శాంత కళావిటిగోడ

శ్రీలంక మాజీ క్రికెటర్

శాంత కళావిటిగోడ, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 2004, ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[2] కుడిచేతి వాటం ఓపెనర్ గా బ్యాటింగ్ చేశాడు.

శాంత కళావిటిగోడ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇంటిక శాంత కుమార కళావిటిగోడ
పుట్టిన తేదీ23 December 1977 (1977-12-23) (age 46)
కొలంబో, శ్రీలంక
ఎత్తు5 అ. 6 అం. (168 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 101)2006 11 April - New Zealand తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 1 125
చేసిన పరుగులు 8 6,180
బ్యాటింగు సగటు 4.00 32.18
100లు/50లు 0/0 12/28
అత్యధిక స్కోరు 7 169
వేసిన బంతులు 84
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 110/–
మూలం: Cricinfo, 2023 24 May

శాంత కళావిటిగోడ 1977, డిసెంబరు 23న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. కొలంబోలోని నలంద కళాశాలలో విద్యాభ్యాసం చేశాడు.[3]

క్రికెట్ రంగం

మార్చు

2005లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కళావిటిగోడ రెండు సీజన్‌లలో ఎనిమిది సెంచరీలు సాధించాడు. 2003-04లో అతను ప్రీమియర్ లీగ్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. 2004-05లో కొలంబో కోల్ట్స్, నార్త్ వెస్ట్ ప్రావిన్స్ తరపున దాదాపు 800 పరుగులు చేశాడు. 2005 మార్చిలో ఇంగ్లాండ్ ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను శ్రీలంక ఎ జట్టుకు ఎంపికయ్యాడు. రెండో టెస్టులో ఎన్సీసీలో 177 బంతుల్లో 83 పరుగులు చేశాడు.

1994లో మలేషియాలో జరిగిన ప్రపంచకప్‌లో శ్రీలంక అండర్-17 జట్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి ఆడాడు. తన మొదటి క్లబ్ అయిన ఎస్ఎస్సీ కోసం అండర్-23 మ్యాచ్‌లో మహేల జయవర్ధనేతో కలిసి 380 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.

మూలాలు

మార్చు
  1. "Shantha Kalavitigoda Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.
  2. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-29.
  3. "Shantha Kalavitigoda Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-29.