వేలేరుపాడు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లోని గ్రామం

వేలేరుపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రామం మండల కేంద్రం. ప్రసిద్డ పుణ్యక్షేత్రమయిన భద్రాచలం నుంచి 60 కి.మీ దూరంలో ఉంది.

చరిత్రసవరించు

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం మినహా మండలంలోని అన్ని గ్రామాలు) , కూనవరం, చింతరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్- జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.[1]

గణాంకాలుసవరించు

మూలాలుసవరించు

  1. "List of seven mandals to be included in AP". The Hans India. 11 July 2014. Retrieved 5 August 2014.

వెలుపలి లింకులుసవరించు