శివాజీరావు దేశ్‌ముఖ్

శివాజీరావు బాపుసాహెబ్ దేశ్‌ముఖ్ (1 సెప్టెంబర్ 1935 - 14 జనవరి 2019) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1976 నుండి 1985లో వసంతసాద పాటిల్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఆ తరువాత మూడుసార్లు మహారాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా పని చేశాడు.[2]

శివాజీరావు దేశ్‌ముఖ్
శివాజీరావు దేశ్‌ముఖ్


పదవీ కాలం
2004 – 2015
తరువాత రామరాజే నాయక్ నింబాల్కర్


వ్యక్తిగత వివరాలు

జననం (1935-09-01)1935 సెప్టెంబరు 1
సాంగ్లీ
మరణం 2019 జనవరి 14(2019-01-14) (వయసు 83)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సరోజినీ బండల్
సంతానం సత్యజిత్ దేశ్‌ముఖ్ , శిల్పా దేశ్‌ముఖ్
నివాసం కోక్రుద్, షిరాలా, సాంగ్లీ

రాజకీయ జీవితం

మార్చు

శివాజీరావు దేశ్‌ముఖ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1978 నుండి 1990 వరకు షిరాల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 1976 నుండి 1985లో వసంతసాద పాటిల్ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశాడు.

శివాజీరావు దేశ్‌ముఖ్ అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ 2019 జనవరి 14న మరణించాడు. ఆయనకు భార్య సరోజినీ బండల్, పిల్లలు సత్యజిత్ దేశ్‌ముఖ్ , శిల్పా దేశ్‌ముఖ్ ఉన్నారు.[3][4][5]

మూలాలు

మార్చు
  1. My Mahanagar (4 February 2019). "शिवाजीराव देशमुख म्हणजे प्रचंड इच्छशक्ती असणारे व्यक्तिमत्व". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. Sakshi (8 May 2014). "మండలి చైర్మన్‌గా దేశ్‌ముఖ్". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  3. The Indian Express (14 January 2019). "Congress veteran Shivajirao Deshmukh dead" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. The Economic Times (14 January 2019). "Congress veteran Shivajirao Deshmukh passes away". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  5. The Times of India (15 January 2019). "Shivajirao Deshmukh passes away in Mumbai". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.