వైఎస్సార్ రైతు భరోసా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకం

వైఎస్సార్ రైతు భరోసా (ఆంగ్లం: YSR Rythu Bharosa) అనేది రాష్ట్ర ప్రభుత్వం రూ.7500, కేంద్ర ప్రభుత్వం రూ.6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి సంవత్సరానికి 13,500 రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం.[1]

వైఎస్సార్ రైతు భరోసా
పథకం రకంరైతుల సంక్షేమ కార్యక్రమం
ప్రాంతంఆంధ్రప్రదేశ్, భారతదేశం
వ్యవస్థాపకులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
మంత్రిత్వ శాఖవ్యవసాయ శాఖ, రైతు సంక్షేమం
స్థాపన2019 ఫిబ్రవరి 15 (2019-02-15)
స్థితియాక్టివ్
వెబ్ సైటుఅధికారిక వెబ్సైటు

పథకం ముఖ్యోద్దేశం మార్చు

వైఎస్సార్ రైతు భరోసా - ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.13,500 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500, భారత ప్రభుత్వం రూ.6,000 భరిస్తుంది.[2] కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడుతారు.[3]

అన్నదాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే వైఎస్సార్ రైతు భరోసా పథకంలోకి చేర్చుకుంటారు. రైతులు పొలం పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అర్హులకు వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ కింద ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా 13,500 రూపాయలను మూడు విడతలుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది.

అభివృద్ధి మార్చు

ఆంధ్రప్రదేశ్ లోని 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి రూ.3785 కోట్లను విడుదల చేస్తూ 2019 అక్టోబరు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసాను ప్రారంభించారు.[4] మొక్కలు, ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు రైతు భరోసా కేంద్రాలను 2020 మే 30న ప్రారంభించారు.[5] హార్టికల్చర్, ఆక్వాకల్చర్, వ్యవసాయ రంగాలకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.6,173 కోట్లు, 2020-21కి గాను రూ.6,928 కోట్లు ఖర్చు చేయబడింది.[6] రైతులకి ఆర్థిక సహాయం కొనసాగించడానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను హార్టికల్చర్, ఆక్వాకల్చర్, వ్యవసాయ రంగాలకు ఖర్చు చేసే రూ 6,928 కొట్లలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికె సగానికి పైగా అంటే రూ 3,615.60 కోట్లు కేటాయించడం జరిగింది

అంతర్జాతీయ గుర్తింపు మార్చు

విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలందిస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకే) ఇప్పుడు అంతర్జాతీయంగా అరుదైన ఖ్యాతిని గడించనున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) అందించే ప్రతిష్ఠాత్మక ‘ఛాంపియన్‌’ పురష్కారానికి ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం 2022 మే నెలలో నామినేట్‌ చేసింది.[7]

మూలాలు మార్చు

  1. "AP CM to launch YSR Rythu Bharosa-PM Kisan Yojana on Oct 15". @businessline (in ఇంగ్లీష్). 2019-02-14. Retrieved 2021-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Andhra CM launches YSR Bharosa scheme for farmers, weaves in Central grant". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-10-15. Retrieved 2021-10-10.
  3. "Andhra Pradesh giving its farmers highest financial aid, quality inputs: CM". @businessline (in ఇంగ్లీష్). 2019-02-15. Retrieved 2021-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Jagan launches farmer incentive scheme YSR Rythu Bharosa with PM KISAN Yojana". The News Minute (in ఇంగ్లీష్). 2019-10-15. Retrieved 2021-10-10.
  5. "All set for launch of Rythu Bharosa Kendras". The Hindu (in Indian English). 2020-05-28. ISSN 0971-751X. Retrieved 2021-10-10.
  6. "government has spent Rs 6,173 crore under Rythu Bharosa". The Times of India (in ఇంగ్లీష్). 2021-05-13. Retrieved 2021-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. telugu, Sakshi (2022-05-04). "YSR Rythu Bharosa Centres Nomination For UN Distinguished International Award - Sakshi". Sakshi. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.