శాన్ ఫ్రాన్సిస్కో (1936 సినిమా)

శాన్ ఫ్రాన్సిస్కో 1936, జూన్ 26న విడుదలైన అమెరికా చలనచిత్రం. వుడీ వాన్ డైక్ దర్శకత్వంలో 1906, ఏప్రిల్ 18న శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వచ్చిన భూకంపం ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం, ప్రపంచ సినీచరిత్రలో అతిగొప్ప క్లైమాక్స్ గల సినిమాగా పేరొందింది.[3] ఈ చిత్రంలో క్లార్క్ గేబుల్, జీనెట్టే మెక్‌డొనాల్డ్, స్పెన్సర్ ట్రేసీ నటించారు. ఇది 1936లో అత్యధిక వసూళ్ళు చేసిన చిత్రంగా నిలిచింది.[4]

శాన్ ఫ్రాన్సిస్కో
శాన్ ఫ్రాన్సిస్కో సినిమా పోస్టర్
దర్శకత్వంవుడీ వాన్ డైక్, డి.డబ్ల్యూ. గ్రిఫిత్ (టైటిల్స్ లో పేరు లేదు)
రచనరాబర్ట్ ఈ. హాప్కిన్స్, అనితా లూస్
నిర్మాతజాన్ ఎమెర్సన్, బెర్నార్డ్ హెచ్. హైమన్
తారాగణంక్లార్క్ గేబుల్, జీనెట్టే మెక్‌డొనాల్డ్, స్పెన్సర్ ట్రేసీ
ఛాయాగ్రహణంఒలివర్ టి. మార్ష్
కూర్పుటామ్ హెల్డ్
సంగీతంవాల్టర్ జుర్మన్, బ్రోనిస్లా కపూర్, ఎడ్వర్డ్ వార్డ్
నిర్మాణ
సంస్థ
మెట్రో-గోల్డ్విన్-మేయర్
పంపిణీదార్లుమెట్రో-గోల్డ్విన్-మేయర్
విడుదల తేదీ
1936 జూన్ 26 (1936-06-26)
సినిమా నిడివి
115 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$1,300,000[1][2]
బాక్సాఫీసు$2,868,000 (దేశీయ వసూళ్ళు)[1]
$2,405,000 (విదేశీయ వసూళ్ళు)[1]

కథ మార్చు

చిత్ర కథ 1905, డిసెంబర్ 31 రాత్రి ప్రారంభం అవుతుంది. నార్టన్ చెందిన పారడైజ్ అనే గాంబ్లింగ్ హౌస్ లో మేరీ బ్లెక్ అనే అమ్మాయి గాయనిగా పనిచేస్తుంది. నార్టన్ కు రాజకీయ శత్రువైన జాక్ బర్లీకి మేరి గానం నచ్చి తన కంపెనీలోకి తీసుకుంటాడు. కానీ, కొంతకాలం తరువాత మళ్ళీ నార్టన్ దగ్గరికి వచ్చేస్తుంది. నార్టన్ తనకోసం ముల్లర్ తో గొడవ పడడం చూసి, బర్లీ కంపెనీకి వస్తుంది. బర్లీ తన పలుకుబడితో నార్టన్ కంపెనీ మూతపడే స్థితికి తీసుకొస్తాడు. అప్పుడు మేరి కాబరే పోటీలో పాల్గొని, పదివేల డాలర్లు తెచ్చి నార్టన్ కు ఇస్తుంది. బర్లీని మేరి వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిన నార్టన్ ఆ డబ్బును తీసుకోడు. అదే సమయంలో (1906, ఏప్రిల్ 18న) భూకంపం వస్తుంది. ఆ భూకంపంలో బర్లీ చనిపోగా, నార్టన్ మేరీలు కలుసుకుంటారు.

నటవర్గం మార్చు

  • క్లార్క్ గేబుల్
  • జీనెట్టే మెక్‌డొనాల్డ్
  • స్పెన్సర్ ట్రేసీ
  • జాక్ హాల్ట్
  • జెస్సీ రాల్ఫ్
  • టెడ్ హేలీ
  • షిర్లీ రోస్
  • మార్గరెట్ ఇర్వింగ్
  • హెరోల్డ్ హుబెర్
  • ఎడ్గార్ కెన్నెడీ
  • అల్ షీన్
  • విలియం రికియార్డీ
  • కెన్నెత్ హర్లన్
  • రోజర్ ఇమ్హోఫ్
  • చార్లెస్ జుడెల్స్
  • రస్సెల్ సింప్సన్
  • బెర్ట్ రోచ్
  • వారెన్ బి. హైమర్
  • ఫ్రాంక్ మాయో
  • కార్ల్ స్టాక్డేల్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: వుడీ వాన్ డైక్, డి.డబ్ల్యూ. గ్రిఫిత్ (టైటిల్స్ లో పేరు లేదు)
  • నిర్మాత: జాన్ ఎమెర్సన్, బెర్నార్డ్ హెచ్. హైమన్
  • రచన: రాబర్ట్ ఈ. హాప్కిన్స్, అనితా లూస్
  • సంగీతం: వాల్టర్ జుర్మన్, బ్రోనిస్లా కపూర్, ఎడ్వర్డ్ వార్డ్
  • ఛాయాగ్రహణం: ఒలివర్ టి. మార్ష్
  • కూర్పు: టామ్ హెల్డ్
  • నిర్మాణ సంస్థ, పంపిణీదారు: మెట్రో-గోల్డ్విన్-మేయర్

చిత్ర విశేషాలు మార్చు

ఈ చిత్రంలో 1906, ఏప్రిల్ 18న శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వచ్చిన భూకంపంను చిత్ర క్లైమాక్స్ గా తీయబడింది. దాదాపు 20 నిముషాలపాటు ఉండే ఈ క్లైమాక్స్ చలనచిత్రరంగంలో గొప్ప క్లైమాక్స్ గా విమర్శకులచే గుర్తించబడింది. భూకంపం వల్ల నగరంలోని భవనాలు కూలిపోవడం, భూమి రెండుగా చీలడం వంటి దృశ్యాలు నిజ భూకంపాన్ని తలపిస్తాయి.[5]

అవార్డులు మార్చు

ఈ చిత్రానికి శబ్ధగ్రహణం అందించిన డౌగ్లస్ షియరర్ ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. మరో ఐదు విభాగాల్లో నామినేట్ చేయబడింది.[6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Turk 2000, p. 184
  2. The Eddie Mannix Ledger, Los Angeles: Margaret Herrick Library, Center for Motion Picture Study.
  3. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 35.
  4. Reid, John (2004). Award-Winning Films of the 1930s. Lulu.com. p. 129. ISBN 1-4116-1432-1.
  5. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 34.
  6. "The 9th Academy Awards (1937) Nominees and Winners". oscars.org. Retrieved 19 February 2019.

ఇతర లంకెలు మార్చు

ఆధార గ్రంథాలు మార్చు