వ్రేలాడే తోటలు-బాబిలోనియా
వ్రేలాడే తోటలు (బాబిలోనియా) ప్రాచీన ప్రపంచంలో గల ఏడు వింతలలో ఒకటిగా ఉండేది.అవి యిప్పుటు ఇరాక్ దేశంలో బాబిల్ అనే ప్రాంతంలో ఉన్నాయి.[1] నాలుగువేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలోని ప్రధాన ముఖ్య పట్టణాలలో బాబిలోనియా ఒకటి. ప్రపంచంలోని ప్రప్రథమంగా ఏర్పడి ఉన్న మహా సామ్రాజ్యాల్లో ప్రసిద్ధి చెందినది బాబిలోనియా. ఈ మహానగరం 10 వేల హెక్టార్ల ల వైశాల్యంతో ప్రపంచంలోనే పెద్ద నగరంగా ప్రఖ్యాతి గాంచింది. ఆనాడు "యూఫ్రటిస్" నది ఈ నగరం గుండా ప్రవహించేది. అయితే ఈనాడు ఆ నది తన మార్గాన్ని మార్చుకున్నది. క్రీ.పూ 626 లో "ఛాల్‌డియాన్" వంశానికి చెందిన మహారాజు "నబో పొలొన్సర్" బాబిలోనియాకు అధిపతిగా ఉండేవాడు. బాబిలోనియా నగరం చుట్టూ చాల ఎత్తైన గోడలను నిర్మించాడారాజు. ఈ గోడలను "ది వాల్స్ ఆఫ్ బాబిలోనియా" అని పిలిచేవారు. గోడ ఎత్తు 335 అడుగులు. ఈ గోడలను ప్రపంచంలోని అద్భుతాలలో రెండోవదిగా పేర్కొనేవారు.
"నబొపాలస్సార్" అనంతరం అతని కుమారుదు నెబుచంద్‌నెజర్ (క్రీ.పూ 605-561) బాబిలోనియా మహారాజుగా ఉండేవాడు. ఆయన పరిపాలనలో బాబిలోనియా తన ప్రాచీన ఔన్నత్యాన్ని మించిన ఘనత పొందింది. తన తండ్రి ప్రారంభించిన బ్రహ్మాండమైన గోడల నిర్మాణాన్ని కొనసాగించాడు[2]. అవసరంమేరకు, ఎక్కడెక్కడ గోడలను బలాన్ని సమకూర్చేందుకు తగిన బురుజులు కూడా నిర్మించాడు. "యూప్రటిస్" నదిపైన గొప్ప వంతెన నిర్మాణం చేశాడు. పట్టణంలో కెల్లా ఉన్నతమైనదిగా కన్పించే బృహత్తరమైన రాజభవనాన్ని నిర్మించాడు.[3][4]
వ్రేలాడే తోటలు
మార్చు"బాబిలోనియా వ్రేలాడే తోటలు" నిజంగా ఏదో ఆధారంగా వ్రేలాడుతున్న ఉద్యానవనాలు కావు.భవనాల "టెర్రసు" మీద పంపులద్వారా నీటి సౌకర్యం పొందుతున్న తోటలు మాత్రమే బహుశః "ఆర్చిమిడియన్ స్కూలు" ఆ ఉద్యానవనాలకు ఆధారమై ఉండవచ్చు[5]. పిరమిడ్ ఆకారంలో వరుస క్రమంలో అనేక "టెర్రస్"లు నిర్మించబడ్డాయి. ఆయా ఉద్యానవనాలకు నీరు యూఫ్రటిస్ నది నుండి పంపులద్వారా అందజేయబడి ఉండవచ్చు. అందువల్ల ప్రతి టెర్రస్ మీద మొక్కలు పూలు, వివిధ రకాలు అందంగా కన్పిస్తుంటాయి. ఈ మొక్కలు పూలు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించి ఉండవచ్చు. ఈ మొక్కలు భవనం ఆకారంలో దాగి ఉన్న కారణంగా ఏ ఆధారం లేకుండానే ఈ తోటలు ఆకాశం నుండి వ్రేలాడుతున్నట్లు కన్పించేవి. అందువల్లనే వీటిని "వ్రేలాడే ఉద్యానవనాలు" అని చెప్పుకునేవారు.
నిర్మాణం
మార్చుకథనం ఎలా ఉన్నదంటే "నెబూహాడ్ నెజ్జర్" చక్రవర్తి తన చుట్టు పట్ల రాజ్యాలకు చెందిన పలువురు రాజ కుమార్తెలను వివాహమాడారు. అతని భార్యలలో మెడిస్ రాకుమారి సెమిరామిస్, ఒకరు మెడియస్ సైన్యం అస్సీరియన్స్ ను జయించడంలో నెబుచాన్డ్ నెజర్ కు సహాయపడ్డాయి.
ఈ వ్రేలాడే ఉద్యానవనాలు 328 అడుగులు లేక 100 మీటర్ల ఎత్తు వరకు ఎదిగాయి. ఈ తోటను 23 అడుగులు (7 మీటర్లు) మందం గల దృఢమైన గోడలతో చుట్టూ నిర్మాణమై రక్షణగా ఉన్నాయి. ఒక టెర్రస్ నుండి మరో టెర్రస్ ను కలుపుతూ మార్బుల్స్ (పాలరాయి) తో రూపొందించిన సోపానాలు ఉన్నాయి. ఈ సోపానాలు చాలా విశాలమైనవి. ఇవి వరుసగా ఉన్న ఆర్చీలతో కలుపబడ్డాయి. అందువల్ల బలంగా నిలబడగలిగాయి. పూలచెట్లు ఉండే తొట్టెలు రాతితోను, సీసంతోనూ తయారుచేయబడ్డాయి. వీటిలో నిండుగా ఇసుక పోసి ఉంటుంది.
టెర్రస్ లపైన పౌంటెన్లు జలపాతాలు కాలువలు నిర్మాణమై ఉన్నాయి. వీటి వలన తోటలకు ఎల్లప్పుడూ నీరు అందేది.ఈ తోటలకు ఒకరోజుకు 8200 గాలన్లు లేదా 37,000 లీటర్ల నీరు అవసరమయ్యేది.[6]
నిర్మాణ శైలి
మార్చుఈ వ్రేలాడే ఉద్యానవనాలు గొప్పగా ఆశ్చర్యం గొల్పడంలో విచిత్రమేమీ లేదు. వీటి నిర్మాణ శిల్పం, "హైడ్రాలిక్ ఇంజనీరింగ్" నిజానికి సమర్థవంతమైనదే గాక, ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
నేటి పరిస్థితి
మార్చునెబుకద్జరు మరణానంతరం 22 సంవత్సరాలకు బాబిలోనియా సామ్రాజ్యాన్ని పర్షియా చక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు. ఆయన్ను "సైప్రటిస్ ది గ్రేట్" అంటారు. ఈనాడు పర్షియన్లకు దక్కిందేమంటే అద్భుతమైన గోడల శిథిలాలు, ఒకటి లేక రెండు ఆర్చీలు.
ఇలాగే ప్రపంచ అద్భుతాలుగా భావించిన అనేకం శిథిలాలుగా మిగిలాయి. వాటిలో కొన్ని కూడా యిప్పటికి లేవు. అయినా గత చరిత్ర తెలిసినవాళ్ళు, గతంలోని మంచిని గొప్పతనాన్ని గ్రహించవలసినదే. ఈ శిథిలాల బట్తి ఊహించుకుని, ఆనందించవలసినదే.
యివి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుసూచికలు
మార్చు- ↑ Finkel (2008) pp. 19–20.
- ↑ Maureen Carroll, Earthly Paradises: Ancient Gardens in History and Archaeology, (London: British Museum Press, 2003), pp. 26–27 ISBN 0-89236-721-0.
- ↑ Finkel (1988) p. 58.
- ↑ Irving Finkel and Michael Seymour, Babylon: City of Wonders, (London: British Museum Press, 2008), p. 52, ISBN 0-7141-1171-6.
- ↑ 1. Strabo, ''Geographies'', XVI.1, § 5. Penelope.uchicago.edu. Retrieved on 2011-12-12.
- ↑ D. W. W. Stevenson (1992). "A Proposal for the Irrigation of the Hanging Gardens of Babylon". Iraq. 54: 51. JSTOR 4200351.