వేలేటి రోజాశర్మ

వేలేటి రోజాశర్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా భాద్యతలు నిర్వహిస్తుంది.[1][2]

వేలేటి రోజాశర్మ

పదవీ కాలం
2019 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1975
మెదక్ జిల్లా తుఫ్రాన్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వేలేటి రాధకిషన్‌శర్మ
వృత్తి రాజకీయ నాయకురాలు, మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

జననం, విద్యాభాస్యం మార్చు

వేలేటి రోజాశర్మ 1960లో తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, తూప్రాన్ లో జన్మించింది. ఆమె ఎమ్మెస్సీ,బీఈడీ పూర్తి చేసి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన వేలేటి రాధకిషన్ శర్మను వివాహం చేసుకుంది.

రాజకీయ జీవితం మార్చు

వేలేటి రోజాశర్మ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్లాపూర్ నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎంపీటీసీగా గెలిచి 1995 నుండి 2000 వరకు చిన్నకోడూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా పని చేసింది. ఆమె అనంతరం 2001 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలుగా ఎన్నికై, టెక్మాల్ మండలం ఎల్లంపల్లిలో ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరి వివిధ ప్రాంతాల్లో పని చేసి 2019లో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న సమయంలో జరిగిన జిల్లా ప్రజా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసింది.[3]

వేలేటి రోజాశర్మ 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి చిన్నకోడూరు జడ్పీటీసీగా టీఆర్‌ఎస్ తరపున పోటీకి చేసి గెలిచింది. సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఆమె 2019 జూన్ 8న జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.

మూలాలు మార్చు

  1. Sakshi (8 June 2019). "తెలంగాణలో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు వీరే". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  2. Namasthe Telangana (7 March 2022). "శక్తి స్వరూపిణులు.. దైర్యానికి ప్రతీకలు..." Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.
  3. Andhra Bhoomi (22 April 2019). "సిద్దిపేట జడ్పీ చైర్మన్‌గా వేలేటి రోజాశర్మ?". Archived from the original on 9 March 2022. Retrieved 9 March 2022.