శబరి ఎక్స్‌ప్రెస్

'శబరి ఎక్స్‌ప్రెస్', భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతున్న రోజువారీ (డైలీ) ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు, తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్, కేరళ రాష్ట్ర రాజధాని నగరం తిరువంతపురం సెంట్రల్ నగరాలను కలుపుతుంది. రైలు 30 గంటల, 25 నిమిషాల్లో 1568 కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. గతంలో రైలు సంఖ్యలు 7230/7229 తో హైదరాబాద్, ఎర్నాకుళం (కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ కోడ్: CHTS) మధ్య ప్రయాణించడానికి రైలును ఉపయోగించారు. రైలును 2005 మార్చి 27 నుండి త్రివేండ్రం సెంట్రల్ వరకు పొడిగించారు.[1]

'శబరి ఎక్స్‌ప్రెస్' / త్రివేండ్రం - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
Sabari Express /Trivandrum -Hyderabad Express
శబరి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంమెయిల్/ఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుత్రివేండ్రం సెంట్రల్
ఆగే స్టేషనులు41
గమ్యంహైదరాబాద్
ప్రయాణ దూరం1,568 కి.మీ. (974 మై.)
సగటు ప్రయాణ సమయం30 గం. 25 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)17229 / 17230
సదుపాయాలు
శ్రేణులుమొదటి ఎసి, 2 టైర్ ఎసి, 3 టైర్ ఎసి, స్లీపర్ క్లాస్, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఅవును
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
సాంకేతికత
రోలింగ్ స్టాక్7
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం80 కి.మీ./గం., 70 కి.మీ./గం విరామాలు కలుపుకొని
శబరి ఎక్స్‌ప్రెస్ ( హైదరాబాద్ - త్రివేండ్రం) రైలు మార్గము పటం

రైలు పేరు విశేషం

మార్చు

రైలుకు ప్రసిద్ధ హిందూ మత పుణ్యక్షేత్రం శబరిమల పేరు పెట్టారు.

ఉపయోగించు ఇంజను

మార్చు

ఇది కృష్ణరాజపురం డిపోనకు చెందిన కెజీం డబ్ల్యుడిపి4/4బి ద్వారా హైదరాబాద్ నుండి గుంటూరు జంక్షన్ వరకు లాగబడుచూ ఉంది. అలాగే గుంటూరు జంక్షన్ నుండి షోరనూర్ జంక్షన్ వరకు ఈరోడ్/రోయపురం డిపోనకు చెందిన ఈడి/ఆర్‌పిఎం డబ్ల్యుడఎపి4 ద్వారా లాగబడుచూ ఉంది. అదేవిధంగా, ఈరోడ్/రోయపురం డిపోనకు చెందిన ఈడి/ఆర్‌పిఎం డబ్ల్యుడఎపి4 ద్వారా షోరనూర్ జంక్షన్ నుండి త్రివేండ్రం సెంట్రల్ వరకు లాగబడుచూ ఉంది.

సమయములు

మార్చు

రైలు నంబరు: 17229 → 07:15 గంటల వద్ద త్రివేండ్రం సెంట్రల్ నుండి మొదలవుతుంది [2], 13:40 గంటలకు తదుపరి రోజు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు: 17230 → 11:25 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 18:20 గంటలకు తదుపరి రోజు త్రివేండ్రం చేరుకుంటుంది.[3]

తాత్కాలిక సేవలు

మార్చు

తాత్కాలికంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్ 3 వ డిసెంబరు, 2015 నుండి 2 వ జనవరి, 2016 వరకు కూడా అదనంగా ఉంటుంది.[4]

రేక్ షేరింగ్

మార్చు

ఈ రైలుకు నంబరు: 17255/17256 నరసాపురం - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బండితో రేక్ షేరింగ్ ఉంది.

రైలు పెట్టెల వివరములు

మార్చు

17230 శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో బోగీల విభజన ఈ విధంగా ఉంటుంది:

  • 0→ఎస్‌ఎల్‌ఆర్ - 1→యుఆర్ - 2→యుఆర్ - 3→ఎ1 - 4→బి2 - 5→బి1 - 6→ఎస్13 - 7→ఎస్12 - 8→ఎస్11 - 9→ఎస్10 - 10→ఎస్9 - 11→ఎస్8 - 12→పిసి - 13→ఎస్7 - 14→ఎస్6 - 15→ఎస్5 - 16→ఎస్4 - 17→ఎస్3 - 18→ఎస్2 - 19→ఎస్1 - 20→యుఆర్ - 21→ఎస్‌ఎల్‌ఆర్ - ఎస్‌ఆర్‌ఆర్

ముఖ్యమైన విరామాలు

మార్చు

ఈ రైలు మొత్తం 39 రైల్వే స్టేషన్లు చోట్ల ఆగుతుంది.

  • త్రివేండ్రం సెంట్రల్
  • వర్కాల శివగిరి
  • త్కొల్లాం జంక్షన్
  • కరునాగపళ్ళి
  • కాయంకుళం జంక్షన్
  • మవేలికర
  • చెంగన్నూర్
  • తిరువల్ల
  • చంగనస్సేరి
  • కొట్టాయం
  • ఎర్నాకుళం టౌన్
  • అలూవా
  • త్రిస్సూర్
  • షోరనూర్ జంక్షన్
  • పాలక్కాడ్ జంక్షన్
  • కోయంబత్తూర్ జంక్షన్
  • తిరుప్పూర్
  • ఈరోడ్ జంక్షన్
  • సేలం జంక్షన్
  • జోలార్‌పేట జంక్షన్
  • మొరప్పూర్
  • కాట్పాడి జంక్షన్
  • చిత్తూరు
  • తిరుపతి
  • రేణిగుంట జంక్షన్
  • గూడూరు జంక్షన్
  • నెల్లూరు
  • ఒంగోలు
  • తెనాలి జంక్షన్
  • గుంటూరు
  • సత్తెనపల్లి
  • నల్గొండ
  • సికింద్రాబాద్
  • హైదరాబాద్

ఇవి కూడా చూడండి

మార్చు
 
శబరి ఎక్స్‌ప్రెస్

చిత్రమాలిక

మార్చు
 
వాదకంచేరి వద్ద శబరి ఎక్స్‌ప్రెస్

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-20. Retrieved 2015-11-20.
  2. http://etrain.info/in?TRAIN=17229
  3. http://etrain.info/in?TRAIN=17230
  4. http://indiarailinfo.com/train/map/route-sabari-express-17230-hyb-to-tvc/1415/834/59