సత్యజిత్ దేశ్‌ముఖ్

సత్యజిత్ శివాజీరావు దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరాల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] సత్యజిత్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, మహారాష్ట్ర శాసనసమండలి స్పీకర్ దివంగత శివాజీరావ్ దేశ్‌ముఖ్ కుమారుడు.

సత్యజిత్ శివాజీరావు దేశ్‌ముఖ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు మాన్‌సింగ్ ఫత్తేసింగ్రావ్ నాయక్
నియోజకవర్గం షిరాల

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు శివాజీరావు దేశ్‌ముఖ్ , సరోజినీ
జీవిత భాగస్వామి రేణుకా దేశ్‌ముఖ్
సంతానం సాయితేజస్వి దేశ్‌ముఖ్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సత్యజిత్ దేశ్‌ముఖ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరాల శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి,[2] ఆ తరువాత సెప్టెంబర్ 2019లో కాంగ్రెస్‌ను వీడి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3][4] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షిరాల శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి మాన్‌సింగ్ ఫత్తేసింగ్రావ్ నాయక్‌పై 66,436 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 130738 ఓట్లతో విజేతగా నిలవగా, మాన్సింగ్ ఫత్తేసింగ్రావ్ నాయక్ కి 108049 ఓట్లు వచ్చాయి.[5][6]

మూలాలు

మార్చు
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The New Indian Express (11 September 2019). "Party general secretary Satyajit Deshmukh may quit Congress in Maharashtra" (in ఇంగ్లీష్). Retrieved 25 November 2024.
  3. Hindustantimes (15 September 2019). "BJP sees heir strikes; family clout, money work in favour". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. TV9 Marathi (15 September 2019). "सत्यजित देशमुख यांची काँग्रेसला सोडचिठ्ठी, मुख्यमंत्र्यांच्या उपस्थितीत भाजपात प्रवेश करणार". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Shirala". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  6. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.