శిల్పి శర్మ

భారతీయ నటి

శిల్పి శర్మ, న్యూఢిల్లీలో జన్మించిన భారతీయ నటి, ఫ్యాషన్ డిజైనర్, మోడల్. ఆమె ప్రతిష్టాత్మక సైమా అవార్డులు 2015తో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో పనిచేస్తోంది.

శిల్పి శర్మ
జననంశిల్పి శర్మ
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తినటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్
క్రియాశీలక సంవత్సరాలు2001–ప్రస్తుతం

ఆమెను ఐహెచ్ఆర్సి భారతదేశం నుండి శాంతి, మానవత్వం కోసం యువ రాయబారిగా నియమించింది.[1][2]

ప్రారంభ జీవితం

మార్చు

శిల్పి శర్మ ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్ నుండి టెక్స్టైల్ డిజైన్/ఫాబ్రిక్స్ లో ప్రత్యేకత కలిగిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో పట్టభద్రురాలైంది. ఆమె ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి తన ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేసింది.[3] ఆమె ముంబైలోని జుహులోని నాదిరా బబ్బర్ ఆధ్వర్యంలో నటన వర్క్‌షాపులకు హాజరయ్యింది.[4]

కెరీర్

మార్చు

2006లో "మిస్ ఢిల్లీ టీన్ క్వీన్" అనే అందాల పోటీలో పాల్గొనడం ద్వారా శిల్పి శర్మ తన వృత్తిని ప్రారంభించింది. 2010లో, ఆమె "సిటాడెల్ మిస్ పూణే" పోటీలో పాల్గొంది. 2012లో, శర్మ "ఫెమినా మిస్ ఇండియా"-స్టేట్ పేజెంట్ లో పోటీపడి "మిస్ బాడీ బ్యూటిఫుల్", "మిస్ బ్యూటిఫుల్ స్మైల్" గెలుచుకుంది.[5][4][6] ఆ తరువాత, ఆమె ముంబై వెళ్లి మోడలింగ్ చేపట్టి పాంటలూన్స్, విక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్జి ఎలక్ట్రానిక్స్, సంభవ్ డైమండ్స్, ఉత్సవ్ సిజెడ్ గోల్డ్ జ్యువెలరీ మొదలైన కంపనీల ప్రింట్ ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలు చేసింది. ఆమె హైదరాబాదు ఫ్యాషన్ వీక్, జైపూర్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ మొదలైన వాటి కోసం ర్యాంప్లో నడిచింది.[4][7] ఆమె ఉమెన్స్ ఎరా, గృహశోభ, హెల్త్, న్యూ ఉమెన్ వంటి వివిధ పత్రికల ముఖచిత్రాలపై కనిపించింది.[8]

శిల్పి శర్మ నటన, మోడలింగ్ లతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ అడుగుపెట్టింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
2014 గ్రీన్ సిగ్నల్ దేవికా తెలుగు
2014 ఆక్రమణ కావేరి కన్నడ కన్నడలో అరంగేట్రం
2014 కరెంట్ తీగ[9][10] తెలుగు ప్రత్యేక పాత్ర
2017 త్రిశివపెరూర్ క్లిప్థం నీలినా మెహందీ మలయాళం మలయాళంలో అరంగేట్రం

టెలివిజన్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర భాష
2011–12 కహానీ చంద్రకాంత కి కాజల్ హిందీ

మ్యూజిక్ వీడియోలు

మార్చు
  • జోహన్ ఆంథోనీతో పయానా పొన్న (2016) [11][12]
  • ఆరివ్ గిల్ తో తు మిలేయా (2017) [13]

మూలాలు

మార్చు
  1. "Participants from 83 countries to attend first-ever 'World Youth Summit for Peace'". The News International. 17 November 2016.
  2. "Youth Ambassadors Club WYSP 2016". ihrchq.org. Archived from the original on 13 April 2016. Retrieved 15 January 2022.
  3. "Shilpi is a fashion management graduate". The Times of India. 19 July 2014.
  4. 4.0 4.1 4.2 "About Shilpi Sharma". Miss Shilpi Sharma Official Website. 11 July 2014. Archived from the original on 14 July 2014. Retrieved 11 July 2014.
  5. "Shilpi Sharma set to debut in Tollywood". The Times of India. 11 March 2014.
  6. "I want to be a 3D movie specialist". The New Indian Express. 9 July 2014. Archived from the original on 15 July 2014.
  7. "Neeru Kumar". Neeru Kumar Official Website. 23 July 2014.
  8. "Shilpi Sharma at Neeru Kumar Label Launch". RaagaLahari. 23 July 2014.
  9. "Shilpi Sharma to shake leg for Manoj Manchu". Retrieved 27 August 2014.
  10. "Shilpi Sharma to groove with Manchu Manoj – Current Theega". The Times of India. Retrieved 27 August 2014.
  11. Johan Anthony (10 September 2016). "Paiyana Ponna - Johan Anthony featuring. Ratheja & Shilpi Sharma [Official Music Video] 4K". Archived from the original on 14 జూన్ 2023. Retrieved 9 అక్టోబర్ 2024 – via YouTube. {{cite web}}: Check date values in: |access-date= (help)CS1 maint: bot: original URL status unknown (link)
  12. quintdaily (11 August 2017). "Thrissivaperoor Kliptham Movie Review and Rating (3.5/5) – QuintDaily".
  13. G-Series Media (12 December 2017). "Tu Mileya (Full Video Song) - Aariv Gill & Shilpi Sharma - Latest Punjabi Song 2017 - G Series Media". Archived from the original on 14 జూన్ 2023. Retrieved 9 అక్టోబర్ 2024 – via YouTube. {{cite web}}: Check date values in: |access-date= (help)CS1 maint: bot: original URL status unknown (link)