శాకుంతలం అభిజ్ఞానత

విశ్వనాథ సత్యనారాయణ రచన చేసిన సాహిత్య విమర్శ రచన శాకుంతలం అభిజ్ఞానత. కవికులగురువుగా పేరొందిన సంస్కృత నాటకకర్త కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలమనే నాటకానికి సంబంధించిన విమర్శ/వ్యాఖ్య.

రచన నేపథ్యం మార్చు

విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ విమర్శన రచనాకాలము 1958-59. ఈ గ్రంథం ప్రథమ ముద్రణ 1961లో పొందింది.[1] శాకుంతలము యొక్క అభిజ్ఞానత రెండవ ముద్రణ 1970లో, మూడవ ముద్రణ 2007లోనూ పొందింది. ఆయన విమర్శ రచనలేవీ కూర్చొని వ్రాసినవి కాదు, సాహిత్య వేదికలపై ప్రసంగిస్తూండగా ఎవరో ప్రసంగపాఠాన్ని వ్రాసుకుంటే దానిని పుస్తకానికి అనువుగా విశ్వనాథ వారు కొంత సంస్కరించి ప్రచురించినవి. ఈ గ్రంథమూ ఆ కోవలోనిదే.

రచన అంశం మార్చు

సంస్కృత భాషలో అత్యంత సుప్రసిద్ధమైన రచనల్లో అభిజ్ఞాన శాకుంతలము ముఖ్యమైనది. మహాకవి, కవికులగురువు కాళిదాసు ఈ నాటకాన్ని రచించారు. కాళిదాసు రచించిన సుప్రసిద్ధ నాటకత్రయంలో ఇది తలమానికమైనదే కాక ఆయన మొత్తం రచనల్లోకెల్లా ప్రాచుర్యం, ప్రాధాన్యత పొందిన రచన ఇది. ఈ నేపథ్యంలో ఎందఱో వేత్తలైన రసద్రష్టలు, అలంకారికులు ఆ నాటకంలోని నిగూఢమైన విశేషాలు వివరిస్తూ వ్యాఖ్యలు చేశారు. శాకుంతలము యొక్క అభిజ్ఞానత అనే ఈ రచన కూడా ఆ సంప్రదాయంలోనిదే. శాకుంతలములో విదూషకుని పాత్రకల్పన, నిర్వహణలోని ఆంతర్యము వివరించి ఆ దృష్టితో నాటకం చదివితే మొత్తమ వినూత్నమైన విధంగా కనిపిస్తుందని కొన్ని నూత్న ప్రతిపాదనలు చేశారు.

ప్రాచుర్యం మార్చు

శాకుంతలము యొక్క అభిజ్ఞానత మూడు ముద్రణలు పొందింది. దీనిని ఆధారం చేసుకుని పలువురు సాహిత్యవేత్తలు అభిజ్ఞాన శాకుంతలం గురించి మరిన్ని లోతైన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు.[2][3][4]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. విశ్వనాథ, పావని శాస్త్రి (2007). శాకుంతలము యొక్క అభిజ్ఞానత (ఒక్కమాట) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్. p. i.
  2. అబ్బరాజు, మైథిలి. "సహృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1]". vaakili.com/patrika. Archived from the original on 16 మార్చి 2016. Retrieved 26 October 2014.
  3. అబ్బరాజు, మైథిలి. "సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ-రెండవ భాగం". వాకిలి. Retrieved 26 October 2014.
  4. అబ్బరాజు, మైథిలి. "సహృదయ ప్రమాణం, సంస్మరణీయశోభ-మూడవ భాగం". వాకిలి. Retrieved 26 October 2014.

బయటి లింకులు మార్చు