికార్డులకు నిలయంగా మారింది. గత కొద్దికాలంగా ఈ స్టేడియం పునరుద్ధరణ దిశలో ఉంది.[11] చేపాక్ (చెన్నై) లోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం భారతదేశానికి తొలి టెస్ట్ విజయాన్ని అందించిన వేదిక.[12]

 
కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం
స్టేడియం నగరం టెస్ట్ మ్యాచులు
ఈడెన్ గార్డెన్ కోల్‌కత 35
ఫిరోజ్‌షా కోట్లా ఢిల్లీ 29
ఎం.ఎ.చిదంబరం స్టేడియం చేపాక్, చెన్నై 28
వంఖేడే స్టేడియం ముంబాయి 21
గ్రీన్ పార్క్ స్టేడియం (మోడి స్టేడియం) కాన్పూర్ 19
బ్రబోర్న్ స్టేడియం ముంబాయి 17
ఎం.చిదంబరం స్టేడియం బెంగుళూరు 17
నెహ్రూ స్టేడియం చెన్నై 9
విదర్భ గ్రౌండ్ నాగ్పూర్ 9
సర్దార్ పటేల్ స్టేడియం అహ్మదాబాదు 8
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం మొహలి, పంజాబ్ 7
లాల్ బహదూర్‌శాస్త్రి స్టేడియం హైదరాబాదు 3
బారాబతి స్టేడియం కటక్ 2
జింఖానా స్టేడియం ముంబాయి 1
గామ్ధీ స్టేడియం జలంధర్ 1
కె.డి.సింగ్ బాబు స్టేడియం లక్నో 1
సవాయి మాన్‌సింగ్ స్టేడియం జైపూర్ 1
సెక్టార్ 16 స్టేడియం చండీగర్ 1
యూనివర్శిటీ గ్రౌండ్ లక్నో 1

భారత క్రికెట్ జట్టు రికార్డులుసవరించు

 • వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం : 317 (శ్రీలంక క్రికెట్ జట్టు పై 2023 (ప్రపంచ రికార్డు)
 • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోరు : 705/7 (ఆస్ట్రేలియా పై సిడ్నీలో 2002-03 )
 • టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప జట్టు స్కోరు : 42 (ఇంగ్లాండు పై 1974లో )
 • టెస్ట్ క్రికెట్‌లో తొలి వికెట్టుకు భాగస్వామ్య రికార్డు : 413 (న్యూజీలాండ్ పై చెన్నై లో, 1955-56)
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోరు : 413/5 (బెర్మూడా పై 2007 ప్రపంచ కప్‌లో ) (ప్రపంచ రికార్డు)
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం : 257 (బెర్మూడా పై 2007 ప్రపంచ కప్‌లో ) (ప్రపంచ రికార్డు)
 • వన్డే క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు : 18 (బెర్మూడాపై, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో, 2007)
 • వన్డే క్రికెట్‌లో భాగస్వామ్య రికార్డు : 331 (రాహుల్ ద్రవిడ్, సచిన్ తెండుల్కర్ - రెండో వికెట్టుకు, న్యూజీలాండ్‌పై, హైదరాబాదులో, 1999-00

వ్యక్తిగత రికార్డులుసవరించు

 
ప్రస్తుత క్రికెట్ ఆటగాళ్ళు - హరభజన్ సింగ్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహవాగ్
 • అత్యధిక టెస్టులు ఆడినది : సచిన టెండుల్కర్ (ప్రపంచ రికార్డు)
 • వరుసగా అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందినది : సౌరవ్ గంగూలీ (ప్రపంచ రికార్డు)
 • అత్యధిక టెస్ట్ విజయాలు అందించిన కెప్టెన్ : సౌరవ్ గంగూలీ (21 విజయాలు)
 • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు : సచిన్ టెండుల్కర్ (ప్రపన్ఛ రికార్ద్)
 • అత్యధిక వ్యక్తిగత స్కోరు : 319 (వీరేంద్ర సెహ్వాగ్,దక్షిణ ఆఫ్రికా పై, చెన్నైలో, 2007-08
 • అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసినది : సచిన్ టెండుల్కర్ (ప్రపంచ రికార్డు)
 • అత్యధిక టెస్ట్ వికెట్లు తీసినది : అనిల్ కుంబ్లే
 • టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ : 74/10 (అనిల్ కుంబ్లే), పాకిస్తాన్‌పై, ఢిల్లీలో, 1998-99
 • ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టినది : రాహుల్ ద్రవిడ్
 • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయినది : చంద్రశేఖర్, 23 సార్లు
 • ఒకే టెస్ట్ సీరీస్‌లో అత్యధిక పరుగులు చేసినది : సునీల్ గవాస్కర్ (774), వెస్టీండీస్‌పై, 1970-71
 • ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను అత్యధిక సార్లు సాధించినది : అనిల్ కుంబ్లే (35 సార్లు)
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడినది : సచిన్ టెండుల్కర్
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసినది : సచిన్ టెండుల్కర్ (ప్రపంచ రికార్డు)
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసినది : సచిన్ టెండుల్కర్ (ప్రపంచ రికార్డు)
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్థసెంచరీలు సాధిమ్చినది : సచిన్ టెండుల్కర్ (ప్రపంచ రికార్డు)
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు : 264,రొహిత్ శర్మ, శ్రీలంక పై, కోల్‌కతలో [2014]
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసినది : అనిల్ కుంబ్లే (337)
 • వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ : 12/6 (అనిల్ కుంబ్లే) వెస్టీండీస్‌పై, కోల్‌కతలో, 1993-94
 • వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ : సచిన్ టెండుల్కర్
 • ఒకే వన్డేలో 5 వికెట్లను అత్యధిక సార్లు సాధించినది : జవగళ్ శ్రీనాథ్

[13]

టెస్ట్ క్రికెట్ కెప్టెన్లుసవరించు

భారత క్రికెట్ జట్టు ఇంతవరకు (జనవరి 28, 2008 నాటికి) ఆడిన 415 టెస్టులకు 30 గురు జట్టుకు నాయకత్వం వహించారు. వారిలో సౌరవ్ గంగూలీ అత్యధికంగా 49 టెస్టులకు నాయకత్వం వహించగా హేము అధికారి, పంకజ్ రాయ్, చందూ బోర్డే, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్ లు ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్‌కు నాయకత్వం వహించారు.

భారత జట్టు టెస్ట్ కెప్టెన్లు [14]
క్ర.సం పేరు టెస్టులు విజయాలు ఓటములు డ్రా
1 సి.కె.నాయుడు 4 0 3 1
2 మహారాజ్‌కుమార్ 3 0 2 1
3 జూనియర్ పటౌడి 3 0 1 2
4 లాలా అమర్‌నాథ్ 15 2 6 7
5 విజయ్ హజారే 14 1 5 8
6 వినూ మన్కడ్ 6 0 1 5
7 గులాం అహ్మద్ 3 0 2 1
8 పాలీ ఉమ్రీగర్ 8 2 2 4
9 హేమూ అధికారి 1 0 0 1
10 దత్తా గైక్వాడ్ 4 0 4 0
11 పంకజ్ రాయ్ 1 0 1 0
12 గులాబ్‌రాయ్ రాంచంద్ 5 1 2 2
13 నారీ కాంట్రాక్టర్ 12 2 2 8
14 నవాబ్ పటౌడీ జూనియర్ 40 9 19 12
15 చందూబోర్డే 1 0 1 0
16 అజిత్ వాడేకర్ 16 4 4 8
17 వెంకట రాఘవన్ 5 0 2 3
18 సునీల్ గవాస్కర్ 47 9 8 30
19 బిషన్ సింగ్ బేడీ 22 6 11 5
20 గుండప్ప విశ్వనాథ్ 2 0 1 1
21 కపిల్ దేవ్ 34 4 7 23
22 దిలీప్ వెంగ్‌సర్కార్ 10 2 5 3
23 రవి శాస్త్రి 1 1 0 0
24 కృష్ణమాచారి శ్రీకాంత్ 4 0 0 4
25 అజహరుద్దీన్ 47 14 14 19
26 సచిన్ టెండుల్కర్ 25 4 9 12
27 సౌరవ్ గంగూలీ 49 21 13 15
28 రాహుల్ ద్రవిడ్ 22 8 6 11
29 వీరేంద్ర సెహ్వాగ్ 1 1 0 0
30 అనిల్ కుంబ్లే 7 2 2 3
మొత్తము 415 93 133 189 [15]

భారత వన్డే జట్టు కెప్టెన్లుసవరించు

ఇంతవరకు భారత వన్డే జట్టుకు 19 గురు నాయకత్వం వహించారు. వారిలో అత్యధికంగా అజహరుద్దీన్ 173 వన్డేలకు నాయకత్వం వహించి ప్రథమస్థానంలో ఉండగా, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్‌నాథ్, అనిల్ కుంబ్లేలు ఒక్కొక్క వన్డేలకు నాయకత్వం వహించారు. విజయశాతం ప్రకారం చూస్తే అనిల్ కుంబ్లే నాయకత్వం వహించిన ఏకైక వన్డేకు విజయం చేకూర్చి 100% విజయశాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు. 20 కంటే అధికంగా వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్లలో రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్లు 56% విజయశాతంతో ముందంజలో ఉన్నారు. ప్రపంచ కప్ క్రికెట్‌ను గెలిపించిన ఏకైక కెప్టెన్ కపిల్ దేవ్. 1983లో అతడు ఈ అపురూపమైన విజయాన్ని అందించాడు. కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు సచిన్ టెండుల్కర్ సాధించాడు. 1999-00లో న్యూజీలాండ్ పై ఆ స్కోరు సాధించి కపిల్ దేవ్ (175*) రికార్డును ఛేదించాడు. కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ రికార్డు (10-1-34-5) సౌరవ్ గంగూలి పేరిట ఉంది. కెప్తెన్‌గా అత్యధిక సెంచరీల రికార్డు (11) కూడా గంగూలీ పేరిట నమోదైంది. కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు అజహరుద్దీన్ సాధించాడు.

భారత జట్టు వన్డే కెప్టెన్లు
క్ర.సం. పేరు సం. వన్డేల సంఖ్య గెలిచినవి ఓటమి టై ఫలితం తేలనివి విజయ శాతం[16]
1 అజిత్ వాడేకర్ 1974 2 0 2 0 0 0%
2 వెంకటరాఘవన్ 1975-1979 7 1 6 0 0 14%
3 బిషన్ సింగ్ బేడీ 1975/6-1978/9 4 1 3 0 0 25%
4 సునీల్ గవాస్కర్ 1980/1-1985/6 38 14 22 0 2 39%
5 గుండప్ప విశ్వనాథ్ 1980/1 1 0 1 0 0 0%
6 కపిల్ దేవ్ 1982/3-1992/1993 74 40 32 0 2 56%
7 సయ్యద్ కిర్మాణి 1983/4 1 0 1 0 0 0%
8 మోహిందర్ అమర్‌నాథ్ 1984/1985 1 0 0 0 1 NA
9 రవిశాస్త్రి 1986/7-1991/2 11 4 7 0 0 36%
10 దిలీప్ వెంగ్‌సర్కార్ 1987/8-1988/9 18 8 10 0 0 44%
11 కృష్ణమాచారి శ్రీకాంత్ 1989/90 13 4 8 0 1 33%
12 అజహరుద్దీన్ 1989/90-1999 173 89 76 2 6 54%
13 సచిన్ టెండుల్కర్ 1996-1999/2000 73 23 43 1 6 35%
14 అజయ్ జడేజా 1997/8-1999/2000 13 8 5 0 0 62%
15 సౌరవ్ గంగూలీ 1999-2005 146[17] 76 65[17] 0 5 54%
16 రాహుల్ ద్రవిడ్ 2000/1-2007 79 42 33 0 4 53%
17 అనిల్ కుంబ్లే 2001/2 1 1 0 0 0 100%
18 వీరేంద్ర సెహ్వాగ్ 2005 5 3 2 0 0 60%
19 మహేంద్రసింగ్ ధోని 2007/8 12 5 6 0 1 48%
మొత్తం 667 315 321 3 28 47.23%

దేశవాళీ క్రికెట్ పోటీలుసవరించు

భారతదేశంలో జరిగే దేశవాళి క్రికెట్ పోటీలు:

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "India - Results Summary from 1932 - 1982". Cricinfo - Stats Guru.
 2. "Cricket records". Cricinfo. Archived from the original on 2013-09-03. Retrieved 2008-02-20.
 3. 3.0 3.1 Cricinfo Test Team Records page retrieved on November 3 2007
 4. Downing, Clement (1737). William Foster (ed.). A History of the Indian Wars. London.
 5. 5.0 5.1 "Cricket and Politics in Colonial India". Ramachandra Guha. Archived from the original on 2012-07-09. Retrieved 2008-02-20.
 6. "India in England, 1911". Cricket Archive. Archived from the original on 2009-03-18. Retrieved 2008-02-20.
 7. "History of the Imperial Cricket Conference". ICC. Archived from the original on 2006-03-21. Retrieved 2008-02-20.
 8. "India in England, 1932". Cricinfo.
 9. "England in India, 1951-52". Cricinfo.
 10. "Cricket: India's Passion" (PDF). Sachin Chitta. Archived from the original (PDF) on 2006-11-05. Retrieved 2008-02-21.
 11. "Cricinfo - Grounds: Feroz Shah Kotla". Cricinfo.
 12. "Cricinfo - Grounds: M.A. Chidambaram Stadium". Cricinfo.
 13. http://stats.cricinfo.com/ci/engine/records/bowling/most_5wi_career.html?class=2;id=6;type=team
 14. "India - Tests". Cricinfo. Retrieved 2007-05-25.
 15. ఒక టై టెస్ట్‌తో కల్పుకొని
 16. Win% = (matches won+0.5*matches tied)/(matches played-matches abandoned) and is rounded to the nearest number as percentage
 17. 17.0 17.1 Sourav Ganguly also captained the ACC Asian XI in the ODI against the ICC World XI held on 10 January 2005 for the World Cricket Tsunami Appeal. The ACC Asian XI lost that ODI

ఇవి కూడా చూడండిసవరించు