శుక్రాచార్యుడు హిందూ పురాణాల్లో రాక్షసుల గురువు. వీరి త౦డ్రి గారు బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడైన బ్రుగు మహర్షి మరియు తల్లి గారు ఉశనల


శుక్రాచార్యుడు
Shukra.jpg
Venus
దేవనాగరిशुक्र
సంప్రదాయభావంగ్రహము మరియు అసురులు, దైత్యులు ల గురువు
భార్యఉర్జస్వతి
వాహనంమొసలి లేక ఏడు అశ్వాల రథము
దండుని రాజ్యముపై బురద వర్షము కురుస్తున్నపుడు దానికి దూరముగా తన ఆశ్రమమునకు దగ్గరగా ఉన్న కొలను దగ్గర ఉండమని తన కూతురు అరుజకు సలహా ఇస్తున్న శుక్రాచార్యుడు.

అంగీరస మహర్షి దగ్గర వేద విద్యనభ్యసించడానికి వెళతాడు శుక్రుడు. అక్కడ ఆయన తన కుమారుడైన బృహస్పతి వైపు పక్షపాతం చూపిస్తున్నాడని కలత చెందుతాడు. తర్వాత గౌతమ మహర్షి దగ్గరకు వెళతాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదిస్తాడు. ప్రియవ్రతుని కుమార్తె యైన ఉర్జస్వాతిని పరిణయమాడి నలుగురు కుమారులు ఒక కుమార్తెను సంతానంగా పొందుతాడు. వారి పేర్లు చండ, అమార్కుడు, త్వాష్ట్ర, ధరాట్ర మరియు దేవయాని.

ఇదే సమయంలో బృహస్పతి దేవతలకు గురువౌతాడు. ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రుని తల్లిని చంపుతాడు. ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనకు తెలిసిన సంజీవని మంత్రం ద్వారా మృతులైన అసురులను బతికిస్తూ రాక్షసులు దేవతలమీద విజయం సాధించేలా చేస్తాడు.