శాంతి సాగర
శాంతి సాగర ఆసియాలో నిర్మించిన రెండవ అతిపెద్ద సరస్సుగా ప్రసిద్ధి చెందింది. దీనిని సులేకెరె అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో గల దావణగెరె జిల్లాలోని చిన్నగిరి తాలూకాలోని సులేకెరె అనే ప్రాంతంలో ఉంది.[1]
శాంతి సాగర | |
---|---|
ప్రదేశం | చెన్నగిరి, దావణగెరె జిల్లా, కర్ణాటక |
అక్షాంశ,రేఖాంశాలు | 14°7′48″N 75°54′17″E / 14.13000°N 75.90472°E |
రకం | సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | హరిదా నది |
వెలుపలికి ప్రవాహం | సిద్ధా కెనాల్, బసవ కెనాల్ |
పరీవాహక విస్తీర్ణం | 329.75 కి.మీ2 (127.32 చ. మై.) |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 8.1 కి.మీ. (5.0 మై.) |
గరిష్ట వెడల్పు | 4.6 కి.మీ. (2.9 మై.) |
ఉపరితల వైశాల్యం | 2,651 హె. (27 కి.మీ2) |
సరాసరి లోతు | 10 అ. (3 మీ.) |
గరిష్ట లోతు | 27 అ. (8 మీ.) |
ఉపరితల ఎత్తు | 612 మీ. (2,008 అ.) |
పేరు - అర్థం
మార్చు"సులే" అంటే వేశ్య, "కేరే" అంటే ట్యాంక్ అని అర్థం. చరిత్ర ప్రకారం ఒక వేశ్యచే ఈ సరస్సు నిర్మించబడింది కాబట్టి ఈ సరస్సును సులేకెరె అని పిలుస్తారు. ఈ సరస్సును నిర్మించిన శాంతవ అనే యువరాణి మొదటి పేరు "శాంతి", "సాగర" అంటే మహాసముద్రం, ఆ విధంగా దీనిని శాంతి సాగర అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు ఆసియాలో అతిపెద్ద సరస్సులలో ఒకటి కాబట్టి సముద్రంతో పోల్చారు.[2][3]
చరిత్ర
మార్చుసరస్సు నిర్మాణం 11 లేదా 12 వ శతాబ్దానికి చెందినదని ఆధారాలు సూచించబడ్డాయి. విక్రమ రాయలు అనే రాజుకు సంతానం లేకపోవడంతో బిల్లహల్లి గౌడ కుమారుడిని దత్తత తీసుకున్నాడు. ఈ పిల్లవాడికి రాగి రాయ అనే పేరును పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు శివుడి పట్ల భక్తికి ప్రతిఫలంగా రాజుకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెను శాంతవ అని పిలిచేవారు. రాజు కుమార్తె, కొంత దైవత్వంతో సంబంధాన్ని ఏర్పరచుకుని, ఒక వేశ్యగా మారుతుంది. తండ్రి శాపంతో మనస్థాపానికి గురైన కూతురు తనను శపించిన తన తండ్రి పట్టణాన్ని నాశనం చేయాలని ఆమె ఈ సరస్సును నిర్మించింది. అందుకే దీనికి "సులేకెరె" అని పిలుస్తారు.[4][5]
విస్తీర్ణం
మార్చు1128 లో నిర్మించిన శాంతి సాగరకు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. దీని నిర్మాణానికి మూడు సంవత్సరాలు పట్టింది. 6,550 ఎకరాల (2,651 హెక్టార్లు) నీటి వ్యాప్తిని కలిగి ఉన్న ఈ సరస్సు చుట్టుకొలత 30 కిమీ (19 మైళ్లు). ఇది మొత్తం 81,483 ఎకరాల (32,975 హెక్టార్ల) విస్తీర్ణంను కలిగి ఉంది. ఇది 4,700 ఎకరాల (1,900 హెక్టార్ల) సాగు భూమికి నీరందిస్తుంది. 170 కంటే ఎక్కువ గ్రామాలు ఈ సరస్సు పై ఆధారపడి ఉన్నాయి.[6][7]
త్రాగునీరు
మార్చుశాంతి సాగర నుండి చిత్రదుర్గకు తాగునీరు సరఫరా చేయబడుతుంది. కర్ణాటక అర్బన్ వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ బోర్డ్ (KUWS & DB) ఈ ప్రాజెక్టుకు ₹ 80 కోట్లు నిధులు సమకూర్చింది. ప్రస్తుతం చిత్రదుర్గ నగరానికి శాంతి సాగర నీటి సరఫరా వ్యవస్థ ద్వారా రోజుకు 30 మిలియన్ లీటర్ల నీరు అందుతోంది. భవిష్యత్తులో ఈ సరస్సు పూర్తిగా ఎండిపోతుందనే భయాలు ఉన్నాయి.[8]
మూలాలు
మార్చు- ↑ Chandran, Rahul (5 November 2016). "Of legends and lakes built by courtesans". mint (in ఇంగ్లీష్). Retrieved 7 January 2021.
- ↑ A lake with a history of 800 years... The Hindu - Online edition of India's National Newspaper
- ↑ Mysore: a gazetteer compiled for government, Vol 2 Page No. 482 Google Books Online
- ↑ "MV1aSAEZsc6IFMbf6SbvBO". "www.livemint.com". 3 April 2018. Retrieved 30 May 2018.
- ↑ Mysore: a gazetteer compiled for government, Vol 2 Page No. 481 Google Books Online
- ↑ Sulekere in Davangere district has the distinction of being Asia’s second largest tank. The Hindu - Online edition of India's National Newspaper
- ↑ Mysore: a gazetteer compiled for government, Vol 2 Page No. 482 Google Books Online
- ↑ Shanthi Sagara water for Chitradurga The Hindu - Online edition of India's National Newspaper