శారదా రాథోడ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బల్లబ్‌గఢ్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

శారదా రాథోడ్

పదవీ కాలం
2005 – 2014
ముందు రాజిందర్ సింగ్ బిస్లా
తరువాత మూల్ చంద్ శర్మ
నియోజకవర్గం బల్లబ్‌గఢ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

శారదా రాథోడ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 శాసనసభ ఎన్నికలలో బల్లబ్‌గఢ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి మూల్ చంద్ శర్మపై 34,076 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురేందర్ తెవాటియాపై 23,844 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హుడా ప్రభుత్వంలో ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేసింది. ఆమెకు 2014, 2019 ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్ లభినచ్చకపోవడంతో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది.[1]

శారదా రాథోడ్ 2022 మే 23న కాంగ్రెస్‌లో చేరింది.[2] ఆమెకు 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో[3] స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మూల్ చంద్ శర్మ చేతిలో 17730 ఓట్ల ఓడిపోయింది.[4]

మూలాలు

మార్చు
  1. Navbharat Times (29 August 2019). "बल्लभगढ़ से कांग्रेस की पूर्व विधायक शारदा राठौर बीजेपी में हुईं शामिल". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  2. Jagran (23 May 2022). "शारदा राठौर के कांग्रेस में शामिल होने से बदले राजनीतिक समीकरण - Political equation changed with Sharda Rathore joining Congress - Haryana Faridabad Politics News". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  3. The Tribune (12 September 2024). "Congress ignores top contenders, fields newcomers from Ballabhgarh, Tigaon" (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ballabgarh". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.