హాస్యానందం
హాస్యానందం ఎర్రబాలం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా నుండి వెలువడే హాస్య మాసపత్రిక. దీని ఎడిటర్ పి రాము. (రాంపా). కార్టూనిస్టులు, హాస్య రచయితలు నిర్వహించటం దీని ప్రత్యేకత.[1] జనవరి 2020 సంచిక 187 వ సంచికగా విడుదలైంది. ముఖచిత్రంపై కార్టూన్ కూడా వుండడం ఈ పత్రిక ప్రత్యేకం.
బ్నిం, తనికెళ్ల భరణి, కెవివి సత్యనారాయణ, మల్లిక్, డా సుదర్శన్, శంకు, టి చంద్రశేఖర్ లాంటి వ్యంగ రచయితలు పత్రికకు సాయ పడుతున్నారు,
వ్యంగ చిత్ర లేక కథనం రచయితలు
మార్చుఎ. దయాకర్, రామకృష్ణ, లేపాక్షి, హరి, బన్ను, కృష్ణ, బాచి, నాగిశెట్టి, నాగరాజ్, వెంకట్ వారి చిత్రాలు లేక కథనాలు క్రమం తప్పక వెలువడతాయి.
పత్రిక విశేషాలు
మార్చుహాస్య రచనల సీరియళ్లు, కార్టుాన్ ఫీచర్లు ప్రతి నెల అలరిస్తాయి. హాస్యరచనలపోటీలు, ప్రత్యేక హాస్య సంచికలు కూడా నిర్వహిస్తారు.
మూలాలు
మార్చు- ↑ "హాస్యానందం జాలస్థలి". 2020-01-17. Archived from the original on 2020-01-29. Retrieved 2020-01-17.