శని గ్రహం
శని, సూర్యుడి నుండి ఆరవ గ్రహం. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత, శని అతి పెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకుని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం, భూమి వ్యాసార్థానికి తొమ్మిదిన్నర రెట్లు ఉంటుంది.[5][6] సగటు సాంద్రత భూమి సాంద్రతలో ఎనిమిదవ వంతు ఉంటుంది. కానీ, శని ఘనపరిమాణం చాలా ఎక్కువ కావడాన, దాని ద్రవ్యరాశి భూమికి 95 రెట్లు ఉంటుంది.[7][8][9] ఈ గ్రహానికి ఈ పేరు, హిందూ దేవుడు శని పేరిట వచ్చింది. దీన్ని ఇంగ్లీషులో శాటర్న్ అని అంటారు. ఇది రోమనుల వ్యవసాయ దేవత పేరిట వచ్చింది. శని గ్రహపు సంకేతం (♄), ఈ దేవత చేతిలో ఉండే కొడవలి పేరిట వచ్చింది.
Pictured in natural color approaching equinox, photographed by Cassini in July 2008. The dot in the bottom left corner is Titan. | |
కక్ష్యా లక్షణాలు[1] | |
---|---|
Epoch J2000.0 | |
అపహేళి: | 1,514.50 మిలియన్ కి.మీ. (10.1238 AU) |
పరిహేళి: | 1,352.55 మిలియన్ కి.మీ. (9.0412 AU) |
Semi-major axis: | 1,433.53 మిలియన్ కి.మీ. (9.5826 AU) |
అసమకేంద్రత (Eccentricity): | 0.0565 |
కక్ష్యా వ్యవధి: | |
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: | 378.09 రోజులు |
సగటు కక్ష్యా వేగం: | 9.68 km/s (6.01 mi/s) |
మీన్ ఎనామలీ: | 317.020°[3] |
వాలు: |
|
Longitude of ascending node: | 113.665° |
Argument of perihelion: | 339.392°[3] |
దీని ఉపగ్రహాలు: | గుర్తించినవి 83; చిన్నపాటి ఉపగ్రహ శకలాలు అనేకం.[1] |
శని గ్రహపు అంతర్భాగంలో ఇనుము, నికెల్, రాళ్ళతో కూడిన గర్భం (కోర్) కలిగి ఉంటుంది. ఈ గర్భాన్ని లోహ హైడ్రోజెన్ పరివేష్ఠించి ఉంటుంది. ఆ పైన ఒక ద్రవ హైడ్రోజెన్ పొర, దాని పైన ద్రవ హీలియమ్ పొర, ఇక ఆపైన వాయువులతో కూడిన బయటి పొర ఉంటాయి. లోహ హైడ్రోజన్ పొర లోని విద్యుత్ప్రవాహం కారణంగా శనికి అయస్కాంత క్షేత్రం ఏర్పడిందని భావిస్తున్నారు. ఇది భూ అయస్కాంత క్షేత్రం కంటే బలహీనంగా ఉంటుంది. కానీ, దాని భారీ పరిమాణం కారణంగా, దాని అయస్కాంత ఘూర్ణము (మ్యాగ్నెటిక్ మూమెంట్) భూమికి 580 రెట్లు ఉంటుంది. శని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ గురు గ్రహపు శక్తిలో పదో వంతు ఉంటుంది.[10]
శనిగ్రహ ఉపరితలంపై బలమైన గాలులు వీస్తూంటాయి. ఈ గాలుల వేగం 1,800 కి.మీ./గం వరకూ ఉంటుంది. ఇది గురుగ్రహంపై గాలుల వేగం కంటే ఎక్కువ. నెప్ట్యూన్ పై గాలుల వేగంతో సమానం.[11]
శనిగ్రహంపై ఒక రోజుకు 10 గంటల, 33 నిముషాల, 38 సెకండ్ల సమయం (+1 ని.52సె. -1ని.19సె) పడుతుందని 2019 జనవరిలో ఖగోళవేత్తలు లెక్కించారు.
ఈ గ్రహపు అత్యంత ప్రముఖమైన విశేషం, దాని చుట్టూ ఉండే వలయాల వ్యవస్థ. ఇది మంచు ముక్కల తోను, రాళ్ళ శిథిలాల తోనూ కూడుకుని ఉంటుంది. శని చుట్టూ 83 సహజ సిద్ధ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. [12] వీటిలో యాభై మూడింటికి అధికారికంగా పేర్లు పెట్టారు. వలయాల్లో ఉండే వందలాది చిన్నపాటి ఉపగ్రహాలను ఈ సంఖ్యలో లెక్కించలేదు. శని ఉపగ్రహాల్లోకెల్లా అత్యంత పెద్దదైన టైటాన్, సౌర వ్యవస్థలోని అత్యంత పెద్ద ఉపగ్రహాల్లో రెండవది. ఇది బుధ గ్రహం కంటే ద్రవ్యరాశిలో చిన్నదైనప్పటికీ, ఘన పరిమాణంలో పెద్దది. సౌర వ్యవస్థలో, గణనీయమైన స్థాయిలో వాతావరణం ఉన్న ఉపగ్రహం ఇదొక్కటే.[13]
బయటి లింకులు
మార్చు- Saturn overview by NASA's Science Mission Directorate
- Saturn fact sheet at the NASA Space Science Data Coordinated Archive
- Saturnian System terminology by the IAU Gazetteer of Planetary Nomenclature
- Cassini-Huygens legacy website Archived 2018-01-26 at the Wayback Machine by the Jet Propulsion Laboratory
- Saturn at SolarViews.com
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Solar System Dynamics – Planetary Satellite Discovery Circumstances". NASA. 15 November 2021. Retrieved 4 June 2022.
- ↑ Seligman, Courtney. "Rotation Period and Day Length". Archived from the original on 28 July 2011. Retrieved 13 August 2009.
- ↑ 3.0 3.1 3.2 3.3 Simon, J.L.; Bretagnon, P.; Chapront, J.; Chapront-Touzé, M.; Francou, G.; Laskar, J. (February 1994). "Numerical expressions for precession formulae and mean elements for the Moon and planets". Astronomy and Astrophysics. 282 (2): 663–683. Bibcode:1994A&A...282..663S.
- ↑ Souami, D.; Souchay, J. (July 2012). "The solar system's invariable plane". Astronomy & Astrophysics. 543: 11. Bibcode:2012A&A...543A.133S. doi:10.1051/0004-6361/201219011. A133.
- ↑ Brainerd, Jerome James (24 November 2004). "Characteristics of Saturn". The Astrophysics Spectator. Archived from the original on 1 October 2011. Retrieved 5 July 2010.
- ↑ "General Information About Saturn". Scienceray. 28 July 2011. Archived from the original on 7 October 2011. Retrieved 17 August 2011.
- ↑ Brainerd, Jerome James (6 October 2004). "Solar System Planets Compared to Earth". The Astrophysics Spectator. Retrieved 5 July 2010.
- ↑ Dunbar, Brian (29 November 2007). "NASA – Saturn". NASA. Archived from the original on 29 సెప్టెంబరు 2011. Retrieved 21 July 2011.
- ↑ Cain, Fraser (3 July 2008). "Mass of Saturn". Universe Today. Retrieved 17 August 2011.
- ↑ Russell, C. T.; et al. (1997). "Saturn: Magnetic Field and Magnetosphere". Science. 207 (4429): 407. Bibcode:1980Sci...207..407S. doi:10.1126/science.207.4429.407. Archived from the original on 5 October 2011. Retrieved 29 April 2007.
- ↑ "The Planets ('Giants')". Science Channel. 8 June 2004.
- ↑ Ashton, Edward; Gladman, Brett; Beaudoin, Matthew; Alexandersen, Mike; Petit, Jean-Marc (May 2022). "Discovery of the Closest Saturnian Irregular Moon, S/2019 S 1, and Implications for the Direct/Retrograde Satellite Ratio". The Astronomical Journal. 3 (5): 5. Bibcode:2022PSJ.....3..107A. doi:10.3847/PSJ/ac64a2. S2CID 248771843. 107.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link) - ↑ Munsell, Kirk. "The Story of Saturn". NASA Jet Propulsion Laboratory; California Institute of Technology. Archived from the original on 16 ఆగస్టు 2008. Retrieved 7 July 2007.