శివ్-హరి భారతదేశానికి చెందిన సంగీత దర్శకులు. వీరిలో సుప్రసిద్ధ సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ, సుప్రసిద్ధ వేణు నాథసంగీతకారుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఇద్దరు కలిసి హిందీలో ‘సిల్సిలా’, ‘లమ్హే’, ‘చాందిని’ వంటి హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించారు.[1] శివ-హరి కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నారు. వారు 2011లో లండన్, సింగపూర్ వంటి పలు ప్రాంతాల్లో పర్యటించారు.[2][3]

శివ్-హరి
మూలంభారతదేశం
క్రియాశీల కాలం1967–2022
సభ్యులు

శివ్-హరి 1967లోనే గిటారిస్ట్ బ్రిజ్ భూషణ్ కబ్రా యొక్క చురుకైన భాగస్వామ్యంతో 'కాల్ ఆఫ్ ది వ్యాలీ' పేరుతో ఆల్బమ్‌ను రికార్డ్ చేశారు. ఈ ఆల్బమ్‌లో గిటార్‌ని వినూత్నంగా ఉపయోగించడం వల్ల పాశ్చాత్య దేశాల ప్రజలలో ఇది ప్రజాదరణ పొందింది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఇప్పటివరకు రికార్డ్ చేయబడిన అత్యంత విజయవంతమైన ఆల్బమ్‌లలో ఇది ఒకటి.[4]

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు మార్చు

  • సిల్సిలా (1981)
  • ఫాస్లే (1985)
  • విజయ్ (1988)
  • చాందిని (1989)
  • లమ్హే (1991)
  • పరంపర (1993)
  • సాహిబాన్ (1993)
  • డర్ (1993)

ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మార్చు

  • సిల్సిలా (1981)
  • చాందిని (1989)
  • లమ్హే (1991)
  • డర్ (1993)

మూలాలు మార్చు

  1. "Santoor magic". The Hindu. Chennai, India. 27 February 2005. Archived from the original on 5 March 2005.
  2. The Times of India (2011). "Shiv-Hari duo to perform at Singapore" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
  3. Shiv-Hari in Concert - inSing.com Archived 2012-03-18 at the Wayback Machine
  4. Sharma, Shivkumar (15 September 2000). "The Valley Recalls, Vol. 1" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=శివ్-హరి&oldid=4076348" నుండి వెలికితీశారు