శంకరం (బుద్ధ స్తూపాలు)

ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండల గ్రామం, బౌద్ధక్షేత్రం
(శంకరం (బుద్ధ స్థూపాలు) నుండి దారిమార్పు చెందింది)

శంకరం బౌద్ధ స్తూపాలు అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలానికి చెందిన శంకరం గ్రామంలో ఉన్నవి. ఈ ప్రాంతం బౌద్ధ క్షేత్రం అవశేషాలవలన పర్యాటక ప్రదేశం.[1]

శంకరం (బుద్ధ స్థూపాలు)
బొజ్జన్నకొండలోని బుద్ధుని శిల్పం
ప్రదేశంశంకరం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్
బౌద్ధక్షేత్ర అవశేషాలు, శంకరం

పేరు వ్యుత్పత్తి మార్చు

ఇక్కడ శారదా నది ఒడ్డున  గల బౌద్ధ ఆరామాల అవశేషాలు విరాజిల్లిన ఉత్కృష్ట సంస్కృతుల ఆనవాలుగా నేటికి నిలచి ఉన్నాయి. బౌద్ధ సంఘం, ఆరామము కలిగినది కనుకనే ’సంఘఆరామము’ అనే పేరు కాలక్రమేణా ’సంగారామం’, శంకరంగా మార్పుచెందింది.

భౌగోళికం మార్చు

ఈ గ్రామం విశాఖపట్నం నుండి 45 కి.మీ, అనకాపల్లి నుండి 3 కి.మీ. దూరంలో వుంది.

పర్యాటక ఆకర్షణలు మార్చు

ఇక్కడ గల బొజ్జన్నకొండ, లింగాలకొండలపై బౌద్ధ క్షేత్రాలున్నాయి. ఈ స్థలాలు సా.శ. 4 నుండి 9 శతాబ్ది మధ్యవిగా నమ్ముతారు. ఈ క్షేత్రంలో ఒక వెయ్యి సంవత్సరాల పాటు థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధ శాఖలు అభివృద్ధి చెందాయి. ఇప్పటికి చుట్టూ పచ్చని పొలలు, కొడల నడుమ ఆహ్లాదకరంగా దేశ విదేశియులను నిత్యం ఆకర్షిస్తున్నాయి.

బొజ్జన్న కొండ మార్చు

క్రీస్తు పూర్వం మూడు, నాలుగు శతాబ్దాలకు చెందిన ఈ బౌద్ధక్షేత్రాలు అప్పట్లో సంస్కృతికి, అభ్యాసానికి పట్టుగొమ్మలుగా విలసిల్లినట్లు చరిత్రలో చూడగలము. ఆరామమనేది బౌద్ధ సన్యాసుల నివాస స్థలము. ఇక్కడ అనేక ఏకశిలా స్తూపాలు,రాతి గుహలు,శిథిలస్థితిలో ఉన్న ప్రార్థనా స్థలాలు,ధ్యాన మందిరాలు,విశ్రాంతి గృహాలు,ఇటుక ఆహ్వాన ద్వారాలు ఈ జంట గ్రామాలలో ఇప్పటికీ చూడొచ్చు.

1906 లో బ్రిటీషు అధికారి అలెక్జాండరు రియా తవ్వకాలలో ఇవి బయటపడ్డాయి. బొజ్జన్న కొండకు ఆ పేరు రావడానికి ఆ ప్రాంతంలో దొరికిన ’బుద్దుడు కూర్చొని ఉన్న’ విగ్రహాన్ని బట్టి బుద్ధన్న, బొజ్జన్నగా పిలవబడి చివరికి బొజ్జన్న కొండగా మారింది. బొజ్జన్న కొండలో మూడు ముఖ్య బౌద్ధ శాఖలైన  హినయాన,మహాయాన, వజ్రయానాను  చూడొచ్చు.ఇక్కడ ఆసక్తి గొలిపేవి బుద్ధుని శిల్పాలు ధ్యాన ముద్ర లోనూ, స్థూపాలుగా ఉన్నాయి.అవి మొదట రాతితో చెక్కి, తర్వాత ఇటుకలతో పైన అలంకరణ చేసారు.

లింగాల కొండ మార్చు

అసంఖ్యాకమైన ఏకశిలా విగ్రహాలకు నిలయమైన లింగాలమెట్ట లో గుహలు, భవనాలు భయటపడ్డాయి. తవ్వకాలలో శాతవాహనులవి,సముద్ర గుప్తుని కాలం నాటి నాణేలు బయట పడ్డాయి. చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుడి రాగి నాణేలు ఇక్కడ దొరికాయి. గుహా ముఖాలపై అనేకం బుద్ధుని విగ్రహాలను చెక్కడం జరిగింది. బుద్ధుడు కూర్చొని ఉన్న భంగిమలో మట్టి పలకలు దొరికినవి.

ధ్యాన మందిరాలుగా ఉన్నవి గురువు కోసం  కూర్చోవడనికి ఎత్తైన ప్రదేశంలో అర్ధ చంద్రాకారంలో ఉంటే, శిష్యుల కోసం కొంత తక్కువ ఎత్తులో దుండ్రంగా ఆసనాలు కనబడతాయి. ఇప్పటికి శిష్యుల కోసం తొలిచిన గదులు వాటిలో దీపాల కొరకు కొద్దిగా తొలిచిన ప్రదేశం మనకు కనువిందు చేస్తాయి. రాతిని ఏక శిల గానే తొలచిన ఒక గుహను, నాలుగు స్థంబాలతో చెక్కిన బుద్ధుని విగ్రహాన్ని, మరోగుహలో తొమ్మిది స్థంబాలతో చెక్కిన మరో విగ్రహాన్ని చూడొచ్చు.

నీటిని నిల్వ చేసుకోవడానికి రాతిని తొలచిన బావులు. మరికొన్ని చిన్నవి, సమతల నేలపైనే ఉన్న గుహలు  విహారాలుగా సన్యాసులకు, శిష్యుల కోసం ఉద్దేశించినవి ఉన్నాయి. గుహ ద్వారం యొద్ద బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్న బృహత్ విగ్రహం. బొజ్జన్న కొండ పై ఒక ద్వారపాలకుడు శిల్పం పెద్ద బొజ్జతో కపాల మాలతో ఉంది. దీనిని గణపతిగా కొందరు పొరబడుతున్నారని ఇలాంటివి కపాల ధరణా శిల్పాలు  ఇండోనేషియా లోని బౌద్ధ స్థలాలలో సర్వ సాధారణామని  పురావస్తు మరియి సంగ్రహశాల సహాయ సంచాలకులు కె.చిట్టిబాబు తెలియజేసారు[2].

యునెస్కో సంస్కృతి వారసత్వ సంపద పరిగణన ప్రయత్నాలు మార్చు

భారతీయ పురావస్తు శాఖ శంకర ప్రదేశానికి యునెస్కో ప్రపంచ సంస్కృతి వారసత్వ సంపద జాబితాలో చేర్చడానికి 2017లో అభ్యర్థించారు.[2].   

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Sankaram Buddhist Excavations - IndiaAirport.com". indiaairport.com. Retrieved 2023-10-05.
  2. 2.0 2.1 https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/move-to-get-world-heritage-status-for-buddhist-sites/article17533703.ece