వ్యంగ్య చిత్రాలు

వ్యంగ్య చిత్రాలు అనేవి వార్తా పత్రికలు, వారపత్రికలు తదితర పత్రికలలో వివిద రంగాలను గురించి హేళన, హాస్యం కలిపి వేసే బొమ్మలు. వీటిని కార్టూన్ అని పిలుస్తారు.

ప్రముఖ వ్యంగ్యచిత్రకారుడు జయదేవ్ ప్రకారం ఫ్రాన్స్ లోని లాస్కూ గుహల్లో ఆదిమానవులు గుహల గోడలmeeద వేలకొలది చిత్రాలు చిత్రించారు. ఆ చిత్రాలలో ఒకమేక చెట్టుమీది ఆకుల కోసం అర్రుచాచి ఎగురుతుంటుంది. దీనినే మొట్ట మొదటి చిత్రం వ్యంగ చిత్రంగా పరిగణిస్తారు. మామూలు రూపురేఖలను సాగదీస్తే వచ్చే బొమ్మలనే వ్యంగ్యచిత్రం (క్యారికేచర్) అంటారు. మొట్టమొదటి క్యారికేచర్ విక్టోరియా మహారాణి గీసిందనే కథ ప్రచారంలో ఉంది. ఒకసారి ఓ చిత్రకారుడు విక్టోరియా చిత్రాన్ని గీస్తూ అర్థంతరంగా వదిలిపెట్టిన చిత్రానికి మహారాణి వికారంగా వుండే ముక్కుని సాగదీసినట్లుగా నాలుగు గీతలు గీసిందట. ఇది చూసిన చిత్రకారుడు పకాపకా నవ్వాడట.[1]

ప్రస్ధానం

మార్చు

పాత రోజులలో ఇండియన్ ఇంక్ తో కాగితంపై గీసేవారు. ఇప్పుడు కంప్యూటర్లను వాడుతున్నారు. యానిమేషన్ గొప్ప పరిశ్రమగా రూపొందింది.

ప్రాధాన్యతలు

మార్చు

కార్టూన్లకి భావం ముఖ్యం.దానికి సరిపడిన గీతలుంటే చాలు. కేరికేచర్ లో శరీరనిర్మాణం, భావం, వ్యంగ్యం కలగలుస్తాయి.అందుకని కార్టూన్ ద్వారా చెప్పకలిగినదానికన్నా ఎక్కువచెప్పటానికి వీలవుతుంది.

చిత్ర కళలో రకాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. హాస్యానందం ఏప్రిల్ 2011 సంచికలో జయదేవ్ వ్యాసం