వ్యాసగోస్తని అనేది వడ్డూరి అచ్యుతరామ కవి గారు ప్రచురించిన తెలుగు వ్యాసాల సంపుటి. అంతకు ముందు ఆయన ఆకాశవాణిలో అప్పుడప్పుడు ప్రసారమైన స్వీయ కవితా ఖండికల పద్యసంకలనాన్ని 1995లో "కవితాకేతనము" అను పేర ప్రచురించారు.[ఆధారం చూపాలి] కవి గారికి ఏదైనా వ్రాయడం కంటే వినడం, చదవడం, ఏదైనా విషయంపై ప్రసంగించడం అంటే ఆసక్తి ఎక్కువ.ఆ విధంగా తరచు మహాకవుల ప్రసంగాలు వినడం, వారు వ్రాసిన సాహిత్య పుస్తకాలు చదవడం అలవాటు.ఆయన గ్రంథాలు చదివినప్పుడు కొందరు కవులు తాము నివసించు ప్రాంతాల పేర్లతోగాని, పట్టణాల పేర్లతో గాని కావ్యాలు వ్రాసి ప్రచురించడం గమనించారు.

రచనకు పేరు పెట్టుట

మార్చు

వడ్డూరి అచ్యుతరామ కవి గారి కథనం ప్రకారం ఒకసారి ఆయన తణుకులో ప్రసంగానికి వచ్చినప్పుడు "వ్యాస గౌతమి" అనే వ్యాస సంకలనాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ఆయనకిచ్చారు. అది కూడా బాగా చదివారాయన. ఆయన ఒక వ్యాస సంకలానాన్ని తయారు చేసిన తరువాత ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉండగా బేతవోలు వారు రాజమండ్రి గోదావరీ నదీ ప్రాంతంలో ఉండుటవలన వ్యాస గౌతమి అని వ్యాస సంపుటికి పేరు పెట్టినట్లు వ్రాసినట్లు తెలుసుకొన్నారు.అది చదివిన వెంటనే ఆయన గోస్తనీ నది ప్రవహిస్తున్న తణుకు పట్టణంలో స్థిరనివాసం ఏర్పచుకొన్న కారణంగా "వ్యాస గోస్తని" అని పేరు పెట్టాలని సంకల్పించారు.[ఆధారం చూపాలి] ఇంతే కాకుండా నన్నయ తణుకు గోస్తనీ సమీపంలో యజ్ఞం చెయ్యడం, ఆయన పేరుమీద వెలసిన నన్నయ భట్టారక పీఠంతో 30 సంవత్సరాలుగా ఆయనకున్న అనుబంధం తద్వారా అనేకమంది సాహితీ వేత్తలతో పరిచయం, తణుకు పురప్రముఖుల ఆదరాభిమానాలు ఆయన "వ్యాస గోస్తని" అని పేరు స్ఠిరీకరించుటకు కారణాలయ్యాయి.[ఆధారం చూపాలి]

శ్రీ వేదుల సూరి గారికి అంకితం

మార్చు

ఆయనకు పద్యకవిత్వాన్ని నేర్పడమే కాక, అనేక గ్రంథాలను నాచేత చదివించి ఆయన సాహితీ విజ్ఞానానికి మూలకారణం అయిన వేదుల సూరి గారికి ఈ "వ్యాస గోస్తని"ని అంకితం ఇచ్చారు. శ్రీ సూరిగారు ఆయనకు మాత్రమే కాక, ఆయన భార్య ప్రస్తుతం తణుకు జిల్లా పరిషత్ హై స్కూలులో తెలుగు పండితులుగా పని చేయుచున్న శ్రీమతి రాధామణికి భాషా ప్రవీణలో ప్రబంధాలు, వ్యాకరణం బోధించిన ప్రత్యక్ష గురువు. ఆయన పెద్ద కుమారుడు ప్రస్తుతం TCS లో Software Engineer గా పనిచేస్తున్న రామకృష్ణ ప్రసాద్ కు అక్షరాభ్యాసం చేసింది కూడా శ్రీ సూరి గారే. ఇన్ని బలమైన కారణాలవలన ప్రేమతో ఈ "వ్యాస గోస్తని"శ్రీ సూరి గారికి అంకితంగా ఇచ్చారు.[ఆధారం చూపాలి]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు