శంకు తెలుగు పత్రికల్లో కార్టూన్లు వేసిన చిత్రకారుడు. "శంకు" అన్న కుంచె పేరుతో కార్టూన్లు వేసిన ఇతడి అసలు పేరు ఎస్. బి. శంకర కుమార్.

ఎస్. బి. శంకర కుమార్‌
SANKU wikipedia.JPG
శంకు
జననంఎస్.బి.శంకర్‌ కుమార్‌
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుశంకు

జీవిత విశేషాలుసవరించు

శంకు మొదట్లో "శంకర్" అన్న అసలు పేరుతోటే కార్టూన్లు వేస్తూ ఉండేవాడు. కాని ఆ పేరుతో ఇతరులు కూడా బొమ్మలు వేస్తూ ఉండటంతో, ప్రత్యేకత కోసం ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న ప్రముఖ రచయిత, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఇతని పేరులో శంకర్ లోని శం, కుమార్ లోని కు తీసి శంకు కు జన్మ నిచ్చాడు. అప్పటినుండి, శంకు అనేక కార్టూన్లు వేశాడు. కొన్ని ధారావాహిక కార్టూన్లు కూడా వేశాడు.

శంకు బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శకత్వం వహిస్తూ ధారావాహికలు, డాక్యుమెంటరీలు తీసిన కార్టూనిస్టు శంకు. భారత దేశంలోని పేరెన్నికగన్న కార్టూనిస్టులందరి గురించి దూరదర్శన్ వారి కోసం డాక్యుమెంటరీలు తీశాడు. అందులో బాపు, ఆర్కే లక్ష్మణ్, శంకర్ పిళ్ళై, మారియో మిరాండా వంటి హేమాహేమీల గురించిన డాక్యుమెంటరీలు ఉన్నాయి.

శంకు దృశ్యరూప మిచ్చిన వంశీ వ్రాసిన "మా పసలపూడి కథలు" టివిలో ధారావాహికగా ప్రసార మయ్యాయి. మా టి వి ఛానెల్లో ఈ ధారావాహిక ప్రసారమైంది.

పార్వతి మళ్ళీ పుట్టింది పేరుతో 1977 లో శంకు ఒక కథ రాశాడు. శరత్ రాసిన దేవదాసు కథకు ఇది పేరడీ. దేవదాసు మళ్ళీ పుట్టాడు అనే పేరుతో దాసరి నారాయణరావు సినిమా తీసిన సమయంలోనే శంకు ఈ కథ రాసాడు.[1]

అవార్డులుసవరించు

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'కార్టూనిస్టు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[2]

మూలాలుసవరించు

  1. వెలుదండ, నిత్యానందరావు (1994). తెలుగు సాహిత్యంలో పేరడీ. హైదరాబాదు. p. 226.
  2. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=శంకు&oldid=2816506" నుండి వెలికితీశారు