శశిరేఖా పరిణయం (ధారావాహిక)

శశిరేఖా పరిణయం, 2013 మార్చిలో స్టార్ మాలో ప్రారంభమైన తెలుగు సీనియల్. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఈ సీరియల్ 2016, డిసెంబరు 17న ముగిసింది. ఇందులో మేఘనా లోకేశ్, ప్రతాప్ ముఖ్య పాత్రల్లో నటించారు.[2][3][4] శశిరేఖ, అభిమన్యుల ప్రేమ నేపథ్యంలో రూపొందిన సీరియల్ ఇది.

శశిరేఖా పరిణయం
జానర్కుటుంబ నేపథ్యం
రచయితదినేష్ గౌడ్ కాకెర్ల
దర్శకత్వంరషీద్ పెద్ద
తారాగణంప్రతాప్, మేఘన లోకేష్
Opening themeశశిరేఖా పరిణయం
సంగీతంమాలిక్ ఎంవికె
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య790
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్సాయిబాబు
ఛాయాగ్రహణంరాంబాబు, రామకృష్ణ
ఎడిటర్సురేష్ కాసుకుర్తి
నిడివి21 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఅన్నపూర్ణ పిక్చర్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా [1]
చిత్రం ఫార్మాట్576ఐ, 1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదలమార్చి 2013 (2013-03) –
17 డిసెంబరు 2016 (2016-12-17)

కథా నేపథ్యం

మార్చు

శశి (మేఘనా లోకేష్), జాను స్నేహితులు. అభి తన డ్రీమ్ గర్ల్ ను ప్రేమిస్తుంటాడు. జాను అభిని వివాహం చేసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించినా అవన్ని విఫలమవుతాయి. చివరికి, జానుకు ప్రమాదం జరిగి, ఆమె ముఖం మారుతంది. దాంతో అభి కుటుంబంలోని అమ్మాయిగా ప్రవేశిస్తుంది. వారి నిశ్చితార్థం రోజున శశి సోదరి జాను గురించి నిజం చెప్పడంతో నిశ్చితార్థం ఆగిపోతుంది.

ఈ సంఘటన తరువాత అభి, శశి వివాహానికి శశి తండ్రి తప్ప అందరూ అంగీకరిస్తారు. అభి, శశిల వివాహం జరిగినప్పుడు తన సోదరి భర్త చనిపోతారనే మాంత్రికుడు చెప్పిన మాటలకు అందరూ భయపడుతుంటారు. తరువాత అతను కూడా అంగీకరిస్తాడు. కాని మాంత్రికుడి మాటలు నిజమవుతాయి. చాలా అపార్థాల కారణంగా అభి, శశి విడాకులకు అప్లై చేస్తారు. అయితే, ఆమె అభి డ్రీమ్ గర్ల్ అని గ్రహించి, మళ్ళీ అతనితో ప్రేమలో పడుతుంది. అభి శశిని తన భార్యగా అంగీకరిస్తాడు, అయినప్పటికీ, అభి స్నేహితురాలు అలేఖ్య వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. శశిని విడాకులు తీసుకొని ఆమెను వివాహం చేసుకోవాలని బలవంతం చేసే ప్రణాళికలో భాగంగా ఆమె అభిని అత్యాచారం కేసులో ఇరికిస్తుంది. అభిన జైలు నుండి శశి రక్షించగా, వారు కలిసి పోలీసుల నుండి పారిపోతారు. శశి తప్పిపోయిన యువరాణి దేవయాని అని వారు కనుగొంటారు. కుట్రపూరితమైన బంధువులకు రాజ్యం పడకుండా ఉండటానికి దేవయాని మారువేషంలో శశిలా నటించిందని అంతా అంగీకరిస్తారు. మిగిలిన కథలో శశి, అభి కలిసి దేవయనికి ఏమి జరిగిందో తెలుసుకుని ఆమెను తన ప్రేమికుడితో కలుపుతారు.

మూలాలు

మార్చు
  1. "Sashirekha Parinayam reaches a milestone". The Times of India. 20 డిసెంబరు 2014. Archived from the original on 23 జూలై 2018. Retrieved 20 జూన్ 2019.
  2. Singh, T. Lalith (7 September 2014). "Tube Watch: Annapurna Studios dishes out a gripping tale". Archived from the original on 23 July 2018. Retrieved 23 July 2018 – via www.thehindu.com.
  3. "I have embraced my new identity, says Meghana Lokesh - Times of India". indiatimes.com. Archived from the original on 18 December 2016. Retrieved 23 July 2018.
  4. "Guess who is the Sardar on the sets of Sasirekha Parinayam - Times of India". indiatimes.com. Archived from the original on 18 March 2016. Retrieved 23 July 2018.

బయటి లింకులు

మార్చు