శృంగారకవి సర్వారాయకవి

శృంగారకవి సర్వారాయ కవి (1864-1939) ప్రముఖ తెలుగు రచయిత.

వీరు ఆరువేలనియోగి శాఖీయుడు. ఆపస్తంబసూత్రుడు, కౌండిన్యస గోత్రుడు. వీరి తల్లి: రామాంబ. తండ్రి: పల్లమరాజు. వీరి జన్మస్థానము: గోదావరీ మండలంలోని ఇంజరం గ్రామం. జననము: 1864 సం. రక్తాక్షి సంవత్సర ఆషాఢ బహుళ చతుర్థీ గురువారము. నిర్యాణము: 1939 మార్చి 13వ తేదీ - బహుధాన్య వత్సర ఫాల్గున బహుళాష్టమీ సోమవారము.

రచనలు మార్చు

స్వగ్రంథ సీసమాలిక : పరికింపు లక్షణాపరిణయంబును, శివానందలహర్, మహిమ్నస్తవంబు, మల్లేశశతకము, మఱి ముకుందశతంబు, నీతిదర్పణము, స్త్రీనీతిదర్పణము, సుభద్రా పరిణయము, దేవీ దండకము, నిందుముఖి వివాహమును, రామ జననము, నవతారచరితము, గీతతారావళియును, బదరత్నమాల, యాంధ్ర పదజ్యోత్స్న, వ్యాకృతి రాజంబు, నీతికథాళి, సునీతిచంపు జనరలు తెలుగు, ప్రసంగ రత్నావళి, ప్రశ్నోత్తర ప్రదీపమును, స్తుతికదంబము, చాటుముక్తాళి, విదుల, బాలదీపికయు, వివేకదీపికయును, సామెతలు, స్నుషావిజయము, ఛందోలక్షణంబు, నాటకలక్షణంబు, శబ్ద లక్షణము, కావ్యలక్షణము, గుణప్రకాశిక, దివ్యభాగవత గీత, రూపకమాల, కఠోపనిషత్తు (?) పురాణమణిమంజరి, గురుకుమారచరిత, సీమరాణి, సివిక్సు, శ్రీవేంకటేశ్వర శతకమ్ము, మానసశతకము, హరి సేవాకలాపంబు, దైవస్తుతి, వినోదవల్లి, ప్రబంధ నిబంధనంబు, కవి జీవిత త్రయి, కావ్యవిశిష్టంబు, సంఖ్యాప్రదీప, మీశ్వరశతంబు సర్వనిర్వచనంబు, బంధనిబంధంబు, లలితసారస్వత లక్షణంబు, చంద్రిక, బాలవాచకము, స్వచరిత భారప్రయోగములు, పురాణకథలు, ప్రహసనమాల, యుపన్యాసవితతి, వినాయకాది విలాస నాటకంబు సూక్తి ముక్తావళి, షోడశ రాజచరిత్ర, ప్రతాపరుద్రీయము, సుగుజ ప్రకాశిక, సూక్తి, కర్ణచరితంబు ప్రయత కాత్యాయన పరిణయ, మనామ య, మను డెబ్బది యొకకృతులను రచించి హస్తిహస్త నవేందు సంఖ్యాప్రమాణ హూణ సంవత్సరమున కనూన భక్తి నీకునర్పించితిని జుమి నీరజాక్ష ! స్వచారిత్రము నుండి.

మూలాలు మార్చు