వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం
వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం గుజరాత్ రాష్ట్రంలోని భావ నగర్ ప్రాంతంలో ఉంది. ఇది బ్లాకు బాక్ (కొమ్ముల జింకలు) లకు ప్రధాన ఆకర్షణ.[1]
వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
ప్రదేశం | భావ నగర్ జిల్లా, గుజరాత్, భారతదేశం |
విస్తీర్ణం | 34.08 కి.మీ2 (13.16 చ. మై.) |
స్థాపితం | 1976 |
పాలకమండలి | Forest Department of Gujarat |
చరిత్ర
మార్చుఈ ఉద్యానవనాన్ని 1976 లో స్థాపించారు.[2] ఇది 34.08 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. పూర్వకాలంలో భావ నగర్ మహారాజు ఈ ప్రదేశాన్ని బ్లాకు బాక్ వేట కు ఉపయోగించేవాడు.
జంతు సంపద
మార్చుఈ ఉద్యానవనం బ్లాక్ బక్స్, తోడేళ్ళు, మాక్వీన్స్ బస్టర్డ్స్, హైనాస్, నక్కలు, కుందేళ్లు, అడవి పిల్లులు ఉన్నాయి. బ్రిటీష్ హారియర్ నిపుణుడు రోజర్ జాఫ్రీ క్లార్క్ ప్రకారం ఈ ఉద్యానవనంలో కనిపించే హారియర్ రూస్ట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పాడు.
మరిన్ని విశేషాలు
మార్చుమొదట ఈ ఉద్యనవనాన్ని 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. కానీ, 1980 లో మరో 16 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్నికి పెంచి మొత్తం ఉద్యానవనాన్ని 34.08 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి విస్తరించారు. ఈ ఉద్యానవనం వర్షాకాలంలో బ్లాక్ బాక్ లకు మరికొన్ని జంతుజాతులకు సంతానోత్పత్తి కారణంగా జూన్ 15 నుండి అక్టోబర్ 15 వరకు మూసివేయబడింది. ఇది సందర్శకుల సందర్శన కోసం అక్టోబర్ చివరి వారం నుండి మార్చి చివరి వారం వరకు అనుమతినిస్తారు. ఈ ఉద్యానవనంలో డిసెంబర్ నుండి మార్చి వరకు అనేక జాతుల వలస పక్షులు, మూడు జాతుల హారియర్లు, ఈగల్స్, వాడర్స్ వంటి పక్షి జాతులకు చెందిన పక్షులు వలస వస్తాయి. ఇక్కడ ముందస్తు బుకింగ్ ద్వారా బస ఏర్పాటు చేసుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ Blackbuck National Park
- ↑ వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్. "వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్". telugu.nativeplanet.com. Archived from the original on 17 ఏప్రిల్ 2016. Retrieved 3 October 2019.