వేలు ఆనందాచారి
వేలు ఆనందాచారి స్థపతి, శిల్పకారుడు, చిత్రకారుడు. శిల్ప, చిత్రకళా రంగాల్లో అనేక ప్రయోగాలు చేసిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా, సాంకేతిక సలహా నిపుణునిగా బాధ్యతలు నెరవేర్చారు. తెలంగాణా ప్రభుత్వం ద్వారా వైటిడిఏలో యాదాద్రి ఆలయ నిర్మాణంలో ఆదనపు స్థపతి సలగహాదారుడుగా బాధ్యతలు నెరవేర్చారు. ఈయన 45 యేండ్ల నుండి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ కార్యక్రమాల్లో ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ నుండి మూడు సార్లు ఉగాది పురస్కారాలు పోందారు.
డా.వేలు | |
---|---|
జననం | వేలు జూన్ 1, 1952 |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ఇతర పేర్లు | వేలు ఆనందాచారి |
వృత్తి | చిత్రకారుడు, శిల్పకారుడు |
మతం | హిందూ ( విశ్వబ్రాహ్మణ ) |
తండ్రి | ఆనందాచారి |
తల్లి | భాగ్యమ్మ |
వెబ్‌సైటు | |
http://avelusculptor.com/ |
2024, జనవరి 25న భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
బాల్యం, విద్య
మార్చుడా.వేలు స్థపతి, చిత్తూరు జిల్లా లోని వెన్నంపల్లిలో 1952 జూన్ 1న జన్మించాడు. తలిదండ్రులు ఆనందాచారి, భాగ్యమ్మ. భార్య పార్వతి, వీరికి శ్రీదేవి, శ్రీలక్ష్మి ఇద్దరు కుమార్తెలు.
ప్రాథమిక విద్యను వెన్నంపల్లెలో పూర్తి చేసుకున్నారు. తనకు సంక్రమించిన కళలను మెరుగులు దిద్దుతూ తదుపరి విద్య అంతా దూర విద్యా విధానంలో చేసారు. 1970 వరకూ ప్రాథమిక విద్య పూర్తి చేసికొని అపై 1971 లో ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేసారు.
తర్వాత హైద్రాబాద్ ఎండోమెంటు బోర్డు శిల్పకళా విద్యాశాఖలో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశాడు. దేవాదాయ శాఖలో సహాయ స్థపతిగా పనిచేస్తూ.. 1983లో గుంటూరులోని శ్రామిక విద్యాపీఠంలో డ్రాయింగ్, పెయింటింగ్, బ్లూప్రింట్ మేకింగ్లలో శిక్షణ పొందాడు.
72, 75 సంవత్సరం వరకూ
- 1972 నుండి 75 వరకూ శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల ( TTD ) తిరుపతిలో నాలుగు సంత్సరముల శిల్ప కళ శిక్షణ పొంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు.
- 1985లో బి.ఎ.పూర్తి చేసుకొని ఆపై 1988లో డ్రాయింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.
- 1994 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి దూర విద్య ద్వారా M.A. ( A.I.H.C & ఆర్కియాలజీ ) లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు.
- 2016 సం.లో గౌరవ డాక్టరేట్ పట్టాను ( రెలిజియెస్ అర్కిటెక్చర్ & కనస్ట్రక్షన్ మెథడ్స్ విభాగంలో) యునైటెడ్ ధియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ, సికింద్రబాద్ ద్వారా పొందినారు
కళా ప్రస్థానం, విశేషాలు
మార్చువేలు శిల్ప కళ ద్వారా ఆలయ నిర్మాణంలో నమూనాలు గీయడం, నిర్మాణాల పర్యవేక్షణ, పునర్ నిర్మాణాలలో పురాతన శిల్ప నమూనాలను యధావిధిగా నిర్మించడం వంటి అనేక రీతులతో పాటు వివిధ శిల్ప కళా ప్రాజెక్ట్ లు చేపట్టి నిర్వహిస్తున్నారు.
1975 నుండి చిత్ర కళా పోటీలలో, శిల్పకళాఖండాలు తయారీ పోటీలలో పాల్గొంటూ, తన చిత్రాలను, శిల్పాలను వివిధ్ఫ ప్రదర్శనలకు పంపి, అనేక అవార్డుల్ని అందుకొన్నాడు. ప్రభుత్వ దేవాదాయ, ధర్మాదాయ శాఖలో ఉపస్థపతిగా, స్థపతిగా, స్థపతి సలహాదారుడుగా వివిధ స్థాయిలలో విధులను నిర్వర్తించి 2010 వ సంవత్సరంలో పదవీ విరమణ పొందారు.
పదవీ విరమణ అనంతరం కూడా శిల్ప చిత్ర కళకు సంబంధించిన పలు ప్రాజెక్టులలో సలహాదారునిగా పనిచెస్తునారు..
1975 లో TTD వారి ద్వారా నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం (పిట్స్‌బర్గ్) ఆలయ విడి భాగాల నిర్మాణం (హైదరాబాద్) లో శిల్పకళాకారుడుగా వ్యవహరించాడు.
చిత్రకళల గురించి పత్రికల్లో అనేక వ్యాసాలు రచించాడు. జపాన్, ఒసాకలలో ఈయన చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి.
కాలం చెల్లిన ఔషదాలతో రంగుల తయారీ, ఔషదాలతో వర్ణ చిత్రాలు వేయడం (మెడిసిన్ పెయింటింగ్) అనే నూతన ప్రక్రియ కనుగొని దాని ద్వారా చిత్రాలను వేయడమే కాక వాటి ద్వారా అనేక రికార్డ్స్ సాధించారు.
దేవాదాయ శాఖ శిల్పశాస్త్ర ప్రచురణలల్లో వెలువడిన కాశ్యపు శిల్ప శాస్త్రం, మయమత శిల్ప గ్రంధ్తం అనే పుస్తకాలకు వీరు కూడా సంపాదకులుగా వ్యవహరించారు.
పురస్కారాలు
మార్చు- 1987 - సం.లో స్వర్ణ పథకం ( బెస్ట్ అవార్డు) జాతీయ స్థాయి చిత్ర కళా పోటీలలో ( నవరంగ్ చిత్ర కళా నికేతం - గుంటూరు )
- 2007 - కాలం చెల్లిన ఔషదాలతో రంగుల తయారీపై లింకా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు.
- 2008 - 25 గంటల్లో అత్యదిక చిత్రాలను అవే రంగులతో రూపొందించినందుకు మరొక రికార్డ్ లిమ్‌కా ద్వారా సాధించాడు.
- 2010 -సం.లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గ్లోబల్ వరల్ద్ రికార్డ్స్
- 2010 - సం.లో (2002 సం.లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కరించుకొని ) RHR ఆఫీషియల్ వరల్డ్ రికార్డ్స్ UK లో నమోదు.
- 2011 - సం.లో అమేజింగ్ రికార్డ్స్ కైవసం
- 2012 - సం.లో ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ లభించింది
- 20 13 - సం.లో అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్
- 2013 - సం.లో ఎలైట్ వరల్డ్ రికార్డ్స్, స్టేట్ బెస్ట్ సిత్జెన్ అవార్డు - కల్చరల్ అవార్నేస్స్ సంఘం - వైజాగ్
- 2012 - సం.లో కాశ్యపు శిల్ప శాస్త్రం పుస్తకంద్వారా వండర్ రికార్డ్స్ లో స్థానం
- 2014 - మయమత పుస్తక ప్రచురణకు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు
- 2017 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం ప్రతిభా పురస్కారం
- 2013 - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ హంస పురస్కారం
- 2018 - కోనసీమ చిత్ర కళా పరిషత్ చిత్రకళా జాతీయ పురస్కారం
- 2022 - స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం
- 2016 - విశ్వజన కళా మండలి ద్వారా బి.ఆర్.అంబేద్కర్ జాతీయ పురస్కారం
- 2012 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరల్ సొసైటీ ద్వారా బెస్త్ సిటిజెన్ అవార్డ్
- 2022 - తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ - దశమ వారికోత్సవ కార్యమాన్ని పురస్కరించుకొని 2022 జీవన సాఫల్య పురస్కార ప్రధానం.
- ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు
బిరుదులు
మార్చువివిధ సంస్థల ద్వారా పొందిన బిరుదులు
- కళారత్న
- శిల్పకళా సామ్రాట్
- స్థాపస్య సింహ
మూలాలు
మార్చుచానల్ - https://www.youtube.com/@veluanandachari337/videos
- https://www.thehindu.com/news/national/telangana/sculptors-take-centre-stage-at-yadadri/article33671802.ece
- https://www.deccanchronicle.com/nation/current-affairs/061116/andhra-pradesh-sculptors-build-yadadri-towers.html
- http://avelusculptor.com/
- https://archive.org/details/dr.-velu-anandachari-6/Dr.Velu%20Anandachari%20%282%29.jpeg
- http://www.telugubookofrecords.com/home/jalayoga-under-water-for-30-minutes-2/
- https://www.recordholdersrepublic.co.uk/world-record-holders/822/a-velu.aspx
- https://www.youtube.com/watch?v=gjV6E1iP7uY ( BBC తెలుగు న్యూస్ లో యదాద్రి నిర్మాణ పనులపై వేలు గారి ప్రసంగం )