వ‌ల్ల‌భ‌భాయ్ వాసారాంభాయ్ మార్వ‌నీయ

వ‌ల్ల‌భ‌భాయ్ వాసారాంభాయ్ మార్వ‌నీయ 1943లో గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కి క్యారెట్ మ‌నుషులు తినే కాయ‌గూర అని ప‌రిచయం చేసిన వ్యక్తి. అతను వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వంచే వ్యవసాయ విభాగంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని పొందాడు.[1] [2]

వ‌ల్ల‌భ‌భాయ్ వాసారాంభాయ్ మార్వ‌నీయ

జీవిత విశేషాలు మార్చు

 
పద్మశ్రీ పురస్కారం

అతను గుజ‌రాత్‌లోని జునాగ‌ఢ్ జిల్లాలో ఖాంద్రోల్ గ్రామానికి చెందినవాడు. అతనికి 1943 నాటికి 13 యేండ్లు. అతను ఐదవ తరగతి అదివిన తరువాద విద్యకు స్వస్తిచెప్పి తన తండ్రికి గల 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పప్పులు, ధాన్యాలు, వేరుసెనగ పండించేందుకు తన తండ్రికి సహాయపడ్డాడు. ఆ పొలంలో పండించే పప్పులు, ధాన్యం, వేరుసెనగ వంటి పంటలను అమ్మేవారు. కానీ మొక్కజొన్న, జోవర్, రాజ్‌కో (ఒకరకమైన గడ్డి మొక్క), క్యారెట్లను పండించి పశువులకు మేతగా వేస్తుండేవారు. ఆనాటికి గుజరాత్ ప్రజలకు ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మనుషులు కూడా తినవచ్చని తెలియదు.[3] వ‌ల్ల‌భ‌భాయ్ వాసారాంభాయ్ మార్వ‌నీయ క్యారెట్ మ‌నుషులు తినే కాయ‌గూర అని గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కి ప‌రిచయం చేశాడు. 1943 వరకు క్యారెట్ ను ప‌శువుల దాణా కోసం మాత్ర‌మే పండించేవారు. ఒక‌రోజు అనుకోకుండా క్యారెట్‌ను కొరికి చూసి, రుచిగా అనిపించ‌డంతో అతను దానిని మార్కెట్‌కు తీసుకెళ్లాడు. అక్క‌డి వ‌ర్త‌కులు కూడా రుచిగా ఉంద‌ని, కొన‌డంతో క్యారెట్‌ను ఎక్కువ మొత్తంలో సాగు చేయ‌డం మొద‌లు పెట్టాడు.

తరువాత ఆ పంట స‌రిగా ఎద‌గ‌డానికి, మంచి దిగుబ‌డి రావ‌డానికి చాలా ప‌రీక్ష‌లు చేసి ఒక కొత్త వంగ‌డాన్ని కూడా క‌నిపెట్టాడు.[4] దాని పేరు "మ‌ధువ‌న్ గాజ‌ర్‌". ఈ కొత్త వంగడానికి చెందిన మొక్క‌ల మీద‌కి తుమ్మెద‌లు అధికంగా వ‌స్తుండ‌టం వ‌ల్ల ఈ పేరు పెట్టాడు. ఉత్త‌ర భార‌త‌దేశంలో ఎక్కువ దిగుబ‌డినిస్తున్న క్యారెట్ వంగ‌డం ఇదే అని తేల్చి, నేష‌న‌ల్ ఇన్నోవేష‌న్ ఫౌండేష‌న్ వారు 2017లో నేష‌న‌ల్ గ్రాస్‌రూట్స్ ఇన్నోవేష‌న్ అవార్డును అతనికి అంద‌జేశారు. ఈ అవార్డును ఆయ‌న మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు.[5]

మూలాలు మార్చు

  1. "Here is the complete list of Padma awardees 2019". Archived from the original on 2019-01-26. Retrieved 2019-01-26.
  2. "Padma Awards" (PDF). Padma Awards ,Government of India. Archived from the original (PDF) on 26 జనవరి 2019. Retrieved 25 January 2019.
  3. "This 95-Year-Old Won an Innovation Award for Introducing Carrots to Gujarat in 1943".
  4. "సాగులో కొత్త పోకడలు". ntnews. 29 January 2020. Archived from the original on 25 జూలై 2020. Retrieved 25 July 2020.
  5. "గుజ‌రాత్‌కు క్యారెట్ తిన‌డం నేర్పింది ఈయ‌నే!".