వ్యవసాయ కళాశాల, బాపట్ల

ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కాలేజి నడపబడుతుంది. ఇది బాపట్ల నుండి సూర్యలంక వెళ్ళే దారి లో ఉంది. దీనిని 1945 లో ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి వ్యవసాయ కళాశాల, దక్షిణభారతదేశంలో రెండవది. ఇది మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద ఉండేది, తరువాత 1964 లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించాక దానికిందకి తేపడింది. దీనిలో నాలుగు సంవత్సరాల B.Sc(వ్యవసాయం), రెండు సంవత్సరాల M.Sc(వ్యవసాయం), Ph.D courses ఉన్నాయి. B.Sc(వ్యవసాయం) లోకి ప్రవేశం EMCET ద్వారా జరుగుతుంది.