మలయాళ  సినిమా అనేది మలయాళ  భాషా చలన చిత్రాల భారతీయ చలనచిత్ర పరిశ్రమ. ఇది భారతదేశంలోని కేరళలో ఉంది. మలయాళ  చలనచిత్రాలు సినిమాటోగ్రఫీ, కథ నడిపించడంలో ప్రసిద్ధి చెందాయి. 1982లో ఎలిప్పథాయం లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సదర్లాండ్ ట్రోఫీని, 1982లో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మోస్ట్ ఒరిజినల్ ఇమాజినేటివ్ ఫిల్మ్‌ను గెలుచుకుంది. రాజీవ్ ఆంచల్ గురు (1997), సలీం అహమ్మద్ ఆదామింటే మకాన్ అబు (2011), లిజో జోస్ పెల్లిస్సేరీ జల్లికట్టు (2019).. మొదలైన చిత్రాలు అకాడమీ అవార్డ్స్‌కు ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారతదేశం అధికారిక ఎంట్రీలుగా పంపబడ్డాయి.

Vigathakumaran
మొదటి మలయాళ చలనచిత్రం విగతకుమారన్ నుండి ఒక సన్నివేశం
మలయాళ చిత్ర పరిశ్రమలో తొలి నటి పీకే రోజీ

చరిత్ర మార్చు

1947కి ముందు రెండు మూకీ తెరలు, మూడు మలయాళ భాషా చిత్రాలు మాత్రమే ఉండేవి.[1][2] ఆ తర్వాత 1950లలో సంవత్సరానికి 6, 1960లలో సంవత్సరానికి 30, 1970లలో సంవత్సరానికి 40, 1980లో 127 చిత్రాలు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి మద్దతు పొందాయి.[3]

మలయాళంలో నిర్మించిన మొదటి చిత్రం విగతకుమారన్. ఈ చిత్రం 1928లో నిర్మాణాన్ని ప్రారంభించి తిరువనంతపురంలోని క్యాపిటల్ థియేటర్లలో 1930 అక్టోబరు 23న విడుదలైంది. సినీ పరిశ్రమ గురించి ఏ మాత్రం అనుభవం లేకున్నా వ్యాపారవేత్త జె. సి. డానియల్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. దీంతో మలయాళ సినిమా పితామహుడిగా కీర్తి పొందాడు.

అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ మార్చు

ఎ.ఎమ్.ఎమ్.ఎ అనేది మలయాళ సినిమా కళాకారులచే ఏర్పడిన సంస్థ. పైరసీకి వ్యతిరేకంగా వ్యవహరించడం, సభ్యత్వం తీసుకున్న నటులు, నటీమణుల ప్రయోజనాలను కాపాడడం, సమస్యలను పరిష్కరించడానికి ఉమ్మడి వేదికగా పనిచేయడం దీని లక్ష్యం. దీని కార్యకలాపాలలో ఎండోమెంట్స్, ఇన్సూరెన్స్ స్కీమ్‌లు, రివిజన్‌పై వేతనాలు, ప్రయోజనాలపై కమిటీలు, పరిశోధన కోసం నిధులు, పెన్షన్లు, సభ్యుల పిల్లలకు విద్యా రుణాలు ఉన్నాయి. ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం నిధులను సేకరించేందుకు 2008లో ట్వంటీ:20తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది.[4]

కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, కేరళ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, కేరళ సినీ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్, హైపర్ లింక్ ఫిల్మ్ క్లబ్, కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు సమన్వయంతో పనిని నిలిపివేసాయి.[5]

దర్శకులు మార్చు

స్క్రీన్ ప్లే రచయితలు మార్చు

మూలాలు మార్చు

  1. Roy Armes (1987). Third World film making and the West. University of California Press. p. 121. ISBN 9780520908017. Retrieved 3 April 2013.
  2. AMMA. "malayalamcinema". malayalamcinema.com. Archived from the original on 26 May 2018. Retrieved 3 April 2013.
  3. Roy Armes (1987). Third World film making and the West. University of California Press. p. 121. ISBN 9780520908017. Retrieved 3 April 2013.
  4. The Hindu (June 2006), "AMMA office-bearers assume charge", The Hindu, Chennai, India, archived from the original on 2007-12-22, retrieved 25 December 2008
  5. "The Hindu Business Line : No show: Cinema bandh total in Kerala". thehindubusinessline.com.