అంగీరసుడు
అంగిరసుడు అన్న పేరుతో చాలా మంది పురాణ పురుషులు ఉన్నారు మన పురాణాల్లో. వారిలో కొందరు:
- అంగిరస ముని: చాందోగ్యోపనిషత్తు ప్రకారం ఈయన పేరుమీదనే ముఖ్య ప్రాణమును అంగిరసము అని ఋషులు పిలుస్తారు.
- అంగిరసుడన్న బ్రహ్మ మానస పుత్రుడు: భారతం లోని కథ ప్రకారం - ఒకసారి అగ్నిదేవునికి కోపం వచ్చి తన రూపము ఉపసంహరించుకొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కానీ, తన స్థానాన్ని ఎవరైనా ఆక్రమిస్తారేమో అని భయపడి తపస్సు ముగించుకుని వచ్చేసరికి తన స్థానంలో బ్రహ్మ అంగిరసుని నియమించాడని తెలుసుకున్నాడు. అందువల్ల దిగులు చెందితే అంగిరసుడు తానుగా ఆ పదవి త్యజించాడు అని ప్రతీతి.
- అంబరీషుని మునిమనవలను అంగిరసులని అంటారు. వీరు అంబరీషుని మనుమడైన హరితుని కుమారులు. నాగలోకానికి వెళ్ళి పాములను హింసిస్తూ ఉంటే నాగులు వెళ్ళి పురుకుత్సుని వేడుకోగా అతను వీరిని నాగలోకం నుండి వెళ్ళగొట్టాడని విష్ణు పురాణం కథ.
- బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈయోగసిద్ధి అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొని అతనియందు విశ్వకర్మను కనెను. తొల్లి అగ్నిదేవుఁడు దేవతలతోడి యలుకచే హవ్యంబుల వహింపనొల్లక వనమునకు చన దేవతలు అధికతపోవిజృంభితుఁడగు అంగిరసుని అగ్నిపదమునందు ఉంచిరి. అంత కొంతకాలమునకు వెనుక అగ్ని మరలి రాఁగా అంగిరసుఁడు అతనిని ప్రథమాగ్నియయి ఉండుమని తాను అతనికి ప్రథమపుత్రుఁడయి అగ్నిసారూప్యమున తేజరిల్లె. ఈరూపమున ఇతనికి శివ అను భార్యయందు బృహజ్జ్యోతి, బృహత్కీర్తి, బృహన్ముఖుఁడు, బృహన్మతి, బృహద్భానుఁడు, బృహస్పతి, బృహద్బ్రహ్మ అను నేడుగురు కొడుకులును, అనుమతి, రాక, సినీవాలి, కుహువు, అర్చిష్మతి, హవిష్మతి, మహామతి అను నేడుగురు కూఁతులును పుట్టిరి. వీరును వీరి సంతతివారందఱును అగ్నిస్వరూపులయి ఉందురు.
- ఉల్ముకుని కొడుకు. అంగుని తమ్ముఁడు.
అంగీరసుడు, అంగిరుడు అను ఈ ఇద్దరు ఒక్కరే వేరు వేరు కాదు.1. బ్రహ్మమానసపుత్రులలో ఒక్కఁడు. భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈయోగసిద్ధి అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొని అతనియందు విశ్వకర్మను కనెను.
తొల్లి అగ్నిదేవుఁడు దేవతలతోడి యలుకచే హవ్యంబుల వహింపనొల్లక వనమునకు చన దేవతలు అధికతపోవిజృంభితుఁడగు అంగిరసుని అగ్నిపదమునందు ఉంచిరి. అంత కొంతకాలమునకు వెనుక అగ్ని మరలి రాఁగా అంగిరసుఁడు అతనిని ప్రథమాగ్నియయి ఉండుమని తాను అతనికి ప్రథమపుత్రుఁడయి అగ్నిసారూప్యమున తేజరిల్లె. ఈరూపమున ఇతనికి శివ అను భార్యయందు బృహజ్జ్యోతి, బృహత్కీర్తి, బృహన్ముఖుఁడు, బృహన్మతి, బృహద్భానుఁడు, బృహస్పతి, బృహద్బ్రహ్మ అను నేడుగురు కొడుకులును, అనుమతి, రాక, సినీవాలి, కుహువు, అర్చిష్మతి, హవిష్మతి, మహామతి అను నేడుగురు కూఁతులును పుట్టిరి. వీరును వీరి సంతతివారందఱును అగ్నిస్వరూపులయి ఉందురు.