శకుంత్లా ఖటక్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆమె కలనౌర్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

శకుంత్లా ఖటక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009
ముందు కర్తార్ దేవి
నియోజకవర్గం కలనౌర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

శకుంత్లా ఖటక్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో కలనౌర్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ పార్టీ అభ్యర్థి నాగ రామ్‌ పై 27,860 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

శకుంత్లా ఖటక్ 2014 ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ అవతార్ బాల్మీకిపై 3,972 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమె 2019 ఎన్నికలలో ఐఎన్‌సీ ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ అవతార్ బాల్మీకిపై 10624 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4]

శకుంత్లా ఖటక్ 2024 ఎన్నికలలో కలనౌర్ నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రేణు దబ్లాపై 13125 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. శకుంత్లా ఖటక్‌కి 66469 ఓట్లు, రేణు డబ్లా 53344 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

మార్చు
  1. Hindustantimes (22 September 2019). "Haryana Assembly Polls: Shakuntla Khatak , Kalanaur (reserved) MLA". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  2. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  5. TimelineDaily (8 October 2024). "Kalanaur Election Result: Congress' Shakuntala Khatak Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.