అనకాపల్లి జిల్లా
అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా పాత విశాఖపట్నం జిల్లా లోని భాగాలతో 2022లో కొత్తగా ఏర్పరచిన జిల్లా. జిల్లా కేంద్రం అనకాపల్లి. ఈ జిల్లాలోని బొజ్జన్నకొండ ప్రముఖ బౌద్ధ పర్యాటక ఆకర్షణ.
అనకాపల్లి జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 17°41′N 83°00′E / 17.69°N 83.00°E | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా కేంద్రం | అనకాపల్లి |
పరిపాలనా విభాగాలు |
|
విస్తీర్ణం | |
• Total | 4,292 కి.మీ2 (1,657 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 17,27,000 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
భాషలు | |
• ఆధికార | తెలుగు |
Time zone | UTC+05:30 (IST) |
చరిత్ర
మార్చుఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో ఉండేది. బొజ్జన్నకొండపై లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం శాతవాహనులు, విష్ణుకుండిన, గజపతి, విజయనగర రాజులు, గోల్కొండ సామంత రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లా ముఖ్యపట్టణమైన అనకాపల్లికి అనియాంకపల్లి, అనేకఫల్లె, విజయపురి, వెనియాపాలి, కనకపురి, బెల్లంపట్నం, అనేక పేర్లు ఉన్నాయి. ఇది పవిత్ర శారదా నది ప్రక్కన ఉంది. .అనకాపల్లిలోని బెల్లం మార్కెట్‌లో జాతిపిత గాంధీజీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బెల్లం మార్కెట్‌కి గాంధీ మార్కెట్ అని పేరు పెట్టాలని రైతులు గాంధీని కోరారు.అతను అభ్యర్థనను అంగీకరించాడు, మీరు ఏదైనా చెడు పనులు చేయకుంటే, నా పేరును ఉంచడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.గాంధీ N.G రంగ, CPI యొక్క జయ ప్రకాష్ నారాయణ్ వంటి నాయకులుసందర్శించిన తర్వాత, 1 సంవత్సరం తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ కూడా అనకాపల్లిలో ప్రసంగాలు చేశారు[2].భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బి.ఆర్.అంబేద్కర్ అనకాపల్లిని సందర్శించారు.[3]
2022 ఏప్రిల్ 4న పాత విశాఖపట్నం జిల్లా భాగంతో అనకాపల్లి జిల్లాను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు.[1]
భౌగోళిక స్వరూపం
మార్చుఅనకాపల్లి జిల్లా శారదా నది తీరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.జిల్లాకు ఉత్తరాన అల్లూరి సీతారామరాజు, తూర్పున విశాఖపట్నం, విజయనగరం, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలున్నాయి.
జిల్లా విస్తీర్ణం 4,292 చ.కి.మీ.[1] ఈ శారదా నది మాడుగుల కొండలలో జన్మించింది, ఇది చోడవరం, అనకాపల్లి, యలమంచిలిలో ప్రవహిస్తుంది.ఈ నది నూకాలమ్మ ఆలయానికి ఎదురుగా ప్రవహించేది, తరువాత గవరపాలెం ప్రజలు నదిని పొలాలకు మళ్లించారు. ఈ రోజు వరకు, నూకాలమ్మ ఆలయానికి కొన్ని మీటర్ల దిగువన నది బేసిన్ ఇసుక కనుగొనబడింది.[2]
జనగణన వివరాలు:
జిల్లా పరిధిలో జనాభా మొత్తం 17.270 లక్షలు మంది ఉన్నారు.[1]
పరిపాలనా విభాగాలు
మార్చుజిల్లాలో అనకాపల్లి రెవెన్యూ, నర్సీపట్నం రెవెన్యూ డివిజను అనే రెండు డివిజన్లున్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లను 24 మండలాలుగా విభజించారు.[1][4]
మండలాలు
మార్చునగరాలు, పట్టణాలు
మార్చుజిల్లా కేంద్రం అనకాపల్లి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. జిల్లాలో ఎలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలు, బౌలువాడ, చోడవరం, నక్కపల్లె, పాయకరావుపేట జనగణన పట్టణాలున్నాయి.
రాజకీయ విభాగాలు
మార్చుఅనకాపల్లి జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[5]
శాసనసభ నియోజకవర్గాలు
మార్చు- అనకాపల్లి
- ఎలమంచిలి
- చోడవరం
- నర్సీపట్నం
- పాయకరావుపేట (ఎస్.సి)
- పెందుర్తి (పాక్షికం) (మిగతా భాగం విశాఖపట్నం జిల్లాలో కలదు)
- మాడుగుల
ప్రముఖ వ్యక్తులు
మార్చు- విల్లూరి వెంకట రమణ, రాజ్య సభ ఎం.పి ( 2 సార్లు), కృషికార్ లోక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ
- మిస్సుల సూర్యనారాయణ మూర్తి, అనకాపల్లి ఎం.పి (2 సార్లు), కాంగ్రెస్ పార్టీ
- బుద్ధ మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లి మున్సిపాలిటీ చైర్మన్, విశాఖపట్నం తాలూకా బోర్డు సభ్యుడు
- బొడ్డేడ అచ్చన్నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సామాజిక కార్యకర్త
- భీశెట్టిఅప్పారావు, అనకాపల్లి ఎమ్మెల్యే, కృషికార్ లోక్ పార్టీ
- పెంటకోట వెంకట రమణ (పి.వి. రమణ), అనకాపల్లి ఎమ్మెల్యే,కొండకర్ల ఎమ్మెల్యే (రద్దు చేసిన నియోజకవర్గం)
- దాడి భోగలింగం నాయుడు, అనకాపల్లి మున్సిపాలిటీ చైర్మన్ (2 సార్లు)
- పెతకంశెట్టి అప్పలనరసింహం, అనకాపల్లి ఎం.పి,పెందుర్తి ఎమ్మెల్యే,విశాఖ మాజీ వుడా చైర్మన్
- కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎమ్మెల్యే,అనకాపల్లి ఎం.పి (2 సార్లు),వ్యాపారవేత్త
- దాడి వీరభద్రరావు, అనకాపల్లి ఎమ్మెల్యే (4 సార్లు),వ్యాపారవేత్త,దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు,దాడి వీరునాయుడు కళాశాల వ్యవస్థాపకుడు.
- ఆడారి తులసి రావు, యలమంచిలి సర్పంచ్,విశాఖ డైరీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు,కృషికర్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ
- చింతకాయల అయ్యన్న పాత్రుడు, నర్సీపట్నం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు
- సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, సినీ రచయిత, కవి
- ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పల నాయుడు, అనకాపల్లి ఎం.పి (3 సార్లు),విశాఖ మాజీ వుడా చైర్మన్
- పీలా కాశీ మల్లికార్జునరావు, హాస్యనటుడు
- పూరి జగన్నాధ్, సినిమా దర్శకుడు
- గురజాడ అప్పారావు, రచయిత, కవి
- పప్పల చలపతి రావు, యలమంచిలి ఎమ్మెల్యే ( 4 సార్లు),మాజీ టి.టి.డి. చైర్మన్
- త్రినాధరావు నక్కిన, సినిమా దర్శకుడు
- శ్రీరంగం శ్రీనివాసరావు, కవి,రచయిత
- పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే,వ్యాపారవేత్త
- శివ నిర్వాణ, సినిమా దర్శకుడు
- భీశెట్టి వెంకట సత్యవతి, అనకాపల్లి ఎం.పి
పర్యాటక ఆకర్షణలు
మార్చు- బౌద్ధస్థూపాలు: శంకరం గ్రామంలో తూర్పున ఉన్న బొజ్జన్నకొండ, పశ్చిమాన లింగాలకొండ ఉన్నాయి. ఈ కొండలలో అనేక ఏకశిలా స్థూపాలు, రాతి గుహలు, చైత్యాలు మఠాలు ఉన్నాయి.[6]
- కొండకర్ల ఆవ, వాడ్రాపల్లి ఆవ
- కొమరవోలు ఆవ
- దేవిపురం,దేవాలయాల సముదాయం
దేవాలయాలు
మార్చు- నూకాంబిక దేవాలయం :ఈ కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. ఉగాదికి ముందుగా వచ్ఛు దినమైన క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.[7] నూకాంబిక అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది.[8]
- గౌరమ్మ గుడి: మరొక ప్రసిధ్ద ఆలయం శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయం . జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
వ్యవసాయం
మార్చుపరిశ్రమలు
మార్చు- జిల్లాలో అనకాపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. మొత్తం దేశంలో రెండవ స్థానంలో ఉంది. తుమ్మపాలలో అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం ఉంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ 2.0 2.1 కడలి అన్నపూర్ణ (2000). అనకాపల్లి గ్రామదేవతలు-ఒక పరిశీలనము.
- ↑ "జిల్లా గురించి". Anakapalli District, Government of Andhra Pradesh. Retrieved 2022-06-10.
- ↑ "GO issued for creation of Anakapalle revenue division". The Hindu. Viskhapatnam. 4 April 2013. Retrieved 21 November 2015.
- ↑ "District-wise Assembly-Constituencies". ceoandhra.nic.in.
- ↑ "The Hindu". Archived from the original on 2007-03-11. Retrieved 2008-03-18.
- ↑ "The Hindu". Archived from the original on 2004-09-17. Retrieved 2008-03-18.
- ↑ "నూకాంబిక జాతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలి". andhrajyothy. 2022-03-29. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.