చిత్రలేఖనం
ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge), రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం (painting)
ఒక వైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ.చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడిపించాయని చెప్పవచ్చును. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ ప్రార్థనాలయాల పైకప్పులు క్రీస్తు జీవిత చరిత్రలోని ఘట్టాలతోను, తూర్పు దేశాలలో అనేక చిత్రలేఖనాలు బుద్ధుని చిత్రపటాలతోను చిత్రీకరించారు.
అంశాలుసవరించు
తీవ్రతసవరించు
చిత్రీకరించవలసినదాన్ని అవగతం చేసుకొనటం, దాని తీవ్రతకి ప్రాతినిధ్యం వహించటం చిత్రలేఖనాన్ని సశక్తపరుస్తాయి. విశ్వంలో ప్రతి బిందువుకి ఒక తీవ్రత ఉంటుంది. ఈ తీవ్రతని నలుపుగా గానీ, తెలుపుగా గానీ, ఈ రెంటి మధ్య వివిధ స్థాయిలలో ఉన్నా బూడిద రంగులలో వ్యక్తీకరించవచ్చును. సాధనలో చిత్రకారులు ఆకారాలని వ్యక్తీకరించటానికి వివిధ తీవ్రతలలో గల ఉపరితలాలని ఒకదాని ప్రక్కన మరొకటి చేరుస్తారు. అనగా చిత్రలేఖనం భావజాలం యొక్క మూలాల (జ్యామితీయా ఆకారాల, వివిధ దృక్కోణాల, చిహ్నాల వంటి వాటి) కి అతీతమైనది. ఉధాహరణకి, ఒక తెల్లని గోడ, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వస్తువులని బట్టి ఒక్కో బిందువు వద్ద వివిధ తీవ్రతలు ఉన్నట్లుగా ఒక చిత్రకారుడు గమనించగలుగుతాడు, కానీ సైద్ధాంతికంగా తెల్లని గోడ ఎక్కడైనా తెల్లగానే ఉంటుంది. సాంకేతిక పరంగా చూచినట్లయితే గీత యొక్క మందం కూడా గమనార్హం.
చిత్ర కళలో రకాలుసవరించు
- రేఖా చిత్రాలు (Diagrams)
- వ్యంగ్య చిత్రాలు (Cartoons)
- నీటి వర్ణ చిత్రాలు (Watercolor paintings)
- తైలవర్ణ చిత్రాలు (Oil paintings)
ఇతర చిత్రలేఖన పద్దతులుసవరించు
సమగ్ర చిత్రలేఖనంసవరించు
ప్రధాన వ్యాసం సమగ్ర చిత్రలేఖనం
చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు.
ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి ఐరోపా, అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి, ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.
చిత్ర రచనసవరించు
ప్రధాన వ్యాసం చిత్ర రచన
ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.
చిత్రాలను చిత్రించే వ్యక్తిని చిత్రకారుడు అంటారు. ఇతను రకరకాల రంగులను ఉపయోగించి తన కళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తాడు. చిత్రకారుడు చిత్రాన్ని చూసి లేదా ఊహించి తన ప్రతిభతో చిత్రాన్ని రూపొందిస్తాడు. చిత్రకారుడు చిత్రకళపై ఉన్న అభిలాషతో లేదా సంపదపై మక్కువతో ఈ కళను ఎంచుకుంటాడు. తాను చిత్రించిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టి ప్రదర్శకులను సమ్మోహితులను చేయటం తద్వారా వాటికి ఆకర్షితులైన చిత్రకళా ప్రియుల నుండి మంచి విలువను పొందుతాడు. చిత్రకారుల వలన నాటి సంస్కృతిని, దుస్తులను, ఆచార వ్యవహారాలను, జీవన శైలిని చిత్రాల రూపంలో నేటి మానవుడు తెలుసుకోనగలుగుతున్నాడు.