సత్యం శంకరమంచి
సత్యం శంకరమంచి (1937-1987) గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి 3న శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెదపున్నమ్మలు సత్యాన్ని పెంచి పెద్ద చేసారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణానందశాస్త్రి గార్లు ప్రోత్సహించారు.
శ్రీ శంకరమంచి సత్యం | |
---|---|
జననం | సత్యం మార్చ్3, 1937 గుంటూరు జిల్లా అమరావతి చాపాడు |
మరణం | 21 మే 1987 |
నివాస ప్రాంతం | విజయవాడ |
ఇతర పేర్లు | షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరాం కలం పేర్లు |
వృత్తి | ఆకాశవాణి కేంద్రంలో అధికారి |
ఉద్యోగం | ఆకాశవాణి విజయవాడ కేంద్రం |
తండ్రి | శంకరమంచి కుటుంబరావు |
తల్లి | శంకరమంచి శేషమ్మ |
Notes 1979 సంవత్సరపు రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి అమరావతి కథలుకు ఇవ్వబడినది |
ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ. చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 'అమరావతి కథలు' వ్రాసినా, ' కార్తీక దీపాలు' వెలిగించినా నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.
'రేపటి దారి ', 'సీత స్వగతాలు ' 'ఆఖరి ప్రేమలెఖ ' ఎడారిలో కలువపూలు ' సత్యం కలం నుండి వెలువడిన నవలలు.
హరహర మహాదేవ ఆయన వ్రాసిన నాటకం.
ఆకాశవాణిలో ఉద్యోగం చేసారు.
అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు. ఈ కథలు శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో దూర దర్శన్‌లో ప్రసారమయ్యాయి
కథలు
మార్చుఅమరావతి కథలు (100)
రచనలు
మార్చు- నవలలు
- రేపటి దారి
- సీత స్వగతాలు
- ఆఖరి ప్రేమలేఖ
- ఎడారిలో కలువపూలు
- నాటకాలు
- హరహర మహాదేవ
- ఇతర రచనలు
- షేక్ జాన్సన్ శాస్త్రి, శారదానాథ్, సాయిరాం అనే కలం పేర్లతో దిన, వారపత్రికలలో వ్యంగవ్యాసాలు -
- పత్రికలలో ప్రచురించిన శీర్షికలు
- ఇంతే సంగతులు
- తధ్యము సుమతీ
- ఎందరో మహానుభావులు
మూలాలు
మార్చు- నవోదయా పబ్లికేషన్స్ వారు ప్రచురించిన అమరావతి కథలు నుండి.