జూలై 8, 2008 (2008-07-08)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
  • 4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రభారావు, మణిపూర్ గవర్నర్‌గా గురుబచన్‌సింగ్ జగత్, గోవా గవర్నర్‌గా శివేందర్‌సింగ్ సిద్ధూ, మహారాష్ట్ర గవర్నర్‌గా ఎస్.సి.జమీర్ లుగా వ్యవహరిస్తారు.
  • రాష్ట్రంలో కొత్తగా 21 డిగ్రీకళాశాల ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
  • కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యుడు చనుమోలు వెంకట్రావు మృతిచెందాడు.
  • కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.