శంఖం 2009 లో శివ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, త్రిష ముఖ్యపాత్రల్లో నటించారు.[1]

శంఖం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం శివ
కథ శివ
తారాగణం గోపీచంద్
త్రిష
చంద్రమోహన్
కోట శ్రీనివాసరావు
వేణుమాధవ్
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ఆలీ (నటుడు)
ఫిష్ వెంకట్
సంగీతం ఎస్.ఎస్. తమన్
సంభాషణలు రావిపూడి అనిల్
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా
విడుదల తేదీ 18 సెప్టెంబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చందు (గోపీచంద్) తన మామయ్య (చంద్రమోహన్)తో కలసి ఆస్ర్టేలియాలో వుంటాడు. చందుకు తన తల్లిదండ్రులు మరణించారని చెప్పుంటాడు వాళ్ల మామయ్య. కానీ చందు తండ్రి రాయలసీమ శివన్న (సత్యరాజ్) మాత్రం బతికేవుంటాడు. ఇదిలా వుంటే చందు పెళ్ళికి పిల్లను వెతికే పనిలో వుంటాడు వాళ్ల మామయ్య. ఇలా అమ్మాయిని వెతుకుతున్న క్రమంలో మహాలక్ష్మి (త్రిష) ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు చందు. కానీ మహాలక్ష్మి చందుని ప్రేమించదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మహాలక్ష్మి కూడా తనని ప్రేమించేలా చేస్తాడు చందు. మహాలక్ష్మి తన ప్రేమ విషయాన్ని చందుకి చెప్పాలనుకున్నప్పుడే మహాలక్ష్మి అత్తయ్య (తెలంగాణా శకుంతల) ఆస్ట్రేలియా వచ్చి తన తనయుడి (వేణుమాధవ్)కి ఇచ్చి పెళ్ళి చేయాలని మహాలక్ష్మిని బలవంతంగా ఇండియాకు తీసుకెళ్తుంది. విషయం తెలుసుకున్న చందు మహాలక్ష్మి కోసం ఇండియాకు వస్తాడు.

ఇదిలా వుంటే ఫ్లాష్ బ్యాక్ లో పశుపతి (కోట శ్రీనివాసరావు)కి, శివన్నకు వైరం వుంటుంది. పశుపతి పేద ప్రజల భూములు లాక్కుని, వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తుంటాడు. దీనికి శివన్న అడ్డు పడటమే కాకుండా పశుపతిని జైలుపాలు చేస్తాడు. దీంతో శివన్న పై పగ పెంచుకున్న పశుపతి శివన్న కవల పిల్లల్లో ఒకరిని, ఆయన భార్య (సీత)ని చంపేస్తాడు. దీంతో శివన్న భార్య తనకున్న ఒక్క కొడుకుని తన అన్నయ్య (చంద్రమోహన్)కు అప్పజెప్పి తనని ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్లమని చెప్పి కన్నుమూస్తుంది. దీంతో ఆమె అన్నయ్య ఆ పిల్లాన్ని తీసుకొని ఆస్ట్రేలియా వచ్చేస్తాడు. అలా పెరిగిన పిల్లాడే చందు.

ఇక చందు ప్రేమించిన మహాలక్ష్మి పశుపతి కూతురే. చందు శివన్న కొడుకేనని తెలిసిన పశుపతి చందుకి తన కూతురుని ఎర చూపి శివన్నపై ఉసిగొల్పుతాడు. శివన్న తన తండ్రి అన్న విషయం తెలియని చందు అతని పై దాడి చెయ్యబోయి ఖంగుతింతాడు. కానీ చందుని చూసిన శివన్న చందు తన కొడుకేనని తెలుసుకొని ఆసుపత్రిలో చేర్పిస్తాడు. ఆ తర్వాత తన మామయ్య ద్వారా అసులు విషయం తెలుసుకున్న చందు తన తల్లిని హతమార్చిన పశుపతి, అతని తమ్ముడిని అంతమొందించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో శివన్నను కూడా హతమారుస్తారు పశుపతి మనుషులు. చందు పశుపతిని ఎలా అంతమొందిచి, తన ప్రేమను గెలిపించుకున్నాడనేది మిగిలిన కథ.

తారాగణం

మార్చు
  • చందు గా గోపీచంద్
  • మహాలక్ష్మి గా త్రిష
  • శివయ్య గా సత్యరాజ్
  • చంద్రమోహన్
  • పశుపతి గా కోట శ్రీనివాసరావు
  • శివయ్య భార్య గా సీత
  • తెలంగాణా శకుంతల
  • ప్రేమ్ కుమార్ గా వేణుమాధవ్
  • సైఫ్ ఆలీ ఖాన్ గా ఆలీ

పాటలు

మార్చు
  • మహాలక్ష్మి, రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.కార్తీక్, హరిహర రంజిత్, మేఘా, జననీ, ప్రియా, హిమెష్, దివ్య, గీతా మాధురి, రీటా
  • దాక్కు దాక్కు , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.కె.కె.రాహూల్ నంబియార్ , ప్రియా, మేఘా, ప్రియదర్శిని
  • మమ్ము,రచన : రామజోగయ్య శాస్త్రి, గానం. ఉదిత్ నారాయణ్ , మాణిక్య వినాయగం
  • దీరధి ,రచన : ఆచార్య శ్రీ శ్యేషం, పుష్పవనం కుప్పుస్వామి, రంజిత్
  • లే బాబోయ్ ,రచన : భాస్కర భట్ల రవికుమార్, గానం. రంజిత్, నవీన్, ప్రియదర్శిని
  • శంఖం, రచన: ఆచార్య శ్రీశ్యేశం, గానం. కార్తీక్, రంజిత్, నవీన్, రాహూల్ నంబియార్, సత్యన్, వాసు

మూలాలు

మార్చు
  1. "శంఖం సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 17 October 2017.