శివాజీ జయంతి
శివ జయంతి లేదా శివాజీ జయంతి భారత దేశంలో మహారాష్ట్రలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19 న మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ జయంతి జరుపుకుంటారు.
శివాజీ జయంతి | |
---|---|
అధికారిక పేరు | శివాజి మహారాజ జయంతి |
యితర పేర్లు | శివ జయంతి , శివాజి జయంతి |
జరుపుకొనేవారు | మహారాష్ట్రలో హిందూ , బౌద్ధ , ముస్లిం |
రకం | సామాజిక |
ప్రారంభం | ఛత్రపతి శివాజి మహారాజ |
జరుపుకొనే రోజు | 19 ఫిబ్రవరి |
ఉత్సవాలు | 1 రోజు |
ఆవృత్తి | సంవత్సరం |
చరిత్ర
మార్చుశివాజీ జయంతి పూణేలో మహాత్మా జోతిబా ఫూలే వేడుకలు ప్రారంభించారు.అప్పటి నుండి, శివాజీ జయంతి వేడుకల స్థాయి గణనీయంగా పెరిగింది.20 వ శతాబ్దంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ జయంతికీ రెండుసార్లు అధ్యక్షుడిగా చేశారు.[1][2]
నిర్వహణ
మార్చుశివాజీ జయంతి రోజున మహారాష్ట్రలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సెలవు ప్రకటించారు. భారీగా ఉరేగింపులు జరుగుతాయి. ఇది మహారాష్ట్ర ప్రజలకు గౌరవ దినంగా భావిస్తారు. మహారాష్ట్ర కాకుండా, శివాజీ జయంతి గోవా, కర్ణాటకలో కూడా జరుపుకుంటారు.శివాజీ జయంతి రోజున శివాజీ జీవితాన్ని వివరించే నాటకాలు ప్రదర్శిస్తారు.[3]
ఉద్దేశ్యం
మార్చుశివాజీ మహారాజ్ ఆలోచనలను సమాజంలోని ప్రతి ఒక్కరికీ వ్యాప్తి చేయడానికి శివాజీ జయంతిని జరుపుతున్నారు.
మూలాలు
మార్చు- ↑ Pagadi, Shivaji 1983, p. 98 : "It was a bid for Hindawi Swarajya (Indian rule), a term in use in Marathi sources of history."
- ↑ Smith, Wilfred C. (1981), On Understanding Islam: Selected Studies, Walter de Gruyter, p. 195, ISBN 978-3-11-082580-0: "The earliest relevant usage that I myself have found is Hindavi swarajya from 1645, in a letter of Shivaji. This might mean, Indian independence from foreign rule, rather than Hindu raj in the modern sense.
- ↑ "Pune marks Shiv Jayanti- Mumbai Mirror". mumbaimirror. Archived from the original on 2020-02-17. Retrieved 2020-02-17.