ఫిష్ వెంకట్

భారతీయ నటుడు

ఫిష్ వెంకట్ ఒక తెలుగు సినీ నటుడు. ఎక్కువగా హాస్య ప్రధాన, సహాయ పాత్రలు వేస్తుంటాడు.

ఫిష్ వెంకట్
Fish venkat.jpg
జన్మ నామంమంగిలంపల్లి వెంకటేశ్‌
జననం
India హైదరాబాదు, భారతదేశం
ప్రముఖ పాత్రలు ఆది
బన్ని
కింగ్

నేపధ్యముసవరించు

ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్‌. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. వెంకట్ ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి ద్వారా వచ్చాడు. దర్శకుడు వి.వి.వినాయక్ ఇతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ వి.వి.వినాయక్ సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. ఇతడు ఎక్కువగా తెలంగాణా మాండలికము మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు పోషించాడు. ఆది సినిమా ద్వారా ప్రజాధరణ పొందిన వెంకట్ సుమారు ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాడు.

వ్యక్తిగత జీవితముసవరించు

ఇతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్ళి చేసేశారు. పెదబాబు యాదేష్ ‘వీడు తేడా’, ‘ప్రేమ ఒక మైకం’, ‘డి ఫర్ దోపిడీ’ చిత్రాల్లో ప్రతినాయక్ పాత్రలు చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. మూడవ కుమారుడు ప్రాథమిక విద్య చదువుతున్నాడు.

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2002 ఆది (సినిమా)
2005 భగీరథ
బన్ని
2006 సామాన్యుడు
2008 కింగ్
హీరో
శౌర్యం
రెడీ
కాళిదాసు (2008 సినిమా)
పౌరుడు
2009 శంఖం (సినిమా)
గణేష్
2010 డాన్ శీను
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
పప్పు (సినిమా)
వరుడు
సీతారాముల కళ్యాణం లంకలో
అదుర్స్
2011 మిరపకాయ్
వీర
కందిరీగ (సినిమా) చింటు
వీడు తేడా
సోలో
2012 దరువు ఫిష్ ఫిష్ వెంకట్
సుడిగాడు వెంకట్
గబ్బర్ సింగ్
2013 నాయక్ (సినిమా)
జై శ్రీరామ్[1]
అడ్డా[2]
రేస్
2014 జోరు[3]
జంప్ జిలాని
2015 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
భమ్ బోలేనాథ్[4]
మోసగాళ్లకు మోసగాడు
2016 సుప్రీమ్ పోలీసు అధికారి
బాబు బంగారం
2017 రాధ
2018 కన్నుల్లో నీ రూపమే
2018 ఇష్టంగా
2019 బుర్రకథ
2020 మా వింత గాధ వినుమా తెలుగు
2020 గువ్వ గోరింక తెలుగు
2020 బొంభాట్ తెలుగు
2022 సూపర్ మచ్చి తెలుగు
2022 సురాపానం తెలుగు

మూలాలుసవరించు

  1. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
  2. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
  3. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
  4. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020.

బయటి లింకులుసవరించు