శంబీపూర్ రాజు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

సుంకరి రాజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2][3]

శంబీపూర్ రాజు
శంబీపూర్ రాజు


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జనవరి 2016 - 4 జనవరి 2028
నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 4 జనవరి 1980 [1]
శంబీపూర్ గ్రామం, కుత్బుల్లాపూర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు ఆంజనేయులు , వినోద
జీవిత భాగస్వామి లావణ్య
సంతానం దీపక్ రావు & స్నికిత
నివాసం శంబీపూర్ గ్రామం,కుత్బుల్లాపూర్‌ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ , భారతదేశం

జననం, విద్యాభాస్యం

మార్చు

శంబీపూర్ రాజు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలం, శంబీపూర్ గ్రామంలో 1980 జనవరి 4లో ఆంజనేయులు, వినోద దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు శంబీపూర్ గ్రామంలో చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

శంబీపూర్ రాజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా 2001 ఏర్పడ్డా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2001లో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం లో మొట్టమొదటి సారి టీఆర్‌ఎస్ జెండా ఎగురవేశాడు. శంబీపూర్ రాజు 2001లో టీఆర్‌ఎస్ పార్టీ మండల కోశాధికారిగా, రంగారెడ్డి జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా, యువజన విభాగం సెక్రటరీ జనరల్‌గా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన 2016లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలుపొందాడు.[4] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[5] ఆయన ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు.[6]

శంభీపూర్ రాజు 2022 జనవరి 26న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7]

రాజకీయ ప్రస్థానం

మార్చు
 • 2001లో కేసీఆర్‌ స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు.
 • 2002లో కుత్బుల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ యూత్‌వింగ్‌ కోశాధికారిగా
 • 2004లో రంగారెడ్డి జిల్లా పార్టీ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా
 • 2009 నుంచి 2014 వరకు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిగా
 • 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
 • 2017లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యూత్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
 • 2021 నవంబరు 14న రెండో సారి ఎమ్మెల్సీగా రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[8] ఆయన 2022 ఫిబ్రవరి 17న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[9][10]
 • 2022 జనవరి 26న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
 • 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[11]  

మూలాలు

మార్చు
 1. News18 Telugu (4 January 2020). "PICS: టీఆర్ఎస్ భేటీలో ఎమ్మెల్సీ బర్త్ డే సెలబ్రేషన్స్..." News18 Telugu. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Sakshi (31 December 2015). "పెద్దల సభకు 'చిన్నోడు'". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
 3. Deccan Chronicle (9 December 2015). "TRS names MLC candidates". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
 4. Sakshi Post (30 December 2015). "TRS Wins 4 MLC Seats, Congress Grabs Nalgonda, Mahbubnagar". Sakshi Post (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
 5. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
 6. Namasthe Telangana (3 June 2021). "ఉచిత అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి". Namasthe Telangana. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
 7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
 8. Eenadu (25 November 2021). "ముగ్గురు తెరాస అభ్యర్థుల ఏకగ్రీవం". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
 9. Dishadaily (దిశ) (17 February 2022). "ఎమ్మెల్సీగా శంభీపూర్ రాజు ప్రమాణ స్వీకారం". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
 10. Namasthe Telangana (18 February 2022). "ఎమ్మెల్సీగా శంభీపూర్‌ రాజు ప్రమాణం". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
 11. Eenadu (6 April 2024). "పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.