వేపాడ చిరంజీవిరావు
వేపాడ చిరంజీవిరావు, శాసన మండలి సభ్యులు, ప్రముఖ విద్యావేత్త, రచయిత, అర్ధ శాస్త్ర అధ్యాపకుడు.[1] 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసి విజయం పొందాడు. చిరంజీవిరావు స్వగ్రామం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోగల రావికమతం మండలం, దొండపూడి గ్రామం .[2]
జననం
మార్చువేపాడ చిరంజీవిరావు అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం దొండపూడి గ్రామంలో 1972 ఆగస్టు 30 ఆగస్టు 30న జన్మించాడు. ఇతని తండ్రి వేపాడ దేముడు (లేటు ), తల్లి చిలకమ్మ. భార్య నివేదిత. ఈమె బాటనీ అధ్యాపకురాలుగా డా.వి.ఎస్.కృష్ణా డిగ్రీ కళాశాల, విశాఖపట్నంలో పనిచేస్తుంది. స్థిర నివాసం పెదవాల్తేరు, విశాఖపట్నం.
విద్యాభ్యాసం
మార్చు1 నుంచి 5వ తరగతి వరకు స్వగ్రామం దొండపూడి లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు, 6 నుంచి 10వ తరగతి వరకు అదే గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాగింది. ఇంటర్ మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజి, కొత్తకోటలో, బిఇడి చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసాడు. సి.ఆర్. రెడ్డి కాలేజ్ అఫ్ ఎడ్యుకేషన్, ఏలూరులో పి.జి., ఎం.ఎ ఎకనామిక్స్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నంలో పి.ఎచ్.డి. చేసి, డాక్టరేట్ పట్టా పొందాడు.
విజయాలు, వృత్తిగత వివరాలు
మార్చు1995లో ఏయూసెట్ లో మొదటి ర్యాంకు సాధించాడు. 1996 డీఎస్సీ రాసి ఎస్జీటీగా ఎంపికయ్యారు.వేపాడ హైస్కూల్ లో 1998లో స్కూలు అసిస్టెంటుగా చేరాడు. అక్కడ కొంతకాలం పనిచేసి 2002లో సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకానామిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తూ, 2023 జనవరిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాాడు.[3] ఎకనామిక్స్‌లో అతను పరిశోధన చేసి పలు రచనలు వెలువరించాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఆరు పుస్తకాలు రాసిన వేపాడ 12 సంవత్సరాలు ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశాడు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని ఆర్ సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో గ్రూప్స్, ఇతర పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వడంతోపాటు పేద విద్యార్థులకు ఎకనమిక్స్ మెటీరియల్ ను వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అందించాడు. సామాజిక సేవలో మొదటి నుంచి వేపాడ ముందుండేవారు. కొవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ చేశాడు. హుద్ హుద్ తుపాను సమయంలో ఏయూ పూర్వవిద్యార్థులతో కలిసి సేవలందించడమేకాదు.. రక్తదాన శిబిరాలు నిర్వహించాడు. స్వగ్రామంలో కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో 1300 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశాడు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం
మార్చుఉత్తరాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని వేపాడ చిరంజీవిరావు నిర్ణయించుకున్నాడు. 2023 మార్చి 13న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించాడు.[4] విద్యావేత్త, అర్థశాస్త్ర నిపుణుడు 'ఎకానమీ' చిరంజీవిగానే అందరికీ పరిచయమైన వేపాడ చిరంజీవిరావు తెలుగుదేశం పార్టీ మద్దతుతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలికి అభ్యర్థిగా పోటీచేశాడు.2023 మార్చి 23న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో వేపాడ ద్వితీయ ప్రాధాన్యత కలిగిన ఓట్లతో విజయం సాధించాడు.[4] తన విజయానికి కారకులైన వారందరకి వేపాడ చిరంజీవిరావు ధన్యవాదాలు తెలిపాడు.[4] వేపాడ చిరంజీవిరావు 2024 నవంబర్ 12న శాసనమండలిలో విప్‌గా నియమితుడయ్యాడు.[5]
మూలాలు
మార్చు- ↑ ABN (2023-02-05). "ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు". Andhrajyothy Telugu News. Retrieved 2023-03-24.
- ↑ https://telugu.oneindia.com/news/andhra-pradesh/know-about-vepada-chiranjeevirao-339536.html
- ↑ "వేపాడ చిరంజీవిరావు గురించి మరికొన్ని విషయాలు.. | know about vepada chiranjeevirao - Telugu Oneindia". web.archive.org. 2023-03-24. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 4.0 4.1 4.2 "ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు | Vepada Chiranjeevi Rao as MLC candidate of Uttarandhra TDP". web.archive.org. 2023-03-24. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (13 November 2024). "విశాఖకు 'విప్' పదవులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
వెలుపలి లంకెలు
మార్చు- Visakhapatnam’s lecturer couple spends month’s salary to fee
- TDP’s Chiranjeevi Rao wins North Andhra Graduate MLC seat
- డా.వేపాడ చిరంజీవిరావు అధికారిక వెబ్ సైట్ Archived 2023-02-21 at the Wayback Machine
- A 'saviour' for scores of students
- TDP declares candidate for North Andhra MLC Graduates’ Constituency