శుక్రాచార్యుడు

(శుక్ర మహర్షి నుండి దారిమార్పు చెందింది)

శుక్రాచార్యుడు హిందూ పురాణాల్లో రాక్షసుల గురువు. వీరి త౦డ్రి గారు బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడైన బ్రుగు మహర్షి, తల్లి గారు ఉశనల


శుక్రాచార్యుడు
Venus
దేవనాగరిशुक्र
సంప్రదాయభావంగ్రహము , అసురులు, దైత్యులు ల గురువు
భార్యఉర్జస్వతి
వాహనంమొసలి లేక ఏడు అశ్వాల రథము
దండుని రాజ్యముపై బురద వర్షము కురుస్తున్నపుడు దానికి దూరముగా తన ఆశ్రమమునకు దగ్గరగా ఉన్న కొలను దగ్గర ఉండమని తన కూతురు అరుజకు సలహా ఇస్తున్న శుక్రాచార్యుడు.

అంగీరస మహర్షి దగ్గర వేద విద్యనభ్యసించడానికి వెళతాడు శుక్రుడు. అక్కడ ఆయన తన కుమారుడైన బృహస్పతి వైపు పక్షపాతం చూపిస్తున్నాడని కలత చెందుతాడు. తర్వాత గౌతమ మహర్షి దగ్గరకు వెళతాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదిస్తాడు. ప్రియవ్రతుని కుమార్తె యైన ఉర్జస్వాతిని పరిణయమాడి నలుగురు కుమారులు ఒక కుమార్తెను సంతానంగా పొందుతాడు. వారి పేర్లు చండ, అమార్కుడు, త్వాష్ట్ర, ధరాట్ర, దేవయాని.

ఇదే సమయంలో బృహస్పతి దేవతలకు గురువౌతాడు. ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రుని తల్లిని చంపుతాడు. ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనకు తెలిసిన సంజీవని మంత్రం ద్వారా మృతులైన అసురులను బతికిస్తూ రాక్షసులు దేవతలమీద విజయం సాధించేలా చేస్తాడు.అందుకని శుక్రుడి దగ్గర మృత సంజీవనీవిద్యను నేర్చుకొని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనే వాడిని పంపిస్తారు.

శుక్రుడి దగ్గర శిష్యుడిగా చేరుతాడు కచుడు.చాలా శ్రద్ధగా గురుసేవ చేస్తుంటాడు.గురువుకు కచుడంటే యిష్టం ఏర్పడుతుంది.శుక్రాచార్యుడి కూతురు దేవయాని కచుడిని ప్రేమిస్తుంది.

కచుడిని శుక్రాచార్యుడు అభిమానిం చడం చూసిఅసూయ చెందిన రాక్షసులు చాలాసార్లు అతనిని చంపడానికి ప్రయత్నిస్తారు. ప్రతి సారీ దేవయాని అతన్నికాపాడుతుంది.యిలా కాదని రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రాచార్యుడి చేత త్రాగిస్తారు.దేవయాని కచుడిని కానక అతని జాడ చెప్పమనితండ్రిని బ్రతిమాలుతుంది. .శుక్రాచార్యుడు యోగ దృష్టితో అంతా గ్రహించి అతన్ని మృతసంజీవనీ విద్యతో బ్రతికించాడు..కానీ కచుడు శుక్రాచార్యుడి కడుపులోనే వుండిపోయాడు.అప్పుడు శుక్రాచార్యుడు దేవయాని చెప్పిన మేరకు కచుడికి మృతసంజీవనీ విద్య భోదిస్తాడు.తన కడుపు చీల్చుకొని బయటికి వచ్చి తరువాత మృతసంజీవనీ విద్య ప్రభావంతో తనను బ్రతికించమని శుక్రాచార్యుడు కచుడితో చెప్తాడు. కచుడు అలాగే బయటికి వచ్చి శుక్రాచార్యు డిని బ్రతికిస్తాడు.సురవల్ల ఈ అనర్థం జరిగింది, కచుడు మృతసంజీవనీ విద్య నేర్చుకున్నాడు.కనుక రాక్షసులకు సురా పానాన్ని నిషేధిస్తాడుశుక్రాచార్యుడు.తను వచ్చిన పని అయిపొయింది కనుక యింక వెళ్ళిపోవడానికి గురువును అనుమతి అడుగుతాడు.కచుడు. కచుడు వెళ్లి పోతున్నాడని తెలిసి దేవయాని తను అతన్ని ప్రేమిస్తున్నాననీ అందుకనే యిన్ని మార్లు అతన్ని కాపాడా ననీ చెప్పి తననుపెండ్లిచేసుకోమంటుంది కచుడిని.కచుడు గురువు కూతురు సోదరితో సమానమని నేను చేసుకోనని అంటాడు కచుడు.దానితో ఆగ్రహించిన దేవయాని నీకు మృతసంజీవనీ విద్య పనికి రాకుండా పోతుందని శాప మిస్తుంది దేవయాని. .వెంటనే కచుడు నాకు పనికి రాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనికి వస్తుంది.అని చెప్పి అనుచితమైన కోరిక కోరినందు వల్ల ఆమెకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతి శాపము యిస్తాడు కచుడు. కచుడు దేవతల దగ్గరికి వెళ్లి ఆ విద్య వారికి ఉపదేశిస్తాడు.ఈ విధంగా మృతసంజీవనీ విద్య దేవతలకూ సంప్రాపిస్తుంది.

వృష పర్వుడు అనే ఒక రాక్షసరాజు కూతురు శర్మిష్ఠ.శుక్రాచార్యుడు వృషపర్వుడిగురువు.వృషపర్వుడికి శుక్రాచార్యు డంటే విపరీతమైన భక్తీ, భయము.ఆయన తన మృత సంజీవనీ విద్య వల్ల చనిపోయిన రాక్షసులను ఆయన బ్రతికించడం ఒక కారణమైతే ఆయనకు కోపం వస్తే శాపం పెడతాడనే భయం కూడా వుండేది.శర్మిష్ఠ, దేవయాని స్నేహంగా వుంటూ వుండే వారు.శర్మిష్ఠకు తను రాజు కూతురుననే అహంకారం చాలానే వుండేది. ఒకసారి శర్మిష్ఠ, దేవయాని మరి కొందరు చేలికత్తెలూ కలిసి వనవిహారమునకు వెళ్ళారు.అక్కడ కొలనులో స్నానం చేద్దామనుకొని తమ తమ దుస్తులను ఒడ్డున వుంచి నీళ్ళ లోకి దిగుతారు.కాసేపు నీళ్ళలో సరదాగా గడిపి స్నానం చేసి ఒడ్డుకు వద్దామనుకునేసమయములో . పెద్ద గాలి మొదలవుతుంది. దానితో హడావుడిగా బయటకు వచ్చి గాలికి చెల్లాచెదురైన తమ దుస్తులను తీసుకునే హడావుడిలో దేవయాని తొందరలో పొరపాటున శర్మిష్ఠ దుస్తులను ధరిస్తుంది.శర్మిష్ఠ విధి లేక దేవయాని దుస్తులను ధరిస్తుంది.నేను రాజకుమారిని నీ తండ్రి నా తండ్రి యిచ్చే జీతం తీసుకొనిబ్రతుకుతున్నాడు.నా దుస్తులు ధరించడానికి నీ కెంత ధైర్యం అని నిందిస్తుంది దేవయాని తను కావాలని ధరించలేదనీ పొరబాటున అలా జరిగిందని ఎంత చెప్తున్నా వినకుండా చాలా చులకనగమాట్లాడుతుంది. అప్పుడు దేవయానికీ కోపం వస్తుంది మా నాన్న లేకపోతె మీ నాన్నకు జీవితమేలేదు.ఆయనవల్లనే మీరు హాయిగా రాజ భోగాలుఅనుభవిస్తున్నారు అని ఎదిరించి మాట్లాడుతుంది.అప్పుడు శర్మిష్ఠ కోపంతో దేవయానిని తన చెలికత్తెల సహాయంతో ఒక పాడుబడ్డ కూపం లోకి తోసేసి వెళ్ళిపోతుంది..

దేవయాని ఎవరైనా నాకు సహాయం చేయండి అని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తూవుంటుంది.అక్కడికి యయాతి అనే రాజు వేట కై వచ్చి దారి తప్పి పోయి ఆ బావి దగ్గరికి వస్తాడు.ఆ అరుపులు నూతి లోనుంచి వస్తున్నాయని తెలుసుకొని నూతి లోకి తొంగి చూసి అద్భుతమైన సౌందర్యవతి యైన దేవయానిని చూస్తాడు.ఆమెకు తన కుడిచెయ్యి అందిచ్చి నూతిలోనుంచి బయటికి లాగుతాడు. .నా కుడిచేతిని పట్టుకుని పాణిగ్రహణం చేశావు కనుక నాకు నీతో వివాహం అయిపోయినట్టే నన్ను యధావిధిగా పెళ్లి చేసుకోమని అడుగుతుంది..

ఆమె శుక్రాచార్యునిముద్దుల కూతురని తెలుసుకొని కాదంటే ఆయన శాపం యిస్తాడని భయపడి సరే నంటాడు యయాతి. యయాతిని .తండ్రి దగ్గరకు పిలుచుకొని వెళ్లి శర్మిష్ఠ చేసిన పనిని, యయాతి తనను రక్షించిన విధము ఏడ్చుకుంటూచెప్తుంది.యయాతిని పెళ్ళిచేసు కుంటానని చెప్తుంది.అక్కడే వివాహంచేసుకుంటుంది.యయాతి ఆమెను రాచ మర్యాదలతో తర్వాత పిలుచుకొని వెళ్తానని చెప్పి తన రాజ్యానికి వెళ్లి పోతాడు. తర్వాత దేవయాని శర్మిష్ఠ ను, ఆమె తండ్రి యైన వృష పర్వుడినీ శిక్షించా లని పట్టుబడుతుంది.ఆమె మీది ప్రేమతో శుక్రాచార్యుడు వృషపర్వుడినిపిలిపించిఆయన కూతురు చేసిన నిర్వాకం చెప్పి తాను యిక మీదట నీకు గురువుగా వుండను రాజ్యం విడిచి వెళ్లి పోతాననీ బెదిరిస్తాడు.వృష పర్వుడికి దిక్కుతోచకుండా అయిపోతుంది. శుక్రాచార్యుడు లేకపోతే ఎలా అని. నా కూతురికి మీరు ఏ శిక్ష వెయ్యదలుచుకుంటే ఆ శిక్ష వేయమనీ మీరు రాజ్యం విడిచి వెళ్ళ వద్దనీ బ్రతిమ లాడతాడు.నా కూతురు దేవయానే శర్మిష్ఠకు ఏమి శిక్ష వెయ్యాలో నిర్ణయిస్తుందనీ చెప్తాడు శుక్రాచార్యుడు. దేవయానిని పిలిచి వృష పర్వుడు నీవే ఆమెకు ఏమి శిక్ష వెయ్యాలో చెప్పమని అడుగుతాడు.అప్పుడు దేవయాని నేను యిప్పుడు యయాతి మహారాజుగారి భార్యను నేను కాపురానికి వెళ్ళేటప్పుడు నా వెంట దాసిగా శర్మిష్ఠ రావాలనీ తను పెళ్లి చేసుకోకుండా జీవితాంతమూ తనకు సేవలు చెయ్యాలనీ షరతు పెడుతుంది. .విధిలేక కూతురిని ఒప్పించి దేవయాని వెంట దాసీగా పంపిస్తాడు. దేవయాని యయాతికి తనతో తప్ప వేరేవారితో సంబంధం పెట్టుకో కూడదనీ అతనికి వారితో సంతానం వుండకూడ దని, నియమం పెడుతుంది. రాణి అయ్యాక దేవయాని శర్మిష్ఠను దూరంగా వున్న తోటలో ఒక ఆశ్రమము తయారు చేయించి అందులో ఉంచుతుంది.శర్మిష్ఠ అందం చూసి యయాతి ఆమె వలలో పడతాదేమోనని ఆమె పడతాడేమోనని ఆమె భయం. దేవయానికి యయాతి వల్ల యదు, తుర్వసుడు అనే కొడుకులుపుడతారుఒకసారి యయాతి శర్మిష్ఠ వుండే తోటకి వెళ్ళడం తటస్థిస్తుంది.అక్కడ శర్మిష్ఠను చూస్తాడు.ఆమె సౌందర్యానికి ముగ్ధు డవుతాడు.ఆమెను నీవెవరివని అడుగుతాడు.ఆమె దేవయాని చేసిన పని గురించి చెప్పి నాకు కూడా పెళ్లి.చేసుకునే హక్కు వుందనీ దాన్ని లేకుండా దేవయాని చేసిందనీ తనకూ పిల్లలు కావాలనీ చెప్పి ఏడుస్తుంది.యయాతికి జాలి కలుగుతుంది.ఆమె మీద మోహము కూడా కలుగు తుంది.ఆమెతో రహస్యంగా కాపురం చేస్తాడు.శర్మిష్ఠకు అతడి వల్ల ద్రుహ్వి, అనువు, పూరుడు అనేకొడుకులు పుడతారు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న దేవయాని యయాతినినిలదీస్తుంది.నియమభంగం చేశాడని తన తండ్రికి ఫిర్యాదుచేస్తుంది.శుక్రాచార్యుడు నీకు వార్ధక్యం వచ్చుగాక అనిశాపంయిస్తాడు.అప్పుడు యయాతి గురువర్యా!నన్ను క్షమించి నన్ను శాప విముక్తుడిని చేయండి.

నాకింకా కామోపభోగముల మీద ఆశ తీరలేదు అని ప్రార్థిస్తాడు.శుక్రాచార్యుడు ఎవరైనా నీ వార్ధక్యం తీసుకొని తమ యౌవనాన్నినీకు యివ్వగలిగితే నీకు యవ్వనం వస్తుంది.నీకు కాంక్షలు తీరాక మరీ అతనికి ఆ యౌవన౦ తిరిగి యిచ్చి వేయవచ్చు అని చెప్తాడు.

యయాతి దేవయాని కొడుకులను పిలిచి మీలో ఎవరైనా నా వృద్ధా ప్యాన్ని తీసుకొని మీ యౌవనాన్నినాకు ఇవ్వగలరా? అని అడుగుతాడు.అప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు.శర్మిష్ఠ కొడుకులలో పురుడు ఒక్కడూ తండ్రి కోరిక తీర్చడం తనయుని ధర్మమని ఒప్పుకుంటాడు. అప్పుడు యయాతి యౌవనాన్ని పొందుతాడు.తనివితీరాసుఖభోగాలుఅనుభవించిన తర్వాత యౌవనాన్ని పూరుడికి యిచ్చి తాను వానప్రస్థానికి వెళ్ళిపోతూ, తాను అడిగిన వెంటనే తనకు యౌవనాన్ని యిచ్చిన పూరుడికే తన తర్వాత రాజు అయ్యే అధికారం ఉంటుందని ప్రకటించి అతనికి రాజ్యాభిషేకం చేసి వెళ్ళిపోతాడు. దేవయాని ఎంత కష్ట పడినా చివరికి శర్మిష్ఠ కొడుకే రాజవుతాడు.అలాగ పూరుడు పౌర వంశ స్థాపకుడయ్యాడు.