శక్తీశ్వరస్వామి ఆలయం (యనమదుర్రు)

హిందూ దేవాలయం

శక్తీశ్వరస్వామి ఆలయం, ప్రాచీన శివాలయం. ఇది అత్యంత విలక్షణమైన శివలింగాన్ని కలిగియుంది. ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం లోని యనమదుర్రు గ్రామంలో,భీమవరానికి 5 కి.మీ దూరంలో నెలకొని ఉంది.[1]

శక్తీశ్వరస్వామి ఆలయం
శక్తీశ్వరస్వామి ఆలయం is located in ఆంధ్రప్రదేశ్
శక్తీశ్వరస్వామి ఆలయం
శక్తీశ్వరస్వామి ఆలయం
ఆంధ్రప్రదేశ్ లో ఉనికి
భౌగోళికాంశాలు :16°30′39″N 81°31′23″E / 16.51083°N 81.52306°E / 16.51083; 81.52306
పేరు
ప్రధాన పేరు :శక్తీశ్వరస్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారతదేశము
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:పశ్చిమ గోదావరి
ప్రదేశం:యనమదుర్రు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శక్తీశ్వరస్వామి (శివుడు)
ప్రధాన దేవత:పార్వతి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ.. 12 వ శతాబ్దం
సృష్టికర్త:తూర్పు చాళుక్యులు

చరిత్ర

మార్చు

శక్తీశ్వరస్వామి ఆలయాన్ని తూర్పుచాళుక్యుల కాలంలో నిర్మించారు. 12వ శతాబ్దిలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి, దండయాత్ర చేసిన కాలంలో పలు దేవాలయాలు, గ్రామాలపై దాడిచేశారు. ఆ క్రమంలోనే శక్తీశ్వరాలయంపై కూడా దాడిజరిగి, శిథిలాలయంగా మరుగునపడిపోయింది. తర్వాతికాలంలో శతాబ్దాల నాటికి పునర్నిర్మితమైంది.[2]

స్థలపురాణం

మార్చు

యమధర్మరాజు జీవులను కాలం తీరిపోగానే ప్రాణాలు తీసుకువెళ్ళేవాడిగా, పాపపుణ్యాలను బేరీజు వేసి శిక్షలు విధించేవాడిగా హిందూ మతంలో కనిపించే దేవుడు. అయితే జీవుల్లో చాలావరకూ ఈ యముడి పేరు వింటే హడిలిపోతూండడంతో ఆయనకు తాను చేసే పనిపైన విరక్తి కలిగిందనీ, తన పనికి, తనకీ గౌరవం కలిగించే కోర్కెతో శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడు ఒకానొక రాక్షసుడి ద్వారా యముడి పేరుమీదుగా ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు, హరుడు లయకారులన్న భయం కాకుండా ఆరోగ్యప్రదాతలన్న పేరువస్తుందని వరమిచ్చారు. ఆ ప్రకారమే ఈ ఆలయం వెలిసిందని, ఆలయంలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణం చెప్తోంది.[1]

ఆలయంలోని దేవతలు

మార్చు
  • శివలింగం: ఆలయంలో శివలింగానికి శక్తీశ్వరస్వామి అన్నది పేరు. శివుని రూపం శీర్షాసనం వేసి లింగతలంపై కనిపించడం ఇక్కడి విశిష్టతల్లో ప్రముఖమైనది.
  • పార్వతీ దేవి: శివలింగం పార్వతీదేవి విగ్రహం ఒకే పీఠంపై వెలసివుంది. బాల సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఒడిలో పెట్టుకున్నట్టు ఈ విగ్రహం నెలకొంది.
  • సుబ్రహ్మణ్యేశ్వర స్వామి: పార్వతీదేవి విగ్రహం ఒడిలో లాలిస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కనిపిస్తారు.

విశిష్టత

మార్చు

శివలింగతలంపై విలక్షణంగా శీర్షాసనంలో దర్శనమించ్చే శివుని రూపం ఆలయానికే విశిష్టతగా నిలుస్తోంది.[2] శక్తీశ్వరాలయంలో ఒకే పీఠంపై శివుడు, పార్వతి, కుమారస్వామి కొలువై ఉండడం మరో ప్రత్యేకత. అమ్మవారు మాతృమూర్తిగా బాల సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఒడిలో చేర్చుకుని లాలిస్తూన్నట్టు కొలువై ఉండడమూ విశేషాంశమే. ఇలా ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు దీర్ఘరోగాలు తొలగిపోతాయని ప్రసిద్ధి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Sri Shakteeswara Swamy Temple Yanamadurru". manabhimavaram.info/. Archived from the original on 16 మే 2016. Retrieved 17 January 2016.
  2. 2.0 2.1 వల్లూరి, విజయ హనుమంతరావు (జనవరి 2015). వల్లూరి, విజయ హనుమంతరావు (ed.). "మన చరిత్రరచన". సుపథ సాంస్కృతిక ద్వైమాసిక పత్రిక. 15 (2). తాడేపల్లిగూడెం: శివానంద సుపథ ఫౌండేషన్: 11–20.

ఇతర లింకులు

మార్చు