వేమవరపు రామదాసు

హానరబుల్ వేమవరపు రామదాసు పంతులు (1873 - 1944) ప్రముఖ న్యాయవాది, సహకారోద్యమ ప్రముఖుడు. అఖిల భారత సహకార సంస్థల సంఘానికి అధ్యక్షుడు. 1935 నుండి 1944లో మరణించేవరకు ఇండియన్ కో-ఆపరేటివ్ రివ్యూ పత్రికకు సంపాదకత్వం వహించాడు.[1]

వేమవరపు రామదాసు పంతులు

వేమవరపు రామదాసు కృష్ణా జిల్లాలోని వేమవరంలో 1873 అక్టోబరు నెలలో జన్మించాడు. ఈయన పసికందుగా ఉండగానే సంతానం లేని ఈయన పినతండ్రి రామదాసును దత్తతు తీసుకున్నాడు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో, మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, రామదాసు అనతికాలంలోనే స్థానిక న్యాయవాద సంఘంలో (బార్) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

1926 లో రెండవ వైస్రాయి కౌన్సిల్లో మద్రాసు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాడు.

రామదాసు 1913లో బాపట్లలో జరిగిన తొలి ఆంధ్ర మహాసభ సమావేశాల్లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1936లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. రామదాసు రాష్ట్ర సహకార సంఘానికి అధ్యక్షునిగాను, అఖిలభారత సహకార పత్రికాధిపతులుగాను ఉన్నాడు.

మూలాలు మార్చు